● కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కడియం కావ్య
హన్మకొండ చౌరస్తా : వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపం విస్తరణతో పాటు మిగిలిన పనులకు రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయాలని గతేడాది వరంగల్ ఎంపీ కడియం కావ్య.. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీ వినతిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం రూ.14.44 కోట్లు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు. చారిత్రక వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి, పురావస్తు శాఖ అధికారులకు ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు.


