పరకాల: చేపల పెంపకంలో భాగంగా చెరువులో మందు చల్లడానికి వెళ్లిన మత్స్యకారుడు మృత్యువాతపడిన ఘటన పరకాల మండలం నాగారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన పల్లెబోయిన రాములు(68) గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులతో కలిసి నాగారం గ్రామ శివారులోని కంజరకుంట చెరువులో చేపలకు మందువేయడానికి వెళ్లారు. ఈక్రమంలో రాములు చెరువునీటిలో మునిగి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకా రులు పోలీసులకు సమాచారమందించగా రెస్క్యూ టీంతో కలిసి మూడు గంటలపాటు వెతికి మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు.
కోమట్లగూడెం గ్రామ శివారులో..
గంగారం : చెరువులో పడి ఒకరు మృతిచెందిన ఘ టన మహబూబాబాద్ జిల్లా కోమట్లగూడెం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమట్లగూడెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి సారయ్య(51) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసుల కు సమాచారం అందించారు. ఎస్సై రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వయంగా చెరువులోంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గూడూరుకు తరలించారు. సారయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.


