బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
7
ప్రజాహితానికి ప్రత్యేక కార్యాచరణ
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : ప్రజాహితం కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనున్నట్లు ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశం మందిరంలో మంగళవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రజల ప్రాణ రక్షణ కోసం హెల్మెట్లు ధరించే విధంగా అవగాహన కల్పిస్తామని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల సహకారం ఉండాలని కోరారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టి హెల్మెట్లు ధరించే విధంగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గంజాయి సేవించే వారిని కట్టడి చేసందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీ నుంచి మూడు వార్డులను, ప్రతీ మండలం నుంచి రెండు గ్రామాలను ఎంపిక చేస్తామన్నారు. గంజాయి కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య పాల్గొన్నారు.
మానుకోట మున్సిపల్ బడ్జెట్‌పై కౌన్సిలర్ల అసంతృప్తి
కాంగ్రెస్, సీపీఐ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం
సమావేశంలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
సిబ్బంది తమ మాట వినడం లేదని చైర్‌పర్సన్ ఆవేదన


