బండికి.. దండిగా! | - | Sakshi
Sakshi News home page

బండికి.. దండిగా!

Apr 4 2026 8:19 AM | Updated on Apr 4 2026 8:19 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఓరుగల్లు రైల్వేకు నిధుల వరద

దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

మహబూబాబాద్‌: దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌, అధికారులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి రహిత

గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి

నెల్లికుదురు: గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరిపై ఉందని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మన గ్రామం–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో అందించిన హెల్మెట్లను ఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు హెల్మెట్‌ కొనుగోలు చేయడమే కాదు.. వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గ్రామస్తులంతా ఏకతాటిపై ఉంటూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేసుకోవాలన్నారు. గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు శ్రమించాలన్నారు. మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు, కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్‌ బాబు, సర్పంచ్‌ బండి శ్రీనివాస్‌ ఉన్నారు.

పీఆర్‌ ఈఈ విద్యాసాగర్‌ సరెండర్‌

మహబూబాబాద్‌: పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ విద్యాసాగర్‌ను కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ పీఆర్‌ఆర్‌డీ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. వెంటనే ఆ కార్యాలయంలో పని చేస్తున్న డీఈ టెక్నికల్‌ ఆదిత్యరాజ్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ నిధులు రూ.49 కోట్లు కేటాయించగా మార్చి 31వరకు అందులో రూ 4.50 కోట్లు మిగలడంతో కలెక్టర్‌ ఈఈని సరెండర్‌ చేసినట్లు సమాచారం.

జనాభా గణాంకాలు కీలకం

మహబూబాబాద్‌: ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణాంకాలు కీలకమని జనాభా లెక్కల శాఖ డైరెక్టర్‌ భారతి హోలికేరి అన్నారు. కలెక్టరేట్‌లో మాస్టర్‌ శిక్షణ అధికారులకు జనాభా గణనపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి జనాభా గణన చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

క్షిణ మధ్య రైల్వే పరిధి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు భారీగా నిధులు కేటాయించారు. 2026–27 రైల్వే బడ్జెట్‌ (పింక్‌ బుక్‌)లో హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, క్వాడ్రప్లింగ్‌ (నాలుగు లైన్లు), సర్వేలు, నిర్మాణంలో ఉన్న మూడో లైన్‌ పూర్తి, స్టేషన్ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్‌ పెద్దపీట వేసింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కేటాయింపులతో కూడిన పింక్‌బుక్‌ శుక్రవారం విడుదల కాగా, అధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది.

కొత్త లైన్లు, డబ్లింగ్‌ పనులు.. భారీగా నిధులు

ఉమ్మడి వరంగల్‌ మీదుగా వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు నిధుల కేటాయింపు జరిగింది. కొత్త లైన్లు, డబ్లింగ్‌, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.

● కాజీపేట–విజయవాడ మధ్య 219.64 కి.మీ.పొడవైన మూడో లైన్‌, విద్యుద్దీకరణ పనుల కోసం రూ.1,955.27 కోట్లు మంజూరు చేశారు.

● కాజీపేట–బల్లార్షా వరకు 201.04 కి.మీ. పొడవైన మూడో లైన్‌ పనులకు రూ.2,063.03 కోట్లు ఇచ్చారు.

● నష్కల్‌ (పెండ్యాల) – హసన్‌పర్తి నడుమ 24.55 కి.మీ. బైపాస్‌ లైన్‌ నిర్మాణానికి రూ.465.29 కోట్లు మంజూరయ్యాయి.

● భద్రాచలం రోడ్‌ – డోర్నకల్‌ వరకు 54.65 కి.మీ సెక్షన్‌ పనుల కోసం రూ.770.12 కోట్లు కేటాయించారు.

● కాజీపేట – బల్లార్షా మెయిన్‌ లైన్‌ను పెద్దపల్లి–కరీంనగర్‌ లైన్‌తో అనుసంధానించే 2.169 కి.మీ. బైపాస్‌ లైన్‌ కోసం రూ.36.99 కోట్లు కేటాయించారు.

● ఘన్‌పూర్‌–సూర్యాపేట (పాలకుర్తి మీదుగా) 170 కి.మీ. కొత్త లైన్‌ సర్వేకు నిధులిచ్చారు.

● బీజాపూర్‌–వరంగల్‌కు 288 కి.మీ.ల కొత్త లైన్‌ కోసం సర్వేకు కూడా అనుమతి ఇచ్చారు.

● క్వాడ్రప్లింగ్‌ (నాలుగు లైన్ల) సర్వేలకు కూడా నిధులు ఇచ్చారు.

రైల్వేస్టేషన్లకు ‘అమృత్‌ భారత్‌’ హంగులు

‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌’ కింద ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా.. వరంగల్‌ స్టేషన్‌ తూర్పు వైపు ఎంట్రీ అభివృద్ధి, బుకింగ్‌ ఏరియా, కాన్‌ కోర్స్‌ మెరుగుదల కోసం రూ.4.50 కోట్లిచ్చారు. వరంగల్‌ స్టేషన్‌లో 12 మీటర్ల వెడల్పు గల కొత్త ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ) కోసం రూ. 13.24 కోట్లు, కాజీపేట స్టేషన్‌ ఆధునికీకరణకు రూ.18.73 కోట్లు (జనగామ, యాదాద్రితో కలిపి) కేటాయించారు. కాజీపేటలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్‌ఓబీ కోసం రూ.9.78 కోట్లు, ప్లాట్‌ఫామ్‌ 4–5 వరకు ఎఫ్‌ఓబీ విస్తరణ, లిఫ్టులు, ఎస్కలేటర్ల కోసం రూ.13.93 కోట్లు మంజూరు చేసినట్లు పింక్‌బుక్‌లో పేర్కొన్నారు. మహబూబాబాద్‌ – జనగామ స్టేషన్లలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్‌ఓబీలు, ర్యాంప్‌ల నిర్మాణం కోసం రూ.44.34 కోట్లు, జనగామ గూడ్స్‌ షెడ్‌ సౌకర్యాల మెరుగుదలకు రూ. 6.24 కోట్లు ఇచ్చారు. అలాగే భద్రత పనుల కింద వరంగల్‌ – చింతలపల్లి లెవల్‌ క్రాసింగ్‌ 63 ఏ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25.58 కోట్లు, కాజీపేట – వరంగల్‌ ఎల్‌సీ 61 వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి కోసం రూ. 24.65 కోట్లు, రఘునాథపల్లి – ఇప్పగూడ ఎల్‌సీ 44 వద్ద 2–లేన్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, సబ్‌వే కోసం రూ.12.83 కోట్లు, డోర్నకల్‌ – మణుగూరు మార్గంలో కారేపల్లి – సింగరేణి కొలీరీస్‌ మధ్య వివిధ లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు పింక్‌బుక్‌లో పేర్కొన్నారు.

నీళ్లు లేక ఎండిపోతున్న వరిపొలాన్ని పరిశీలిస్తున్న అధికారులు, రైతులు

గార్ల సమీపంలో అడుగంటిన పాకాల ఏరు

గార్ల: పాకాల ఏరు అడుగంటింది. నీళ్లు లేక బండలు తేలి ఎండిపోయి కనిపిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతంలో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. కాగా పాకాల ఏటిలోకి ఎస్సారెస్పీ లేదా నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు జలాలను వదిలి తమ పంటలను కాపాడాలని గార్ల, బయ్యారం, డోర్నకల్‌ మండలాల రైతులు కోరుతున్నారు.

డిసెంబర్‌లో సమృద్ధిగా నీరు..

డిసెంబర్‌లో పాకాల ఏటిలో నీరు సమృద్ధిగా ఉండడంతో గార్ల, బయ్యారం, డోర్నకల్‌ మండలాల పరిధిలోని పరీవాహక ప్రాంత ఆయకట్టు రైతులు 2వేల ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుంది. ఈక్రమంలో పాకాల ఏటిలో నీళ్లు అడుగంటిపోవడంతో రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వరిపంట సాగు చేశామని, పైరు ఎండిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ లేదా నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు నీటినైనా పాకాల ఏటిలోకి వదిలిపెట్టాలని కోరుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత జిల్లా ఇరిగేషన్‌ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీటిని పాకాల ఏటికి మళ్లించేలా చర్యలు చేపట్టి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

పాకాల ఏరు ఎండిపోతోంది..

పాకాల ఏటి పరీవాహక ప్రాంతంలో నాకున్న 6 ఎకరాల్లో వరిపంట సాగు చేశాను. ప్రస్తుతం ఏటిలో నీళ్లులేక ఎండిపోయే దశకు చేరింది. జిల్లా ఇరిగేషన్‌ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీళ్లు పాకాల ఏటిలోకి విడుదల చేయాలి. లేకపోతే వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

– పి.సంజీవరెడ్డి, రైతు, గార్ల

వరి పంటలను కాపాడాలి..

గార్ల సమీపంలోని పాకాల ఏరు నీరు లేక అడుగంటి పోయింది. నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు నీటిని విడుదల చేసి ఈ ప్రాంతంలో సాగుచేసిన వరిపంటలను కాపాడేందుకు జిల్లా ఇరిగేషన్‌ అధికారులు స్పందించాలి.

– ఏనుగంటి మల్లేశం, రైతు, గార్ల

లైన్‌ కి.మీ నిధులు

భూపాలపల్లి–కాజీపేట (హసన్‌పర్తి) 64 1.60

హసన్‌పర్తి–కరీంనగర్‌ 62 1.55

డోర్నకల్‌–గద్వాల

(సూర్యాపేట, నల్లగొండ మీదుగా) 296 7.40

కాజీపేట–సికింద్రాబాద్‌ 120 2.40

కాజీపేట–విజయవాడ 220 4.40

కాజీపేట–బల్లార్షా 234 4.68

వరంగల్‌–సికింద్రాబాద్‌ 38 0.75

కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు రూ.1,955 కోట్లు

కాజీపేట–బల్లార్షాకు రూ.2,063 కోట్లు

నష్కల్‌–హసన్‌పర్తికి రూ.465.29 కోట్లు

క్వాడ్రప్లింగ్‌, కొత్త రైల్వే సర్వేల కోసం కేటాయింపులు

కాజీపేట జంక్షన్‌ నుంచే పలు మార్గాలు

పీఓహెచ్‌కు రూ.521.36 కోట్లు.. ‘అమృత్‌ భారత్‌’ కింద

స్టేషన్లకు కొత్త హంగులు

2026–27 రైల్వే బడ్జెట్‌ (పింక్‌బుక్‌)లో భారీగా నిధులు

నీరులేక బండలు తేలిన పాకాల ఏరు

వరి పంటలకు అందని నీరు

ఆందోళన చెందుతున్న రైతాంగం

ఎస్సారెస్పీ లేదా పాకాల చెరువు జలాలు వదలాలని విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement