మహబూబాబాద్ రూరల్: రైతులు, అణగారిన వ ర్గాల అభివృద్ధి, విద్య, వైద్యం, సంక్షేమానికి ఇందిర మ్మ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఓ గార్డెన్‌లో క ల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చె క్కులు శనివారం పంపిణీ చేసి, సన్నబియ్యం లబ్ధి దారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. మహబూబాబాద్ ని యోజకవర్గంలోని 92 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధిలో భాగంగా ప్రజలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. సన్న బియ్యం పథకం ద్వారా ఏప్రిల్, మే, జూన్, మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేస్తున్నామన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు జిల్లాలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించి వారి అభ్యున్నతికి కృషి చేయడానికి జిల్లా యంత్రాంగం ముందుంటుందన్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశంలో డీసీఎస్‌ఓ రమేష్, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, వార్డు కౌన్సిలర్లు, తహసీల్దార్లు చంద్రరాజేశ్వర్ రావు, వివేక్, నాగభవాని, నరేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్
సన్నబియ్యం లబ్ధిదారులతో సహపంక్తి భోజనం, చెక్కుల పంపిణీ


