మరిపెడ రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బాలికలకు ఉచితంగా పంపిణీ చేసే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం మరిపెడ మండలకేంద్రంలోని పీహెచ్‌సీలో వారం రోజులుగా నిర్వహిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ కౌన్సిలర్ మేరుగు రాముతో కలిసి పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ మహిళల్లో వచ్చే గర్భాశయ కేన్సర్ నివారించడంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. 14–15 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సినేషన్ పంపిణీ అందేల వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుగులోతు రవి, డాక్టర్ పూజిత, పీహెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, స్టాఫ్ నర్సు పద్మ, చైతన్య, రత్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వర్‌రావు


