హన్మకొండ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో లక్ష్యం చేరుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్‌ఈ, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వసూళ్ల వంద శాతం సాధించాలన్నారు. ఈ నెల 31 వరకు అన్ని 33 కేవీ ఫీడర్లలో జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ సర్వీస్‌ల మంజూరు వేగంగా పూర్తి చేయాలని కోరారు. ‘జుగా’ పథకంలో మౌలిక వసతులు పూర్తయిన వాటికి వెంటనే మీటర్లు అమర్చాలని సూచించారు. వేసవి కార్యాచరణలో భాగంగా ఓవర్ లోడ్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు పనులు చేపట్టి ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ ఇంటర్ లింకింగ్ లైన్స్ పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈ లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, సీజీఎం ఆర్.చరణ్ దాస్, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, మల్లికార్జున్, కృష్ణ మోహన్, జయరాజ్, వెంకట కృష్ణ, ఉపేందర్, వేణుమాధవ్, వాసుదేవ్, ప్రభావతి, డి.ఈలు అనిల్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


