కాజీపేట అర్బన్ : కాజీపేట వంద పీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏసీబీ ఆకస్మిక తనిఖీ కలకలం రేపింది. ఈ తనిఖీలకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయ షెట్టర్లు, తలుపులను మూసివేసి జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావు, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్‌లను విచారించారు. పలు దస్తావేజులను క్షణ్ణంగా పరిశీలించి, జిల్లా రిజిస్ట్రార్, చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ లు చేశారు. కార్యాలయంలో 204 దస్తావేజులు డబ్బులు ఇస్తేనే ఇస్తామని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ భూక్రయదారులను వేధిస్తున్నాడనే ఫిర్యాదు మేర కు దాడులు నిర్వహించారు. తనిఖీ సమయంలో 20 మంది డాక్యూమెంట్ రైటర్లు 70 డాక్యూమెంట్లతో కార్యాలయం లోపల ఉండడంతో వారి వద్ద నుంచి రూ.45,500 స్వాధీనపరచుకున్నారు. డాక్యూమెంట్ రైటర్ల ఫోన్లను పరిశీలించగా సబ్ రిజిస్ట్రార్లు.. డాక్యూమెంట్ రైటర్ల మధ్య నగదు లావాదేవిలకు సంబంధించిన మేసేజ్‌లను గుర్తించారు. భూక్రయదారులు నేరుగా కార్యాలయానికి వచ్చినా స్పందించడం లేదని డాక్యూమెంట్ రైటర్లతో రావాలని తెలుపుతున్నట్లు నిర్ధారించారు. రిజి స్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదుల మేరకు దర్యాప్తు కొనసాగించి కేసు నమెదు చేస్తామని సాంబయ్య వెల్లించారు. ఇదిలా ఉండగా.. ఆర్వో రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలోని చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహాయ రిజిస్ట్రార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌లతోపాటు ఓ ప్రైవేట్ వ్యక్తి కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. కాగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం కార్యాలయాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లగా కార్యాలయంలోని రిజిస్ట్రర్‌లో సంతకాలు చేసిఉన్నా.. ఎవరూ లేకపోవడంతో సహాయ రిజిస్ట్రార్‌ను పిలిపించి పలు పత్రాలు పరిశీలించారు.
వివరాలు వెల్లడించిన
ఏసీబీ డీఎస్పీ సాంబయ్య


