తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా? | Man Smashes Boy Head On Ground Over Fight With His Father Near Mumbai cctv captures | Sakshi
Sakshi News home page

తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?

Mar 31 2026 4:04 PM | Updated on Mar 31 2026 6:01 PM

Man Smashes Boy Head On Ground Over Fight With His Father Near Mumbai cctv captures

స్వల్ప వివాదానికే ముక్కపచ్చలారని చిన్నారిపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్నవసాయి ప్రాంతంలో, తండ్రితో వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని దారుణండి కొట్టాడు. చిన్నపిల్లాడు అన్న కనికరం కూడా లేకుండా  తీవ్రంగా దాడి చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.  దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ దారుణ ఘటన ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన  విజువల్స్‌ ప్రకారం నిందితుడు సందీప్ పవార్, ఒక చిన్న విషయంపై బాలుడి తండ్రితో గొడవడ్డాడు.  తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో.. క్షణికావేశంతో చేశాడో గానీ  అక్కడే ఆడుకుంటున్న బాలుడు విఘ్నేష్‌ తన ప్రతాపాన్ని చూపించాడు.  పసుపు రంగు టీ-షర్టులో విఘ్నేష్ అక్కడే ఆగి ఉన్న ఆటో-రిక్షాలో కూర్చుని ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉ‍న్నాడు.  ఆగ్రహంతో  ఊగిపోతూ నిందితుడు బాలుడు కాళ్లు పట్టుకుని ఆటోలోంచి బయటకు లాగాడు.  బాలుడిని నేలపై ఒకసారిగా విసిరి కొట్టాడు.  తరువాత భవనం లోపలికెళ్లి, చిన్నారి తలను ఇనుప రాడ్‌కు కొట్టి, మళ్లీ నేలపై పడేశాడు.

ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్‌ మీద నుంచి తోసేశాడు!

తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మీరా రోడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్య అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేశారు.   

ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య
 

ఇదీ చదవండి : భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement