● కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్: మహనీయుల ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 119వ జయంతి నిర్వహించారు. బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రామ్ దేశానికి అమూల్యమైన సేవలు అందించారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అని కొనియాడారు. మహనీయుల జీవిత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. యువత ఆయన బాటలో నడవాలన్నారు. ప్రతీ ఒక్కరికి ఉన్నత విద్యను అందించాలని ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అఽధికారి శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ సబిత, ఆర్డీఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


