సివిల్స్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Apr 7 2026 7:25 AM | Updated on Apr 7 2026 7:25 AM

హన్మకొండ కల్చరల్‌: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2027 విద్యాసంవత్సరానికి సివిల్‌ సర్వీసెస్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ ఉచిత శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోందని విద్యావేత్త, చమక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ ఆజం అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు అర్హులన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ 2026, మే 26 కాగా, ప్రవేశపరీక్ష 2026 జూన్‌ 6న దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. వివరాలకు http//admission.jmi.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

హర్జ్యతండా వద్ద ఘటన

గీసుకొండ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం హర్జ్యతండా వద్ద వరంగల్‌–నర్సంపేట రహదారిపై చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్‌ కథనం ప్రకారం..హైదరాబాద్‌ బహదూర్‌పూరకు చెందిన భూక్య రవి(36) బైక్‌పై నర్సంపేట వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో హర్జ్యతండా వద్ద ఎదురుగా నర్సంపేట వైపునకు వెళ్తున్న టాటా ఏస్‌ .. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు టాటా ఏస్‌ డ్రైవర్‌ పొన్నం వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ విశ్వేశ్వర్‌ తెలిపారు.

వార్డు సభ్యురాలి ఆత్మహత్య

ఖానాపురం : మండలంలోని బుధరావుపేటకు చెందిన ఓ వార్డు సభ్యురాలు సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్ర కారం.. గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యురాలు గారె అనూష (28) సోమవారం గ్రామ పంచాయతీలో నిర్వ హించిన సమావేశానికి హాజరైంది. అనంతరం ఇంటికెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త రవికుమార్‌, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, అనూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

చింతల్‌లో మనస్తాపంతో మహిళ..

ఖిలా వరంగల్‌ : భర్త మందలించాడనే కారణంతో ఓ మహిళ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం రాత్రి వరంగల్‌ చింతల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చింతల్‌ ప్రాంతానికి చెందిన రత్న అనూష(30), సురేశ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలో అనూషను భర్త మందలించడంతో మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఆరెపెల్లి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేశ్‌ సోమవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement