సత్యమార్గంలో నడవాలి | - | Sakshi
Sakshi News home page

సత్యమార్గంలో నడవాలి

Apr 4 2026 8:19 AM | Updated on Apr 4 2026 8:19 AM

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రజల రక్షణ కోసం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారని, క్రీస్తు చూపిన సత్యమార్గంలో నడవాలని వరంగల్‌ మేత్రాసనం పాలనాధికారి ఫాదర్‌ డి.విజయ్‌పాల్‌ రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌లోని ఫాతిమమాత దేవాలయం ఆధ్వర్యంలో గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని పరిశుద్ధ మహా సిలువ యాత్ర కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫాదర్‌ డి.విజయ్‌పాల్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. పవిత్ర శుక్రవారం యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజుగా జరుపుకుంటామన్నారు. సిలువ నుంచి కారిన రక్తంతో ప్రజల పాపాలన్నీ కడిగివేయబడ్డాయని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. మొదటగా ఫాతిమా కమ్యూనిటీ హాల్‌ను ఫాదర్‌ దుగ్గింపుడి విజయ్‌ పాల్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఫాతిమామాత దేవాలయ విచారణ గురువు ఫాదర్‌ వట్టి సైమన్‌ రెడ్డి, శనిగపురం ఏసుగుట్ట గురువులు ఫాదర్‌ పాల్‌ రాజ్‌, ఫాదర్‌ పీటర్‌, ఫాదర్‌ జోసెఫ్‌, ఫాదర్‌ క్రీస్తు, కేసముద్రం చర్చి విచారణ గురువు ఫాదర్‌ శ్రావణ్‌, క్రీస్తు ఆరాధకులు పాల్గొన్నారు.

వరంగల్‌ మేత్రాసనం పాలనాధికారి విజయ్‌పాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement