‘క్రీస్తు జ్యోతి’లో టెక్నోజిల్‌–2026 ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘క్రీస్తు జ్యోతి’లో టెక్నోజిల్‌–2026 ప్రారంభం

Mar 29 2026 8:38 AM | Updated on Mar 29 2026 8:38 AM

జనగామ : మండలంలోని యశ్వంతాపూర్‌ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో టెక్నోజిల్‌–2026 మహోత్సవ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను కళాశాల డైరెక్టర్‌ విజయపాల్‌రెడ్డి ప్రారంభిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాల కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఉదయం టెక్నోజిల్‌ క్విజ్‌, రంగోలి, ఐడియాథాన్‌, స్లో బైక్‌ రేస్‌ పోటీలు నిర్వహించారు. కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ విభాగంలో మొదటి, ద్వితీయ సంవత్సరంలో 60 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. రంగోలి పోటీల్లో 10 గ్రూపులు పాల్గొని మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా ముగ్గులు వేశారు. 80 మంది విద్యార్థులు స్లో బైక్‌ రేస్‌లో డ్రైవింగ్‌ ప్రతిభ కనబరిచారు. ప్రతిభ కనబరిచిన వారిని కళాశాల డైరెక్టర్‌ విజయపాల్‌రెడ్డి, ప్రి న్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో టెక్నోజిల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పీ.యూ అనిత, వంశీకృష్ణ, అమరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement