ఆన్‌ సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌ సైట్‌ ఎఫ్‌ఐఆర్‌

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

బాధితుల వద్దకు వెళ్లి సత్వర న్యాయం

జిల్లా వ్యాప్తంగా 35 కేసులు నమోదు

ఎస్పీ శబరీష్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసులు అమలు చేస్తున్న ఆన్‌ సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ విధానం ఫలితాలు ఇస్తోంది. పోలీస్‌స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు రావాల్సిన అవసరం లేకుండా, స్వయంగా పోలీసులు ఘటన స్థలాని వెళ్లడం లేదా బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయడం ఆన్‌ సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ విధానం ప్రత్యేకత.

ప్రధాన అంశాలు..

● మహిళలు, చిన్నారులపై నేరాలు

● లైంగిక నేరాలు (పోక్సో, అత్యాచారం తదితరాలు)

● ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాలు

● ఆస్తి సంబంధిత నేరాలు (చోరీ, దోపిడీ)

వృద్ధులపై నేరాలు

● ప్రత్యేక చట్టాల కింద కేసులు (వరకట్నం, బాల్య వివాహాలు, ర్యాగింగ్‌ మొదలైనవి)

● పోలీస్‌స్టేషన్‌కు రాలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు సంబంధించిన ఇతర నేరాలు

● ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆన్‌ సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. బాధితుల వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

జిల్లా వ్యాప్తంగా 35 కేసులు..

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 35 ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ కేసులు నమోదు చేశారు. ఈ విధానం వల్ల బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీసు సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది.

సత్వర న్యాయం అందించడమే లక్ష్యం

బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్‌శాఖ లక్ష్యం. ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్‌ ద్వారా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం. జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలి. ఆన్‌ సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ ద్వారా బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీసు సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది.

– శబరీష్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement