● కలెక్టర్ స్నేహ శబరీష్
● ప్రజావాణిలో 195 వినతులు
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని వి భాగాల జిల్లా అఽధికారులు ప్రతీ సోమవారం ని ర్వహించే ప్రజావాణికి తప్పక హాజరుకావాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ దరఖాస్తులను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రజా వాణిలో 195 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


