బెంగళూరులో పెను విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన యువ టెకీ దంపతులు బెంగళూరులో విషాదకరమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32), సోమవారం తన అపార్ట్‌మెంట్‌లోని ఒక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాను చందర్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పనిచేస్తున్నాడు. అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) తమ ఇంటి తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆమె పదేపదే తలుపు తట్టినా లోపల ఉన్న భర్త స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భద్రతా సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారు బలవంతంగా తలుపు తెరిచి చూడగా, భాను మృతదేహం కనిపించింది.
ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యం
కొన్ని నిమిషాల తర్వాత, షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదంలో మునిగి పోయాయి. తెలంగాణలో కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా రెండు వేర్వేరు బలవంతపు మరణాలు కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాలనుపోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. వీరి మరణాలకు ప్రేరేపించిన అంశాలు ఆరోగ్య సమస్యలా? మానసిక క్షోభ? ఇతర కారణాలపై ఆరాతీస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!


