● ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు ఆదివారం వేయిస్తంభాల దేవాలయంలో ఆయన మాట్లాడుతూ వేయిస్తంభాల దేవాలయం అభివృద్ధికి, కల్యాణమండపం పునరుద్ధరణ పనులకు కేంద్రపురావస్తుశాఖ రూ.14.44కోట్లతో టెండర్ పిలువడంపై హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పురావస్తుశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. విదేశీ టూరిస్టులు, భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తున్న సందర్భంలో దేవాలయం, కల్యాణమండపం చుట్టూ ఉన్న మట్టి, రాళ్లతో, ఎండతాకిడికి ఇబ్బందిపడుతున్నారని గడ్డితో గార్డెనింగ్ చేయాలని, పచ్చనిచెట్లతో, పూలమొక్కలతో సుందరీకరణ, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్‌శర్మ, విశ్వనాథ కాశీలింగాచారి, శ్రవణ్‌కుమార్, రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు మామిడాల గణపతి, కట్ల రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


