● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్ రూరల్: రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో మొక్కజొన్న కొనుగోళ్లు జరపాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ స్నేహశబరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్దతు ధర కల్పిస్తూ కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.2,400 చెల్లించాలని, రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఈనామ్ విధానం ద్వారా కొనుగోలు చేయాలన్నారు. పెసర్లు, మినుములు, వేరుశనగ, తదితర పంటలవైపు దృష్టిమరల్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కాగా ఎకరానికి వచ్చిన దిగుబడి మొత్తం కొనుగోలు చేసేలా ఆదేశించాలని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుజన్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సరిత, ఏడీఏ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ డీఎం వెంకటేశ్వర్లు, ఏఓ తిరుపతిరెడ్డి, ప్రమోద్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకంగా నిర్వహించాలి
మహబూబాబాద్:స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎలక్టోరల్ అఽధికారి సుదర్శన్‌రెడ్డి సంబంఽధిత ఉన్నతాధికారులతో కలిసి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. వీసీలో కలెక్టర్ స్నేహ శబరీష్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం డ్రగ్స్ నిర్మూలనపై సంబంధిత అధికారులతో సమావేఽశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలన్నారు.


