హసన్‌పర్తి: యాప్ వ్యాపారం ప్రాణాలపైకి తీసుకొచ్చింది. వ్యాపారంలో నష్టం రావడంతో ఓ వ్యక్తి గొంతుపై కత్తి దూసుకెళ్లిన సంఘటన నగరంలోని గోపాలపురంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన పొన్నం కార్తీక్, బిట్ల రాంచరణ్, మహర్షి 2025లో ‘లూపింగ్ యాప్’ వ్యాపారాన్ని ప్రారంభించారు. నష్టం రావడంతో ఆ వ్యాపారాన్ని మానేశారు. ఈ వ్యాపారంలో తను పెట్టిన రూ.3 లక్షలు ఇవ్వాలని కార్తీక్ తోటి భాగస్వామి రాంచరణ్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. లావాదేవీల విషయమై పెద్దల సమక్షంలో మాట్లాడడానికి అంగీకరించారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన కార్తీక్ డబ్బుల విషయమై మాట్లాడుకుందామని రాంచరణ్‌ను ఎక్కించుకుని గోపాలపురం చెరువు కట్టపైకి తీసుకెళ్లాడు. కత్తితో గొంతు, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితుడి తండ్రి శ్రీఽనాఽథ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
వ్యాపారంలో నష్టం రావడంతో గొడవ
డబ్బులు ఇవ్వడం లేదని కత్తితో
గొంతుపై దాడి


