● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్: వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తు న్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మె ల్యే ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధి దారులకు సబ్సిడీ పై డ్రోన్, బేయిలర్స్ వంటి వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 13 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు, 43 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మక్కలు అమ్మిన 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెల్లడించా రు. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని కాబట్టి రైతులు వ్యవసాయ యాంత్రికరణ దిశగా ముందుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ యాంత్రికరణ ద్వారా పెట్టుబడి తగ్గి రైతుకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులు స్టేషన్ ఘన్‌పూర్‌కు మంజూరు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో కడియం శ్రీహరి మార్క్ అభివృద్ధి కనిపించాలన్నదే తన తాపత్రయమని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసుకోవాలని, రాజకీయాలకు అతీ తంగా గ్రామాలను అభివృద్ధి చేసుందామని సర్పంచులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్ పాల్గొన్నారు.


