హన్మకొండ: హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 నాయకులు కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని హనుమకొండ కలెక్టరేట్‌లో టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షడు దొనికల సదయ్య, కార్యదర్శి చిట్ల ఓదేలు, వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్యగౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


