నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

గ్రామాల్లో అంగన్‌వాడీ కోడిగుడ్ల విక్రయం

అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

మహబూబాబాద్‌: ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని, అందుకు సంబంధిత అఽధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌పై డిస్ట్రిక్‌ లెవల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. పథకాలపై విస్త్తృత ప్రచారం చేయాలన్నారు. బ్యాంకర్లతో మాట్లాడి రుణాల విషయంలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీమన్నారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

మరిపెడ రూరల్‌: మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం అంగన్‌వాడీ కేంద్రం–1ను అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. కేంద్రంలోని చిన్నారులు ప్రార్థన చేయగా వారిని అదనపు కలెక్టర్‌ అభినందించారు. కేంద్రం నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని సీడీపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, సీడీపీఓ ఎల్లమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ విజయానంద్‌, ఎంపీఓ సోంలాల్‌, సూపర్‌వైజర్‌ రాజ్యలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్‌ రేణుక పాల్గొన్నారు.

ఇనుగుర్తి: చిన్నారులు, గర్భిణుల, బాలింతలకు అందించే అంగన్‌వాడీ కోడిగుడ్లు గ్రామాల్లో విక్రయిస్తున్న ఘటన మండలంలోని చిన్ననాగారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో కిశోర్‌ ఎగ్‌ సప్లయర్‌ పేరుతో ఉన్న టాటాఏస్‌ వాహనంలో తిరుగుతూ కేసు కోడిగుడ్లు రూ.60నుంచి రూ.70వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేసిన గ్రామస్తులు కోడిగుడ్లపై అంగన్‌వాడీ ముద్ర ను గమనించి తహసీల్దార్‌ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చారు. కొడిగుడ్ల వాహనాన్ని స్ధానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన గుడ్లను పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులపై దర్యాప్తు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement