హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్‌గా ఎస్.భవానీ ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్‌గా బదిలీ చేయగా.. ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్న భవానీ ప్రసాద్‌ను వరంగల్ రీజినల్ మేనేజర్‌గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది.
మొక్కజొన్నకు
బోనస్ చెల్లించాలి
గంగారం : మొక్కజొన్న పంటకు బోనస్ ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఇందులో భాగంగా మొక్కజొన్న పంటకు కూడా రూ.500 బోనస్ వెంటనే అందించాలన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు జరిపి క్వింటాకు ధర రూ.2,400 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యాపా రులు క్వింటాకు రూ.1600 మాత్రమే చెల్లిస్తున్నారన్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరతో మక్కలను కొనుగోలుచేయాలన్నారు. కార్యక్రమంలో అఖిల భారత మహబూబాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఈక భిక్షం, పీడీఎస్‌యూ జిల్లా నాయకుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పూత మొత్తం కాయకాదు
ఈ ఏడాది గతంలో కంటే అధికంగా మామిడిపూత వచ్చింది. అయితే వచ్చిన పూత మొత్తం కాయగా మారదు. జిల్లాలో కొన్ని చోట్ల తామరపురుగు ప్రభావం ఉన్నప్పటికీ మామిడి దిగుబడి మాత్రం ఆశాజనకంగా వస్తుందనే అంచనాలో ఉన్నాం.
– జినుగు మరియన్న,
జిల్లా ఉద్యానవనశాఖాధికారి


