ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి

Mar 27 2026 9:57 AM | Updated on Mar 27 2026 9:57 AM

తొర్రూరు : విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ కంపెనీ యూనియన్‌ చైర్మన్‌ ధరావత్‌ సికిందర్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం డివిజన్‌ కేంద్రంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయం ఎదుట ఆర్టిజన్‌, అన్‌మ్యాన్డ్‌, స్పాట్‌ బిల్లర్స్‌, పీస్‌ రేట్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సికిందర్‌ మాట్లాడుతూ..విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే అన్ని రకాల కార్మికులకు జీఓ 11ప్రకారం కనీస వేతనం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ చైర్మన్‌ పసుపులేటి మధు, కన్వీనర్‌ శ్రీనివాస్‌, కో చైర్మన్‌ నాగరాజు, కో కన్వీనర్‌ రమేష్‌, ప్రతినిధులు హరిప్రసాద్‌, ప్రకాశ్‌, వీరన్న, శ్రీను, వెంకన్న పాల్గొన్నారు.

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థుల పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మహేశ్‌ అన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలల బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టౌన్‌ అధ్యక్షుడు షబ్బీర్‌, నాయకులు సుశ్వాంత్‌, దిలీప్‌, సంజయ్‌, వినయ్‌, విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు.

ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యం

డోర్నకల్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తోందని డోర్నకల్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కొండేటి రాజకుమారి తెలిపారు. గురువారం పలు వార్డుల్లోని ముస్లింలతో సమావేశమై రంజాన్‌ కానుకలను పంపిణీ చేశా రు. వైస్‌ చైర్మన్‌ లావణ్యశ్రీనివాస్‌, కౌన్సిలర్లు, ముస్లింలు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల సమస్యల

పరిష్కారానికి..

పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొండేటి రాజకుమారి తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె, రేడియం జాకెట్‌, బూట్లు పంపిణీ చేశారు. అనంతరం పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌కు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మాదా లావణ్యశ్రీనివాస్‌ వాటర్‌ ఫ్యూరిపయర్‌ బహూకరించారు.

ఇందిరమ్మ కమిటీ సభ్యుల తొలగింపునకు తీర్మానం

బయ్యారం : బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులను తొలగిస్తూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. గురువారం సర్పంచ్‌ శాంతికిషన్‌నాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మెజార్టీ సభ్యులు ప్రస్తుత ఇందిరమ్మ కమిటీ సభ్యులను తొలగించి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని ప్రతిపాదనతో ఆమోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement