అణగారిన వర్గాల కోసం పోరాడిన జగ్జీవన్‌ రామ్‌ | - | Sakshi
Sakshi News home page

అణగారిన వర్గాల కోసం పోరాడిన జగ్జీవన్‌ రామ్‌

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

హన్మకొండ: సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానేత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ అని టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జగ్జీవన్‌రాం జయంతిని నిర్వహించారు. ఈసంద్భంగా జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రా మ్‌ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక విప్లవానికి నాంది పలికిన మహానుభావుడని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజాసేవకుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన నిర్వహించిన పా త్ర దేశ నిర్మాణంలో కీలక మలుపు తిప్పిందన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించడమే లక్ష్యంగా ఆయన చూపిన దారిని ప్రతీ ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేయడం, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూడడం అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌ రావు , వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్‌, సి.ప్రభాకర్‌, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ బోనాల కిషన్‌, సీజీఎం రవీంద్రనాథ్‌, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు వేణు బాబు, గిరిధర్‌, ప్రభా వతి, అధికారులు కళాధర్‌ రెడ్డి, నీలారపు రాజేందర్‌, నాగేశ్వర్‌ రావు, దేవేందర్‌, రాధిక పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement