మరిపెడ: గడ్డి మందు తయారీని నిలిపివేయాలని మరిపెడ ము న్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మరిపెడలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. గడ్డి మందు వాడకం వల్ల భూమిలో సారం తగ్గి దిగుబడి తగ్గుతుందన్నారు. ప్రభుత్వం నిషేధిత గడ్డి మందును తక్షణమే నిలిపివేయాలని కోరారు. నాయకులు కుడితి నర్సింహరెడ్డి, షేక్ తాజుద్దీన్, షేక్ నజీర్ పాల్గొన్నారు.
అన్ని సౌకర్యాలు కల్పించాలి
ప్రజలకు, వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మరిపెడ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మరిపెడలో సంతను ఆమె ప్రారంభించి మాట్లాడారు. సంతలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ప్రభుత్వం నిర్మించిన మార్కెట్‌లో విక్రయాలు జరుపాలని వ్యాపారులకు సూచించారు. షేక్ ఖలీల్, ఖాదర్, సంత కాంట్రాక్టర్ మహ్మద్ వసీం, కౌన్సిలర్లు గుగులోతు నీలాలచ్చిరాం, మెరుగు రాము, భిక్షపతి, ఉపేందర్ ఉన్నారు.


