రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం..ఒడిశా రాష్ట్రం నుంచి వరంగల్‌కు గంజాయిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని ఎండు గంజాయితోపాటు కారును స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమిల తాలూకాకు చెందిన విక్రమ్ మండేల్, గౌత మ్ మండేల్, విప్రోజిత్ మండేల్ కారులో 20 కేజీల ఎండు గంజాయిని తరలిస్తున్నారు.ఈ క్రమంలో రహదారిపై కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి లభ్యం కాగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి గంజాయిని తూకం వేసి నిర్ధారణ అనంతరం కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పంచాయతీ సెక్రటరీ అజీజ్‌పాషా, హెడ్ కానిస్టేబుళ్లు రవీందర్, ఏలియా, పోలీసులు హరి, తూళ్ల సంపత్, గణేష్, ప్రవీణ్, సుమన్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
2 కేజీల గంజాయి..
కేసముద్రం : ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకు వచ్చిన 2 కేజీల గంజాయిని తరలిస్తున్న మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధికి చెందిన నలుగురిని కేసముద్రంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపల్ పరిధి ముత్యాలమ్మగూడెనికి చెందిన ఎస్‌కె రఫీ, జుజ్జూరు రఘు, జమాండ్లపల్లికి చెందిన సముద్రాల శ్రీనాథ్, బెస్తవాడకు చెందిన పిట్టల సాయికుమార్ కలిసి కొన్ని నెలలుగా ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి మహబూబాబాద్, కేసముద్రం చుట్టుపక్కల యువతకు గంజాయి విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నెలరోజులుగా వారిపై పకడ్బందీ సమాచారం సేకరించారు. ఈ క్రమంలో కేసముద్రం బైపాస్‌రోడ్డు వైపు నలుగురు కలిసి రెండు కేజీల గంజాయిని తీసుకెళ్తుండగా, వారిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రాయపర్తిలో కారుతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


