పెసర.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

పెసర.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి

Apr 7 2026 7:25 AM | Updated on Apr 7 2026 7:25 AM

హన్మకొండ : పత్తి తీసిన తర్వాత ఆ పంట మోడ్‌లను భూమిలో కలియదున్నిన తక్కువ పంట కాలపరిమితి కలిగిన పెసర సాగు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందొచ్చని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్‌.ఉమా రెడ్డి అన్నారు. వరంగల్‌ వ్యవసాయ పరిశోధన స్థానంలో పత్తి అనంతరం పెసర సాగుపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. వ్యవసాయ కళాశాల డీన్‌ రవీందర్‌ నాయక్‌, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్య విద్యార్థులు, రైతులతో కలిసి ఉమా రెడ్డి పెసర పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెసర సాగుతో భూమిలోని నత్రజని శాతాన్ని పొంపొందించుకోవచ్చన్నారు. మార్కెట్‌లో పెసరకు డిమాండ్‌ ఉందని, ఈ నేపథ్యంలో లాభసాటిగా ఉంటుందన్నారు. రైతులు అపరాల సాగుపై దృష్టి సారించాలన్నారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఉమారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement