గంగపుత్రుల సంక్షేమానికి పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

గంగపుత్రుల సంక్షేమానికి పాటుపడాలి

Mar 30 2026 8:50 AM | Updated on Mar 30 2026 8:50 AM

గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపటి సైదులు

తొర్రూరు: గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపటి సైదులు కోరారు. డివిజన్‌ కేంద్రంలోని తిరుమల గార్డెన్‌లో ఆదివారం గంగపుత్ర సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సైదులు మాట్లాడుతూ.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న గంగపుత్రులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. చేపల వృత్తిదారులకు కోల్డ్‌ స్టోరేజీలు, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదుమల సంపత్‌కుమార్‌, కోశాధికారి అనుమాస సత్యనారాయణ, నాయకులు అంబటి వెంకన్న, ఆనంద్‌కుమార్‌, పద్మావతి, రాములు, సాంబయ్య, కిరణ్‌, వెంకన్న, పిల్లి నాగరాజు, సంతోష్‌ పాల్గొన్నారు.

వ్యవసాయరంగాన్ని పరిరక్షించండి

నెహ్రూసెంటర్‌: దేశానికి అన్నంపెట్టే రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని పరిరక్షించాలని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కోటేశ్వర్‌రావు, మండల వెంకన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయరంగంపై ఆధారపడిన రైంతాగానికి నష్టం చేసే లా, కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. రైతులు, కార్మికులకు నష్టం కలిగించేలా చట్టాలను సవరిస్తూ తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. సంఘం గ్రామ, మండల, జిల్లా మహాసభలను పూర్తి చేసుకోవాలని, ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్‌లో జాతీయ మహాసభలను నిర్వహించనున్ననట్లు ఆయన పేర్కొన్నారు. ఐలయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement