ఈ–నామ్‌లో సాంకేతిక సమస్య | - | Sakshi
Sakshi News home page

ఈ–నామ్‌లో సాంకేతిక సమస్య

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

సాయంత్రం వరకు ప్రారంభమైన కాంటాలు

కేసముద్రం: ఈ–నామ్‌ విధానంలో కొత్తగా అప్‌డేట్‌ చేసిన 2.0వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో రైతులు రోజంతా తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రైతులు మక్కలు, మిర్చి బస్తాలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకువచ్చారు. దీంతో ఉదయం 194 మంది రైతులకు లాట్‌ ఐడీలు ఇచ్చారు. ఈ క్రమంలో వ్యాపారులు రైతులు తీసుకువచ్చిన సరుకులను చూసిన అనంతరం, టెండర్లు వేసే క్రమంలో లాగిన్‌ ఓపెన్‌ కాలేదు. సాయంత్రం వరకు సాంకేతిక సమస్య అలాగే ఉండడంతో, చేసేదీ ఏమీలేక మాన్యువల్‌గా చీటీలపై ధరలను వేసి రైతులకు ఇచ్చారు. అప్పటి వరకు రైతులు పంట రాశుల వద్ద, మరికొందరు మార్కెట్‌ ఆఫీస్‌ వద్ద విన్నర్‌ జాబితా కోసం పడిగాపులు పడుతూ ఇబ్బందులు పడ్డారు. కాగా సాయంత్రం 6 గంటలకు కాంటాలు మొదలు పెట్టడంతో రాత్రి సమయంలో తొలకాలు జరిగాయి. మార్కెట్‌కు 10వేల మక్కల బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మానుకోట వ్యవసాయ మార్కెట్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement