కేయూలో యూత్‌ పార్లమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

కేయూలో యూత్‌ పార్లమెంట్‌

Mar 29 2026 8:38 AM | Updated on Mar 29 2026 8:38 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగంలో శనివారం విద్యార్థులకు యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ విభాగం అధిపతి డాక్టర్‌ భారవిశర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అజ్మీరా శంకర్‌, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్‌ ఆకులపల్లి మధు పర్యవేక్షణలో ఈ మాక్‌ యూత్‌ పార్లమెంట్‌ను నిర్వహించారు. విద్యార్థి కృష్ణసౌజన్య లోక్‌సభ స్పీకర్‌గా, పి.మహేందర్‌, ఎల్‌.సాయికుమార్‌, ఎన్‌.సురేష్‌, అకింత వివిధ శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్‌, అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం భారత్‌పై ప్రభావం, యువతపై సామాజిక మాధ్యమాలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం ఎలా ఉంది అనే అంశాలపై చర్చించారు. విద్యార్థులకు పార్లమెంట్‌లో తీసుకునే నిర్ణయాలు, బిల్లులు, చట్టాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూత్‌ పార్లమెంట్‌ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ మాక్‌ పార్లమెంట్‌లో ఉత్తమ ప్రదర్శన కనపర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

అన్వేష్‌కు సన్మానం

మేరా యువ భారత్‌ డిపార్ట్‌మెంట్‌ వరంగల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అన్వేష్‌ చింతల స్టేట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందగా గణిత విభాగం అధ్యాపకులు, విద్యార్థులు ఆయనను సన్మానించారు.

ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement