మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026
7
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించండి
● కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావా ణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్లు, దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలన్నా రు. ప్రత్యేక అధికారులు హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. కాగా, ప్రజావాణిలో 168వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, జిల్లాస్థాయి అఽధికారులు పాల్గొన్నారు.
వచ్చిన వినతుల్లో కొన్ని..
గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పంచాయతీకి చెందిన నరేందర్, కాంతారావు, పాపారావు, శ్రీను ఆ గ్రామంలోని ఫర్టిలైజర్స్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఎరువులు ఉద్దెర ఇచ్చి వడ్డీలు వేసి లక్షల్లో వసూళ్లు చేసి ఇబ్బందులు పెడుతున్నారని వినతిలో పేర్కొన్నారు. వ్యాపారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా కేంద్రం శివారులోని 107 సర్వే నంబర్‌లో భూ కబ్జా చేసిన ఓం నారాయణపై చర్యలు తీసుకోవాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్ వినతిపత్రం అందజేశాడు.
దర్యాప్తు నాణ్యతను బలోపేతం చేయాలి
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ, కేసుల్లో దర్యాప్తు నాణ్యతను బలోపేతం చేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన వివిధ రకాల కేసులపై సమీక్షించారు. పెండింగ్ కేసులు, గ్రేవ్ నేచర్ కేసులు, మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించిన కేసులపై చర్చించారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ విధానం, సాంకేతిక ఆధారాల వినియోగం, సాక్షుల వాంగ్మూలం నమోదు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రతీ కేసులో చట్టపరమైన విధానాలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా కేసుల్లో చార్జిషీట్లను పూర్తిస్థాయిలో ఎలాంటి లోపాలులేకుండా కోర్టులో దాఖలు చేయాలన్నారు. చార్జిషీట్ల తయారీలో ప్రతీ అంశం స్పష్టంగా ఉండేలా, సాక్ష్యాధారాలు బలంగా ప్రతిపాదించేలా, కోర్టులో కేసు నిలబడే విధంగా రూపొందించాలన్నారు. దర్యాప్తు అధికారుల బాధ్యతను గుర్తుచేస్తూ కేసుల్లో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నేరస్తులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం అందేలా దర్యాప్తు చేయడం పోలీస్ అధికారుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తరచూ రాత్రి పర్యటనలు నిర్వహించి పోలీస్ వ్యవస్థ పనితీరును సమీక్షించాలని సూచించారు. గంజాయి తాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమావేశం అనంతరం ఇటీవల మూడు కేసుల్లో నిందితులకు శిక్షలు విధించేలా కృషి చేసిన సీడీఓలు, సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ శబరీష్ అభినందించి, ప్రశంస పత్రాలను అందజేశారు. వారి పనితీరును ఇతర అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల సామర్థ్యాల పరిశీలన
మహబూబాబాద్ అర్బన్: మూడో తరగతి విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరిశీలించినట్లు డీఈఓ రాజేశ్వర్ సో మవారం తెలిపారు. విద్యార్థులు చదవడం, రాయడం, సులభమైన అంకగణిత ప్రక్రియలను పరిశీలించామని తెలిపారు. జిల్లాలో డీఈడీ అభ్యర్థులతో ఏడు పాఠశాలల ఎఫ్‌ఎల్‌ఎస్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు. ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.


