హన్మకొండ : సంస్థ అభివృద్ధిలో ప్రతీ ఉద్యోగి కీలకమని హనుమకొండ కలెక్టర్, వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో 2025–2026 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ డీసీసీబీ అత్యుత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరార్థక ఆస్తుల నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించారని, డిపాజిట్ మోబిలైజేషన్, రుణాల పంపిణీ, గోల్డ్‌లోన్ విభాగాల్లో నిర్దేశిత లక్ష్యాలు అధిగమించారన్నారు. సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే మాదిరి అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎంలు చంద్రశేఖర్, చైతన్య రవి, వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ విజయకుమారి, జనరల్ మేనేజర్ ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎంలు, 32 బ్రాంచ్‌ల మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్


