సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డుల ప్రదానం

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

హన్మకొండ కల్చరల్‌: తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌.. 2025 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉత్తమ వార్త చిత్రానికి వరంగల్‌ సాక్షి సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌ పెద్దపెల్లి వరప్రసాద్‌ ఉత్తమ ఫొటో జర్నలిస్టు బహుమతి, జనగామ సాక్షి ఫోటోగ్రాఫర్‌ గోవర్ధనం వేణుగోపాల్‌ కన్సోలేషన్‌ బహుమతి అందుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం వారికి అవార్డులు ప్రదానం చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్‌, విరాహత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement