గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

పర్వతగిరి: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తూనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం టూక్యానగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. టూక్యానగర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌(46) సోమవారం విధులకు హాజరయ్యాడు. పాఠం బోధిస్తున్న క్రమంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే నెక్కొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మృతుడు చంద్రశేఖర్‌ది సంగెం మండలం కాట్రపల్లి గ్రామం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు.

వడదెబ్బతో యువకుడి మృతి

కురవి: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కురవి మండలం కొత్తూరు(సీ)లో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పత్తేపురపు బాబు(36) రేకుల ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడు రోజులుగా రేకుల కింద ఉండడంతో ఎండకు అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఆరోగ్యం క్షీణించి సోమవారం మృతి చెందాడు. మృతుడు బాబుకు భార్య రేణుక, కూతురు, కుమారుడు ఉన్నాడు.

చెక్‌ బౌన్స్‌ కేసులో ఒకరికి జైలు

ములుగు రూరల్‌ : చెక్‌ బౌన్స్‌ కేసులో ఒకరికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యోత్స్న తీర్పు వెలువరించినట్లు ఎస్సై ఉపేందర్‌ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు మండలానికి చెందిన శంకర్‌ అనే వ్యక్తి వద్ద 2023లో శ్రీనివాస్‌ అనే వ్యక్తి రూ. 8లక్షల అప్పు తీసుకొని చెక్‌ అందించాడు. చెక్కును బాధితుడు బ్యాంకులో వేయగా బౌన్స్‌ అయింది. దీంతో శంకర్‌పై శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి కోర్టులో హాజరుపర్చుగా నేరం రుజువు కావడంతో జడ్జి.. శ్రీనివాస్‌కు నెల రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement