మహబూబాబాద్ అర్బన్: జీవశాస్త్రానికి అత్యంత డిమాండ్ ఉందని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇస్తారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రి కళాశాలలో గురువారం జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం ఆధ్వర్యంలో జీవశాస్త్రాల్లో బహుముఖ పరిశోధనపై జాతీయ సెమినార్ ముగింపు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్తారి హాజరై మాట్లాడారు. మెమోరీ, ఎపిజెనెటిక్స్, న్యూరల్ మెమోరీ వంటి అభివృద్ధి చెందుతున్న అంశాలను పరిశీలిస్తే జీవిశాస్త్రంలో రాణించవచ్చాన్నారు. ప్రొఫెసర్లు వెంకయ్య, నారాయణ మాట్లాడుతూ.. మానవ సంక్షేమానికి మాలిక్యులర్ సాంకేతికతను తెలుసుకోవాలని, పరిశోధనలను, మౌలిక ప్రదర్శనలను విశ్లేషించాలని సూచించారు. అనంతరం జాతీయ సదస్సులో పాల్గొన్న వారికి కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌నాయక్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మరిపెడ ప్రిన్సిపాల్ జీవన్‌కుమార్, కన్వీనర్ అనిల్, అధ్యాపకులు మసూద్‌ఆహ్మద్, శ్రీనివాస్, సాంబశివరావు, అన్నపూర్ణ, హతీరాం, సుమలత, ఉపేందర్, ఖాసీంషా, సుమన్, రవితేజ, సంతోష్ పాల్గొన్నారు.


