ఆర్టిజన్‌ జేఏసీని చర్చలకు పిలవాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్‌ జేఏసీని చర్చలకు పిలవాలి

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

హన్మకొండ: విద్యుత్‌ ఆర్టిజన్లను చర్చలకు పిలవా లని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు కే.వీ.జాన్సన్‌ అన్నా రు. హనుమకొండలోని ట్రాన్స్‌కో వరంగల్‌ జోనల్‌ కార్యాలయం వద్ద గురువారం తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించగా.. జాన్సన్‌ సంఘీబావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్లను రెగ్యులరైజ్‌ చేయడానికి విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు అండగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ట్రాన్సో కో అధ్యక్షుడు సంపత్‌ రావు గారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఆర్టిజన్‌ కార్మికులు ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తూ సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిజన్‌ జేఏసీ ట్రాన్స్‌కో విభాగం రాష్ట్ర కన్వీనర్‌ కందికొండ వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాడ దేవేందర్‌ రెడ్డి, తెలంగాణ పవర్‌ డిప్లమో ఇంజనీర్స్‌ అసోసి యేషన్‌ నాయకుడు పుల్యాల రాజిరెడ్డి, తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ సుంకు సతీష్‌ రెడ్డి, కన్వీనర్‌ సింగిరెడ్డి చంద్రారెడ్డి చంద్ర సింగ్‌, వెంకన్న నాయక్‌, సికిందర్‌, భరత్‌, శ్రీనాథ్‌, ఐలయ్య, రాజన్న, సునీల్‌, జనార్ధన్‌, జయచందర్‌, సృజన, రాజేష్‌ నాయక్‌, రంగారావు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే..: ఆర్టిజన్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ సతీష్‌ రెడ్డి

ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ జేఏసీ చైర్మన్‌ సుంకు సతీష్‌ రెడ్డి, కన్వీనర్‌ చంద్రారెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో గురువారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని టీ ఎస్‌ఈఈయూ–327 హనుమకొండ, వరంగల్‌ జి ల్లా కార్యదర్శులు చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్‌ సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్‌ జేఏసీ హనుమకొండ జిల్లా చైర్మన్‌ రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ ఎన్పీడీసీఎల్‌ కంపెనీ చైర్మన్‌ సికింద న్‌, నాయకులు చంద్ర సింగ్‌ ఠాగూర్‌ పాల్గొన్నారు.

టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

కేవీ జాన్సన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement