విద్యా కమిషన్‌వి ఏకపక్ష సిఫారసులు | - | Sakshi
Sakshi News home page

విద్యా కమిషన్‌వి ఏకపక్ష సిఫారసులు

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

తొర్రూరు: విద్యా కమిషన్‌ ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్షంగా సిఫారసులు చేసిందని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బాలాష్టి రమేశ్‌ అన్నారు. డివిజన్‌ కేంద్రంలో టీపీటీఎఫ్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రమేశ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై కాకుండా ఉపాధ్యాయుల వేతనాలపై కమిషన్‌ నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా కమిష న్‌ వ్యవహరించిందన్నారు. ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయదర్శిని మాస పత్రిక సంపాదకుడు సూరం ఉపేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కొండం జనార్దన్‌రెడ్డి, నాయకులు కొలుపుల శ్రీనివాస్‌, చింతల సురేష్‌, కుమారస్వామి, రమేశ్‌ పాల్గొన్నారు.

డిప్యుటేషన్‌పై కార్యదర్శుల బదిలీ

మరిపెడ రూరల్‌: మరిపెడ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు డిప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు. మండలంలోని 48 గ్రామ పంచాయతీలకు 31మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తుండగా.. గత నెల తాళ్లఊకల్‌ కార్యదర్శి బదిలీ అయ్యాడు. దీంతో 30 మంది విధులు నిర్వర్తిస్తుండగా.. ఇద్దరిని మినహాయించి 28మందిని డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నేడు వారు విధుల్లో చేరనున్నట్లు అధికారులు తెలిపారు.

సంకటహరచతుర్థి పూజలు

హన్మకొండ కల్చరల్‌: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సా యంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్‌ శర్మ, ప్రణవ్‌, శ్రవణ్‌ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహా హారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి

కాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్‌ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్‌ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్‌ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్‌ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్‌, డాక్టర్‌ ఆడెపు రవీందర్‌, వడ్నాల నరేందర్‌, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్‌, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్‌, ఆడెపు రవి, ఎలగం వెంకటమల్లు, బూర వేణుమాధవ్‌, పిట్టరాములు, వలుస కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement