● నేడు సారథి పోర్టల్‌పై
అవగాహన
ఖిలా వరంగల్ : రవాణాశాఖ సేవలన్నీ సారఽథి పరివాహన్ పోర్టల్ ద్వారా అందించాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్టీఏ సేవలను మరింత సులభతరం చేసి దళారుల ప్రమేయం తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణ రవాణాశాఖ ఇటీవల పోర్టల్‌లో చేరింది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి రాకుండా ఇంటి వద్ద కూర్చొని సారఽథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, శాశ్వత లైసెన్స్ (డీఎల్) పొందే ఆవకాశం ఉంది. ఈప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుందని ప్రచారం జోరందుకుంది. ఈ విధానంతో వాహనదారులు మొబైల్ ఫోన్, కంప్యూటర్ నుంచి ఆన్‌లైన్‌లో లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) పరీక్ష పాస్ కావడం అంత సులభం కాదని, ఒక్కసారి పరీక్ష ఫెయిల్ ఆయితే మరోసారి స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయం తెలిసి మంగళవారం వాహనదారులు పెద్ద ఎత్తున స్లాట్స్ బుక్ చేసుకున్నారు. మంగళవారం 70ఎల్‌ఎల్‌ఆర్, 50 డీల్ కోసం వాహనదారులు సారథి పోర్టల్‌లో స్లాట్స్ బుక్ చేసుకుని ఆర్టీఏకు చేరుకున్నారు. అనంతరం జీరో కౌంటర్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించి ఆర్టీఏ సేవలు అందుకున్నారు.
రేపు మెగా జాబ్‌మేళా
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) ప్రాంగణంలో రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు మెగాజాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.చందర్ తెలిపారు. వివరాల కోసం వరంగల్ ఐటీఐ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


