వేలేరు: రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని బండతండా, కమ్మరిపేట, వేలేరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు, సీసీ రోడ్ల ప్రారంభం, చింతలతండాలో సీసీ రోడ్లు, జీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వేలేరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలంటే సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. వేలేరు, చిల్పూరు మండలాలకు వచ్చే జూన్ చివరి నాటికి గండి రామారం లిఫ్ట్ –1 పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానన్నారు. అనంతరం పలువురు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, మహిళా సంఘం సభ్యులకు డ్రోన్ అందజేశారు. తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసన్న, ఏఓ కవిత, సర్పంచ్‌లు యాదగిరి, కిరణ్, అశోక్, మనోజ్, అనిత, అరుణ, మౌనిక, మానస, సాంబయ్య, రాజు, శ్రీనివాస్, ఎంపీఎం అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, మాజీ ఎంపీపీ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, నాయకులు సద్దాం హుస్సేన్, రాజిరెడ్డి, లక్ష్మణ్ నాయక్, రణధీర్ రెడ్డి, సలీంమాలీక్, సునీల్, సంపత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి


