మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మామిడాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి కమల్ కుమార్, అసిస్టెంట్ ఎన్నిక ల అధికారులుగా జీ.సునీత, ఎం.ప్రవీణ వ్యవహరించారు. న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఎన్నికల అధికారి కమల్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్యనారాయణ గెలుపొందినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఉపాధ్యక్షుడిగా వి.హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జంగం సిద్ధార్థ, సహాయ కార్యదర్శిగా కొర్రమున్న, కోశాధికారిగా కాసాని మౌనిక, మహిళా ప్రతినిధిగా ఎన్.రాజమణి, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా బుర్ర శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా కట్కూరి శ్రీనివాస్, దర్శనం రామకృష్ణ ఎన్నికై నట్లు ప్రకటించారు.


