● నలుగురి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
డోర్నకల్: రూ. 13.41 లక్షల విలువైన 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ చంద్రమౌళి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై వంశీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బైక్‌పై ఇద్దరు, కారులో ముగ్గురు వెళ్తుండగా ఆపారు. బైక్‌పై ఓ బ్యాగు, కారులో రెండు బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి లభించింది. పంచుల సమక్షంలో తూకం వేయగా 26 కిలోల బరువు ఉందని తేలింది. దీని విలువ రూ.31,41,450 ఉంటుంది. దీంతో తనిఖీల సమయంలో కారు నుంచి ఒకరు పారిపోగా నలుగురిని అరెస్ట్ చేసి గంజాయితో పాటు కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ నాగోల్ ప్రాంతానికి చెందిన వాంకుడోత్ వినోద్, ముసారాంబాగ్‌కు చెందిన మల్లెపు శశికాంత్, అంబర్‌పేటకు చెందిన పెంటెం చంద్రశేఖర్, బాపనపల్లి విజయకాంత్ ఉన్నారు. వీరు ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తిరిగొస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఫకీరాతండాలో గంజాయి నిల్వ చేసిన వ్యక్తి అరెస్ట్
నర్సింహులపేట: ఎండు గంజాయి నిల్వ చేసిన నర్సింహులపేట మండలం ఫకీరాతండాకు చెందిన నేతావత్ రూప్లాను అరెస్ట్ చేసినట్లు ఎ స్సై మాలోత్ సురేశ్ తెలిపారు. రూప్లా తన ఇంట్లో గంజాయి నిల్వ చే శాడనే సమాచారం మేరకు టాస్క్‌పోర్స్ సీఐ హథీరాం, ఎస్సై మాలోత్ సురేశ్ సంయుక్తంగా సోమవారం తనిఖీ చేశారు. ఇందులో సుమారు రూ. 2,40,000 విలువైన 4.8 కిలోల సరుకు లభించడంతో సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


