breaking news
Palnadu
-
అభాగ్యులకు పునర్జన్మ
అవయవదానం వల్ల మరొకరికి నూతన జీవితాన్ని ఇవ్వొచ్చు. భూమిపై లేకున్నా ఇతరుల్లో జీవించి ఉండొచ్చు. జిల్ల్లాలో పలువురు బ్రెయిన్‌డెడ్ అవుతున్నారు. అలాంటి వారి కుటుంబ సభ్యులకు అవగాహన పెంచడం ద్వారా ఎంతోమందికి నూతన జీవితాన్ని ప్రసాదించే వీలుంది. ఏటా ఆగస్టు 3న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. గుంటూరు మెడికల్: అవయవాలు అవసరమైన వారు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. దీనికి జీవన్‌దాన్ పేరిట సర్కారు ప్రత్యేక ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి జీవన్‌దాన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి కోసం పలువురు దరఖాస్తు చేసుకుని అవయవాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆపరేషను ఖర్చులు భరించలేక కూడా జీవన్‌దాన్ పథకంలో పేర్లు నమోదు చేయించుకోని వారు అధికంగానే ఉన్నట్లు సమాచారం. అవయవాల కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పలువురు ఎదురు చూస్తున్నారు. సకాలంలో వీరికి అవయవాలు లభించకపోతే ప్రాణాలు కోల్పోవాల్సిందే. మూఢ నమ్మకాలు, అవగాహన లోపంతో ఇప్పటికీ పలువురు అవయవదానానికి ముందుకు రావడం లేదు. తాము ఈ లోకంలో లేకున్నా మరొకరికి దానం చేసిన అవయవాల వలన సజీవంగా ఉండే గొప్ప అవకాశం ఇది. కుటుంబసభ్యులు కూడా ఆ సమయంలో బాధను తట్టుకుని ముందుకు రావడంతో పలువురి ప్రాణాలు నిలిచాయి. అభాగ్యులకు పునర్జన్మ లభించడంతో వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ఏవి దానం చేయవచ్చంటే.. మనిషి కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఇలా సేకరణకు ఐదు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులను అవసరమైన వారికి మూడు గంటల్లోగా అమర్చాలి. కాలేయాన్ని 5 నుంచి 8 గంటలలోపు, మూత్రపిండాలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాలి. కళ్లు చాలా కాలం నిల్వ చేయవచ్చు. నమోదు చేసుకోవడం ఇలా... ఎవరైనా దీనికి అంగీకరించే ముందు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసిన వారందరికీ అవయవ దానం చేస్తున్నట్లు చెప్పాలి. దీని వలన సదరు వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయితే త్వరగా అవయవాలు దానం చేసేందుకు వీలు కలుగుతుంది. www.jeevandan.ap.gov.in వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం వారికి ఓ కార్డును అందజేస్తుంది. అవయవాలు కావాల్సి వస్తే... అవయవ మార్పిడి కోసం జీవన్‌దాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నెంబరు ఇస్తారు. అవయవదానం చేసేందుకు వెబ్సైట్లో సమాచారం ఇస్తే తక్షణమే సీరియల్ నెంబరు ప్రకారం అవయవాలు అమర్చేలా జీవన్‌దాన్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. అవయవ దానంతో నిలుస్తున్న విలువైన ప్రాణాలు ంేపు జాతీయ అవయవ దాన దినోత్సవం -
9 నుంచి శంకర్‌విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): శంకర్‌విలాస్ బ్రిడ్జిపై ఈ నెల 9 నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేసి కూల్చివేత పనులు చేపడుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, అధికారులతో కలిసి నగరంలో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ● ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2 పిల్లర్స్ కాంక్రీట్ పూర్తి అయ్యాయని, 9 నుంచి కూల్చివేత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 135 స్ట్రక్చర్లు ఉండగా వాటిలో 74 మంది అంగీకారం తెలిపారని, వారికి నష్ట పరిహారం ఇచ్చి నిర్మాణాలు తొలగించామన్నారు. ● నందివెలుగు రోడ్‌లోని ఆర్ఓబీ పనులు 10 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయని, 8 నెలల్లో పూర్తి చేసేలా చూస్తామన్నారు. ● మణిహోటల్ సెంటర్లో కల్వర్ట్ నిర్మాణం చేయాల్సినందున ఆర్ అండ్ బీ అధికారులు రెండు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ● ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు 7న టెండర్లు ఓపెన్ అవుతాయని, అనంతరం పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు. ● శారదాకాలనీ రోడ్, బ్రాడీపేట, నెహ్రూనగర్ రోడ్ల విస్తరణకు, ఎల్సీ నం.3 గేటు దగ్గర ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఆటో నగర్, అగతవరప్పాడులను కనెక్ట్ చేసేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ● పీవీకే నాయుడు మార్కెట్‌కు గతంలో చేసిన డిజైన్లు ఎవరికి నచ్చలేదు కనుక రివైజ్డ్ డిజైన్లను నిర్ణయించాలన్నారు. ● నల్లపాడు చెరువు, బొంగరాలబీడు కార్మిక శాఖ స్థలాలను నగరపాలక సంస్థకు కేటాయిస్తూ నిర్ణయం జరిగిందన్నారు. త్వరలో పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక కార్యాచరణ చేపడతామన్నారు. ● అసంపూర్తిగా ఉన్న గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ కాంట్రాక్టర్‌ని తొలగించి, నూతన కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో మరమ్మతులకు గురైన రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ● శిథిలావస్థకు చేరిన బీఆర్ స్టేడియం రిజర్వాయర్ స్థానంలో రూ.2 కోట్లతో నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ● రెడ్డిపాలెం రోడ్ విస్తరణ గతంలో మాస్టర్ ప్లాన్‌కి భిన్నంగా జరిగినందున, సరిచేయాల్సి ఉందని, 3 వంతెనల వద్ద వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తున్నందున, శాశ్వత పరిష్కారం కోసం సుమారు 2 వందల ఆక్రమణలు తొలగించి, వారికి పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ● శారదా కాలనీ రోడ్ విస్తరణలో ప్రభావిత 22 మంది భవన యజమానులకు రూ.50.22 లక్షల నష్ట పరిహార చెక్కులను అందించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కూల్చివేత పనులు ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
బ్లడ్ గ్రూప్ కలవకున్నా కిడ్నీ మార్పిడి
బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసే ఆధునిక పద్ధతి అందుబాటులోకి వచ్చింది. రోగులకు ఈ విధానం ఒక వరం. ‘ఇమ్యూనో ఎషరప్షన్’ అనే ఈ విధానం ద్వారా గుంటూరు వేదాంత హాస్పిటల్లో ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నాం. ఈ పద్ధతిని రాష్ట్రంలో మొదటిసారిగా మా ఆస్పత్రిలోనే అందుబాటులోకి తెచ్చాం. రోగులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం. – డాక్టర్ చింతా రామకృష్ణ, నెఫ్రాలజిస్టు, గుంటూరు -
డీఎస్పీ నాగేశ్వరరావు సేవలు భావితరాలకు ఆదర్శం
నరసరావుపేట రూరల్: డీఎస్పీగా కె.నాగేశ్వరరావు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శం అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు సన్మాన కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ జేవి సంతోష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణలు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన డీఎస్పీ నాగేశ్వరరావును ఎస్పీ కె.శ్రీనివాసరావుతోపాటు పోలీసు అధికారులు సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ గతంలో రవాణా సౌకర్యాల కొరత ఉన్నా నక్సలిజం, ఇతర సవాళ్ల మధ్య ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఈ సేవల వెనుక కుటుంబ సభ్యుల త్యాగం, సహకారం ఎంతో ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు టి.మాణిక్యాలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ కె.శ్రీనివాసరావు -
పింఛన్ల పంపిణీ పరిశీలించిన జిల్లా కలెక్టర్
నరసరావుపేట రూరల్: పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. మండలంలోని కాకాని గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. పీఎంశ్రీ జేఎన్వీలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ చిలకలూరిపేట టౌన్: మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్ (11వ తరగతి) ప్రవేశాలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు ప్రకటించారు. సైన్స్, కామర్స్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. 2024–25లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందుకు అర్హులు అన్నారు. అలాగే 01.06.2008 నుంచి 31.07.2017 మధ్య జన్మించిన వారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కులను ఆధారంగా ఎంపిక చేసుకుని సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని, వాటిని ఆన్లైన్ jnvpanaduadmirrionr@mail.com నమోదు చేయడం గానీ లేదా ప్రత్యక్షంగా విద్యాలయానికి వచ్చి ఇవ్వవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు. కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు రేపల్లె: 2024–25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన కాపు విద్యార్థులకు ఈ నెల 22న రేపల్లె పట్టణంలో జరిగే వార్షిక సమావేశంలో ప్రతిభా పురస్కారాలు అందించటం జరుగుతుందని కాపు సేవా సమితి నాయకులు కె.శివశంకరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత విద్యాసంవత్సరంలో 10వ తరగతిలో 500ల మార్కులుపైగా సాధించిన, ఇంటర్మీడియెట్, ఆపై చదువులలో 85 శాతం మార్కులు సాధించి ప్రస్తుత విద్యాసంవత్సరంలో చదువుకుంటున్న విద్యార్థులకు నగదు పురస్కారాలు అందిస్తామన్నారు. విద్యార్థులు తమ మార్కుల జాబితా, ఆధార్, పూర్తి వివరాలతో కాపు సేవా సమితికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 82478 94595 నంబరులో సంప్రదించాలన్నారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మస్తాన్ నియామకం నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన షేక్ మస్తాన్‌ను వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం రూపాయికే బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ నరసరావుపేట: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఫ్రీడం ప్లాన్, కేవలం రూ.1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబి డేటా, రోజుకు 100 మెసేజ్‌లు, ఉచిత సిమ్‌కార్డు ఇవ్వబడుతుందని గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ సప్పరపు శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఎం.యన్.పి. వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. సత్తెనపల్లి మండలం అబ్బురు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త బాదరబోయిన వెంకటేశ్వర్లు (బుజ్జి) పై అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టుకు హాజరపరచగా రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సృజన్‌కుమార్ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బురు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త పెద్దింటి నాగరాజు, వైఎస్సార్ సీపీ కార్యకర్త బాదరబోయిన వెంకటేశ్వర్లు (బుజ్జి) ఇటీవల ఫోన్లో దూషించుకున్నారు. దీనిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేశాడు. దూషణ కేసులో పెద్దగా శిక్ష పడదని భావించిన అధికార పార్టీ నాయకులు గ్రామానికి చెందిన పులబోలు బ్రహ్మయ్య అనే వ్యక్తి చేత తప్పుడు కేసు పెట్టించారు. తన వెంట గొడ్డలి తీసుకొని చంపుతానంటూ వెంకటేశ్వర్లు వెంట పడ్డాడంటూ ఫిర్యాదు చేయించారు. దీంతో వెంకటేశ్వర్లు పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ తిరస్కరించి రూ. 15 వేలు వ్యక్తిగత పూచీకత్తు పై బెయిల్ మంజూరు చేశారు. రెండు లారీలు ఢీకొని డ్రైవర్లకు గాయాలు వినుకొండ: వినుకొండ మండలం చీకటిగలపాలెం మోడల్ స్కూల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొనగా ఇద్దరు లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు... తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. వాటిని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటనలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికు లు 108కి సమాచారం తెలపడంతో గాయపడిన డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్త కుండా ప్రమాదానికి గురైన వాహనాలను తరలించారు. -
ముందస్తు జాగ్రత్తలతో డెంగీ నివారణ
సత్తెనపల్లి: ముందస్తు జాగ్రత్తలతో దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ, చికున్ గున్యా, మలేరియా, బోద , మెదడువాపు వ్యాధులను నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి అన్నారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ తో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ దోమల నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు దోమలు పుట్టకుండా అలాగే కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మురుగునీరు ప్రవహించేటట్లు చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు సూచించారు. క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను పరిశీలించి సూచనలు చేశారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ మాట్లాడుతూ దోమలను నివారించాలంటే నీటి నిల్వలు లేకుండా చేయాలన్నారు. వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి ఆరబెట్టి మళ్లీ నీరు పట్టుకోవాలని, (ఫ్రైడే డ్రై డే పాటించాలని), పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ దోమ తెరలు వాడుకోవాలన్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ పి గౌతమి ఆధ్వర్యంలో బావులలో, నీటి కుంటల్లో దోమ లార్వాలను తినే గంబుషియా చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ సబ్ యూనిట్ ఆఫీసర్ షేక్ సుభాన్ బేగ్, ఆరోగ్య విస్తరణాధికారి పిట్టల శ్రీనివాస రావు, ఆరోగ్య పర్యవేక్షకులు ఎండీ రెహమాన్, ఎమ్ఎల్హెచ్పీ వైశాలి, ఆరోగ్య కార్యకర్తలు పి.సౌరితేజ, జి నరసింహారావు, ఆశా కార్యకర్తలు, తదితరులు ఉన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి -
హాస్టళ్ల నిర్వహణపై చిత్తశుద్ధి లేదు
నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ఏమాత్రం చిత్తశుద్దిలేదని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పార్టీ తరపున ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం రామిరెడ్డిపేట పాతసమితి కార్యాలయం రోడ్డులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహం–2కు పది ఫ్యాన్లు, లైట్లు శుక్రవారం అందజేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గత నెల 28వ తేదీన ఇదే హాస్టల్‌ను పరిశీలించి అక్కడి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారికి ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చిన విషయం విదితమే. డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం ఎస్సీ హాస్టల్స్‌ను తనిఖీచేసి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఈ హాస్టల్లో విద్యార్థులు చదువుకోటానికి లైట్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూశామని తెలిపారు. దీంతో ఎనిమిది ఫ్యాన్లు, లైట్లు సమకూర్చామన్నారు. దీనికి సహకరించిన దాతలైన బత్తుల విష్ణు, అన్నా చంద్రమోహన్, విద్యార్థి విభాగ జిల్లా నాయకులు గుజర్లపూడి ఆకాష్, వేణులకు పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌కు సమస్యలు తెలియచేస్తాం జిల్లా కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని విద్యార్థులకు కావలసిన తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించే కార్యక్రమం చేయాలని తెలియజేస్తామన్నారు. హాస్టళ్లను క్లీన్ చేయడానికి ఏర్పాటు చేయమని, మంచి బియ్యం సరఫరా చేయమని, నాణ్యత కలిగిన బియ్యం సరఫరా చేసి మంచి భోజనం విద్యార్థులకు పెట్టేవిధంగా ఏర్పాటు చేయమని విన్నవిస్తామన్నారు. పెద్దచెరువు హాస్టల్లో.... కొంతమంది యువకులు డ్రగ్స్ తీసుకొని, మందుతాగి పెద్దచెరువులోని హాస్టల్ ప్రహరీ దూకి లోపలికివచ్చి అక్కడే మద్యం సేవించి చిన్నపిల్లలపై దాడి చేస్తున్నారన్నారు. ఇది చాలా దారుణమైన అంశమని అన్నారు. కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారని, అన్నం సరిగా లేదని అన్నారు. ఎస్పీకి ఫోన్‌చేస్తే టూ టౌన్ సీఐ, ఎస్ఐలను పంపించి పరిస్థితి చక్కదిద్దారన్నారు. నైట్ వాచ్‌మన్‌ను కూడా ఏర్పాటుచేసే కార్యక్రమం చేస్తున్నారన్నారు. తమ పార్టీ వసతి గృహాలలో చదివే విద్యార్థులకు తోడుగా ఉంటుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కళాశాల ఎస్సీ బాలుర హాస్టల్‌కు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయించిన డాక్టర్ గోపిరెడ్డి హాస్టళ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతూ కలెక్టర్‌ను కలుస్తాం మేము రాజకీయం చేయడం లేదుకేవలం విద్యార్థులు చదువుకునేందుకు మంచి ఏర్పాట్లు ఉంటే, మంచి మార్కులు సాధిస్తారని, ఉన్నత చదువులకు వెళ్లి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారనే ఈ కార్యక్రమం చేపట్టాం తప్ప, ఇది రాజకీయం కాదని డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చి శివకోటి, మండల పార్టీ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షులు షేక్ రెహమాన్, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షులు కొత్తూరి కిషోర్‌బాబు, గిరిజన కార్పొరేషన మాజీ డైరెక్టర్ పాలపర్తి శ్రీనివాసరావు, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సానికొమ్ము సాంబిరెడ్డి, పీడీ కృష్ణారెడ్డి, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ ఫలితాల్లో మీరావలికి ప్రథమ స్థానం
బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తే తెగుళ్లు దూరం నరసరావుపేట రూరల్: బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అరుణకుమారి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు వరి నారుమళ్లకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మంచి విత్తనం నాటితే మంచి దిగుబడి వస్తుందని ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి చేసి నాటడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు. రైతులకు బీజామృతంతో విత్తన శుద్ధి వలన కలిగే లాభాలను వివరించాలని తెలిపారు. వరి, కూరగాయలు, మిరపతోపాటు ఏ రకమైన విత్తనాలైనా సరే బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు స్వయంగా విత్తన శుద్ధి చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్, ఎన్ఎఫ్ఏ నందకుమార్, సైదయ్య, మేరి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. దుర్గి: ఇటీవల ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలలో మండల పరిధిలోని అడిగొప్పల గ్రామానికి చెందిన అభ్యర్థి షేక్ మీరావలి ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. తల్లిదండ్రులు మస్తాన్‌వలి, సైదాబి వ్యవసాయ పనులు చేస్తుంటారు. కుమారుడు కానిస్టేబుల్‌గా ఎంపిక కావటంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీరావలి మాట్లాడుతూ ప్రథమ స్థానం రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. -
మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యత తెలియచేయండి
ఆరోగ్యసిబ్బందికి సూచించిన డీఎంహెచ్ఓ నరసరావుపేట: జిల్లాలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అన్నీ గ్రామాల్లో గల గర్భవతులు, బాలింతలు, ఇతర మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి తెలియచేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలోని ప్రసూతి విభాగంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించి బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణాధికారి డాక్టర్ ప్రసూన, ఆర్ఎంఓ వెంకటరావు, విజయలక్ష్మి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ హనుమకుమార్, జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్, ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు. కేంద్రియ విద్యాలయలో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరం నాదెండ్ల:ఇర్లపాడు పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయలో శుక్రవారం భారత స్కౌ ట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో తృతీయ సోపాన్ పరీక్ష శిబిరం 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణలోని 26 కేంద్రియ విద్యాలయాల నుంచి స్కౌట్స్ విద్యార్థులు హాజరయ్యారు. నాలుగు రోజులపాటు జరిగే శిబిరం తెలంగాణ విద్యార్థులతో కళకళలాడింది. ప్రిన్సిపల్ నీరజ్‌కుమార్ శ్రీవత్స, ఉపాధ్యాయులు ముందుగా ఘనస్వాగతం పలికారు. తొలిరోజు క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, స్నేహపూర్వక ప్రయాణం అంశాలపై కార్యక్రమం జరిగింది. ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా, సిబ్బంది క్యాంప్ కిట్లు అందించారు. అనంతరం స్కౌట్స్ పెట్రోల్స్, మార్చ్ఫాస్ట్, స్వాగత నృత్యం ఆకర్షించాయి. క్వార్టర్ మాస్టర్ ఎస్.విజయ్‌కుమార్, ఎల్వోసీ రమేష్‌బాబు నాయకత్వం, సమాజసేవ, జీవిత నైపుణ్యాలను వివరించారు. -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
● రూ.25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్న గుంటూరు పట్టాభిపురం పోలీసులు ● వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ లక్ష్మీపురం: చెడు వ్యసనాలకు అలవాటు పడి, దొంగతనాలు చేయడమే వృత్తిగా చేసుకున్న ముగ్గురు అంతర్ జిల్లాల దొంగలను గురువారం పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీసీఎస్ అధికారులకు, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ టి.సుబ్బారావులకు వచ్చిన సమాచారం మేరకు గుంటూరు నగరంలోని చుట్టుగుంట–చిలకలూరిపేట జాతీయ రహదారి వై– జంక్షన్ వద్ద సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు. వై. జంక్షన్ వైపు నుంచి వస్తున్న ఓ ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులతో డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ముగ్గురిని అదుపులో తీసుకోగా ఉప్పాల సురేష్ పరారయ్యాడు. మిగిలిని ముగ్గురిని స్టేషన్‌కు తరలించి విచారించారు. ఇందులో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీపై రాష్ట్ర వ్యాప్తంగా 24 స్నాచింగ్ , ద్విచక్ర వాహనాల దొంగతనాలతో పాటు ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు నల్లచెరువులో నివాసం ఉంటున్నాడు. నల్లొండ జిల్లా, పెద్ద అడిచెరల్లపల్లి మండలం, రంగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఊరడి జనార్దన్ అలియాస్ జానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 10 స్నాచింగ్ కేసులు, ద్విచక్ర వాహనం దొంగతనాలతో పాటు ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయి పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి మణికంఠపై గుంటూరు నగరంలో పలు చోరీ కేసులు ఉన్నాయి. ఇటీవల అనకాపల్లి రూరల్ పోలీస్‌లు ముగ్గురిని జూన్ 23న అరెస్ట్ చేసి అనకాపల్లి సబ్ జైలుకు తరలించారు. రిమాండ్ నుంచి మరుసటి రోజు జూన్ 24న బయటకు వచ్చారు. నగరంలో పలు దొంగతనాలు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ 4వ లైన్లో బాలాజీ ప్రొడక్ట్స్ సంస్థ కార్యాలయంలో తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఊరడి జనార్దన్, తమ్మిశెట్టి మణికంఠ, ఉప్పాల సురేష్‌లు కలిసి లక్ష రూపాయలతో పాటు 104 అమెరికా డాలర్స్‌ను దొంగలించారు. జూలై 12న గుంటూరు నగరాలు ప్రాంతంలో ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ ఫహీమ్ దగ్గరికి వెళ్లి కారు కొనేందుకు వచ్చామని నమ్మించారు. అదే రోజు సాయంత్రం కార్‌ను ట్రైల్ వేస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. జూలై 18న రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో టీవీ, గాజులు చోరీ చేశారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీసీఎస్ సిబ్బందితో కలిసి పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. నేరాలకు పాల్పడుతున్న వారి కోసం గాలింపులు, తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో బుధవారం వై.జంక్షన్ వద్ద తనిఖీలలో ఆటోలో నుంచి పరారీ అవుతుండగా నలుగురిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అంతర్ జిల్లాల దొంగలను పట్టుకున్న సిబ్బందిని, సీసీఎస్ అధికారులను, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ సుబ్బారావు, ఏఎస్ఐ వీరాంజనేయులు, ఎం.ఆంథోని, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ మాణిక్యరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పీ 4పై అధికారులకు సూచించిన కలెక్టర్ పి.అరుణ్ బాబు
స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారినే ఎంపిక చేయండి నరసరావుపేట: పీ ఫోర్ పథకంలో భాగంగా బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారిని మాత్రమే మార్గదర్శకులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం స్వర్ణాంధ్ర, పీఫోర్ ఫౌండేషన్, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలపై చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో మురళితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ మార్గదర్శకులుగా చేరాలని ఎవరినీ ఎటువంటి ఒత్తిడికి గురిచేయొద్దన్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సీపీఓ .. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన సీపీఓ జి.శ్రీనివాస్‌ను కలెక్టరేట్లో కలెక్టర్ పి.అరుణ్‌బాబు సత్కరించారు. శేషజీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ మురళి పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం రక్తదానం చేసిన డీఆర్ఎం సుధేష్ట సేన్ లక్ష్మీపురం: ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే అని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ట సేన్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయ సిబ్బందితో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా డీఆర్ఎం శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛందంగా చిన్నతనం నుంచి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా దాతగా ఉన్నానని చెప్పారు. యువతీ, యువకులంతా క్లిష్టమైన వైద్య, అత్యవరసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే శక్తి ఉన్న గొప్ప లక్ష్యంలో చేరాలని కోరారు. గుంటూరు రైల్వే డివిజన్ అభివృద్ధితో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యాక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం డివిజన్ పరిధిలో 74 మంది సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్‌కుమార్, సీనియర్ డివిజనల్ పర్సన్ ఆఫీసర్ షహబాజ్ హనూర్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్యా బి. రాజ్, సీనియర్ డివిజనల్ మెటీరియల్స్ మేనేజర్ కార్తికేయ గాడఖ్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్‌బాబు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయ కార్తి, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ శైలేష్‌కుమార్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి డాక్టర్ మేడూరి భాస్కరరావు, జిల్లా సమన్వయకర్త రసూల్ పాల్గొన్నారు. ముగిసిన జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు తాడేపల్లి రూరల్ : జిల్లాస్థాయి రోడ్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు గురువారంతో ముగిశాయి. పోటీలను తాడేపల్లి రూరల్ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూలులో నిర్వహించారు. జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రమాదేవి, ప్రిన్సిపాల్ దీనకుమారి, వైస్ ప్రిన్సిపాల్ మౌనిక, గుంటూరు జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నిర్వహణ కార్యదర్శి ఇమ్మానియేలు రాజు పాల్గొన్నారు. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సుమారు 32 నుండి 35 ఏళ్ల వ్యక్తి స్టేషన్ ఉత్తర కేబిన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
● మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ 5న సబ్స్టేషన్ల ఎదుట ధర్నా ● జయప్రదం చేయాలని సీపీఎం నాయకుల పిలుపు నరసరావుపేట: విద్యుత్ చార్జీలు పెంచినా, స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజా ఉద్యమం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో రైతు సంఘ జిల్లా ప్రధాన ఏపూరి గోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో విజయ్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్మార్ట్ మీటర్లు అంగీకరించిన వారికి బిగించమని చెప్పారని, అంగీకారాలతో సంబంధం లేకుండా ప్రక్రియ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతో సామాన్య ప్రజలపై పెనుభారాలు మోపుతూ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచడంతో ప్రజా తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెకీతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కొనసాగించడాన్ని తప్పుపట్టారు. ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలతో ఈనెల 5న విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద, సచివాలయాల వద్ద జరిగే నిరసన ధర్నాలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ఊపందుకున్న నేపథ్యంలో రైతులు వద్ద ఉన్న పొగాకు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నాగార్జునసాగర్ ముంపు ప్రాంతాలలో ప్రజలకు పునరావాసం కల్పించాలని కోరారు. తొలకరి వర్షాలకు పత్తి సాగుచేసి తీవ్ర వర్షాబావ పరిస్థితులను నేపథ్యంలో నష్టపోయిన రైతులకు పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇన్పుట్ సబ్సిడీ కింద నగదు ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు పాల్గొన్నారు. -
సాగర్ సొగసు చూడతరమా..!
విజయపురిసౌత్: నాగార్జున సాగర్‌కు కొత్తనీరు వచ్చి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గత మూడు రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్లు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. అంతేకాకుండా నిండుకుండలా కనపడుతున్న సాగర్‌లో జలాశయం మీదుగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లటం పర్యాటకులకు మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దీంతో నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఈ నేపఽథ్యంలో సాగర్ చుట్టుపక్కల సందర్శినీయ స్థలాలపై ప్రత్యేక కథనం.. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఇది సాగర్ ప్రధాన డ్యాం దిగువ ప్రాంతంలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఉంటుంది. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని సాగర్ జెన్కో ఎస్ఈ అనుమతి తీసుకొని సందర్శించాల్సి ఉంటుంది. భక్తుల కోర్కెలు తీర్చే సాగర్మాత నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్‌లోని లాంచీస్టేషన్ నుంచి 14 కి.మీ.దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, పిల్లలకు రూ 150, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, మ్యూజియం సందర్శనకు 15 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. విజ్ఞాన విహార యాత్రకు గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీ టిక్కెట్‌పై 15 శాతం రాయితీ పర్యాటకశాఖ ఇస్తుంది. అలాగే పార్టీలకు, ఫంక్షన్లకు శాంతిసిరి లాంచీకి గంటకు రూ.10,000, అగస్త్య లాంచీకి గంటకు రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్‌ను సంప్రదించవచ్చు. గత ఆనవాళ్లకు చిరునామా అనుపు నాగార్జునసాగర్ 7కి.మీ. దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ ఆనాటి నాగార్జున విశ్వ విద్యాలయం, ఇక్ష్వాకుల కాలం నాటి యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణానది లోయలో లభించిన రంగనాధస్వామి దేవాలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణానది తీరంలో నిర్మించటం విశేషం. నిండుకుండలా సాగర్ జలాశయం చరిత్రకు సాక్ష్యం నాగార్జున కొండ మనసుదోచే ఎత్తిపోతల చరిత్రకు ప్రతిరూపం నాగార్జునకొండ చూపరుల మనస్సుదోచే ఎత్తిపోతల ఇది సాగర్ నుంచి మాచర్లకు వెళ్ళే రహదారిలో 14కిలో మీటర్ల దూరంలో ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. 70 అడుగుల పై నుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. జలపాతం చూసేందుకు పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.20 టికెట్ ధరను టూరిజంశాఖ వసూలు చేస్తుంది. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్ధం రాత్రి బస చేసేందకు 8 రూములు ఉన్నాయి. 5 ఏసీరూమ్లు, 3 నాన్ఏసీ రూములు ఉన్నాయి. ఏసీ రూమ్ ధర రూ.1,600, నాన్ఏసీ రూ.వెయ్యి. ఇతర వివరాలకు ఎత్తిపోతల మేనేజర్ దత్తకుమార్ ఫోన్‌నెంబర్ 94414 53115లో సంప్రదించవచ్చు. విజయపురిసౌత్‌లోని కృష్ణానది తీరంలో వేంచేసియున్న సాగర్మాత దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే చల్లనితల్లిగా సాగర్‌మాతకు విశిష్టమైన పేరు ఉంది. ఇక్కడ నెలకొల్సిన జపమాల క్షేత్రం రాష్ట్రంలోనే ప్రత్యేకమైంది. -
పరిశ్రమ వద్ద నీటి సంపులో పడి కార్మికుడి మృతి
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్ పరిధి ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు శ్రీరామ్(21) గురువారం ప్రమాదవఽశాత్తూ నీటి సంపులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. గుంటూరుకు చెందిన శ్రీరామ్ రెండేళ్లుగా మేనకూరు సెజ్ పరిధిలోని బ్రేక్స్ ఇండియా పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. శ్రీరామ్ వెంకటగిరి పట్టణంలో నివాసం ఉంటు ప్రతిరోజూ పరిశ్రమకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే గురువారం విధులకు హాజరై నీటి సంపు సమీపంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. చాలా పైనుంచి నీటి సంపులో పడిపోయిన శ్రీరామ్‌ను అక్కడి కార్మికులు గుర్తించి నీటి సంపు నుంచి బయటకు తీసి హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీరామ్ అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న సీఐ బాబి వైద్యశాలకు వద్దకు వెళ్లి పరిశీలించారు. పరిశ్రమ వద్దకు వెళ్లి అక్కడి నీటి సంపు తదితర ప్రాంతాలను పరిశీలించారు. శ్రీరామ్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లాలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం గురువారం వినుకొండరోడ్డులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్ నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటుతో జిల్లాలో జూడోను క్రీడా శాఖతో అనుసంధానమై అభివృద్ధి చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరుజిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి, జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుబ్బారావు, సీఈఓ నామిశెట్టి వెంకట్, ఉపాధ్యక్షుడు చింతా శ్రీను, జాయింట్ సెక్రటరీ గమిడి శ్రీనివాసరావు, రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, వాగ్దేవి విద్యాసంస్థల కార్యదర్శి రాయల శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు. నూతన కార్యవర్గం.. పల్నాడుజిల్లా జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా పసుపులేటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల నరసింహారావు, కోశాధికారిగా కె.రాజగోపాల్, ఉపాధ్యక్షులుగా కొప్పుల పార్వతి, జాయింట్ సెక్రటరీగా బి.బాలమురళీకృష్ణ ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా బి.మల్లిఖార్జున, పి.రామకృష్ణ, ఆర్.గోపీనాయక్, రాజు, ఎన్.శివ, ఈ.రామాంజనేయులు ఎన్నికయ్యారు. వీరిని పలువురు అభినందించారు. -
కృష్ణమ్మకు పోటెత్తిన వరద
శుక్రవారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2025బెల్లంకొండ: గురువారం కృష్ణా నదికి వరద పోటెత్తింది. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి రెండు రోజులుగా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైన ప్రవాహంతో బుధవారం వరకు ఖాళీ చేసిన గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురవగా.. గురువారం అవి పూర్తిగా నీట మునిగాయి. ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం దాదాపుగా 40 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులో నీటిని నిల్వతో బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలైన పులిచింతల, గొల్లపేట, కోళ్లూరు, భోదనం, చిట్యాల గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఎమ్మాజీగూడెం వరకు వరద నీరు చేరే అవకాశం ఉంది. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు ఎమ్మాజీగూడెం ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాలలో పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ డి.ప్రవీణ్ సూచించారు. పరివాహక ప్రాంతాలలో అప్రమత్తం అమరావతి: కృష్ణా నదిపై ఎగువన ఉన్న పులి చింతల ప్రాజెక్టు నుంచి బుధవారం సుమారు 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు విడుదల చేయటంతో అమరావతిలో గురువారం కృష్ణానది జలకళ సంతరించుకుంది ఒక్కపారిగా వరద వచ్చి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలు తిలకించటానికి ప్రజలు వస్తున్నారు. మండలంలోని సుమారు 30 కిలోమీటర్ల మేర నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పర్యాటక కేంద్రం అమరావతిలోని అమరేశ్వరఘాట్, ధ్యానబుద్ధ ఘాట్ వద్దకు ప్రజలు అధికంగా తరలివచ్చారు. తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు కోరారు. నిండుకుండలా టెయిల్ పాండ్ రిజర్వాయర్ సత్రశాల (రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్దనున్న నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 14 క్రస్ట్‌గేట్లు ద్వారా 2,12,618 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం గురువారం తెలిపారు. 3 మీటర్ల మేర గేట్లు ఎత్తామన్నారు. ప్రాజెక్టులో 75.50 మీటర్లకుగాను 74.34 మీటర్ల వరకు నీటిమట్టం చేరిందన్నారు. గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.304 టీఎంసీలు ఉందని తెలిపారు. టీఆర్సీ లెవల్ 60.09 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువనున్న నాగార్జున సాగర్ నుంచి 2,26,015 క్యూసెక్కుల వరద ఇక్కడి ప్రాజెక్టుకు చేరుకుంటోందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు. న్యూస్‌రీల్ ముంపు గ్రామాలకు అధికారుల హెచ్చరికలు పులిచింతలకు 2,12,618 క్యూసెక్కులు విడుదల -
వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు
నరసరావుపేట రూరల్: వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు కల్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం 11 మందితో కూడిన రాష్ట్ర ఐటీ విభాగ కమిటీని ప్రకటించింది. ఇందులో గురజాల నియోజకవర్గానికి చెందిన నంద్యాల రాజశేఖరరెడ్డి, మాచర్ల నియోజకవర్గానికి చెందిన తాటికొండ హనిమిరెడ్డిలను కార్యదర్శులుగా నియమించారు. ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ – జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు నరసరావుపేట: అర్హత కలిగిన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు జరిగేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. గురువారం ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు రెండో తేదీన రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు ఇవ్వనుందని, అదే రోజు కేంద్ర సర్కార్ కూడా తనవంతుగా రూ.2 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుందని తెలిపారు. జిల్లా, మండల స్థాయిల్లో ఈ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద కచ్చితంగా లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, రైతులను భాగస్వాములను చేస్తామన్నారు. సమావేశంలో జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ ప్రవేశాలకు నేటితో తెర
● కళాశాలలను మార్చుకునేందుకు నేడు చివరి అవకాశం ● మొదటి దశలోనే 90 శాతానికి పైగా సీట్లు భర్తీ గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారంతో తెర పడనుంది. మేలో జరిగిన ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, వెబ్ ఆన్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఎస్సీహెచ్ఈ) ఇటీవల మొదటి విడతలో బీటెక్ సీట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి దశలోనే 90 శాతం మేరకు సీట్లు భర్తీ అయ్యాయి. చివరి దశ కౌన్సెలింగ్‌కు గడువు శుక్రవారం ముగియనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలను కలుపుకుని 36 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు సహా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న 30,240 సీట్లలో 90 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. కంప్యూటర్ కోర్సులకు ప్రాధాన్యత కంప్యూటర్ సైన్స్‌లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీఎస్ఈతో పాటు అనుబంధంగా ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా, ఐఓటీ, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. సీఎస్ఈ తరువాత ఐటీ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్‌లను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే వివిధ కళాశాలల్లో సీట్లు పొంది, ఇతర కళాశాలల్లో సీటు కోరుకునేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం రాత్రిలోపు కొత్తగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.వీరికి ఈనెల 4న సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు పొందిన కళాశాలల్లో అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చి, అక్కడ చేరకుండా చివరి దశ కౌన్సెలింగ్‌కు వెళ్తున్నామని ముందస్తుగా సమాచారం ఇచ్చిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అర్హులు. చివరి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంది. -
బల్లి గండం తప్పింది !
తెనాలి అర్బన్: ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన కేజీబీవీ ఉపాధ్యాయినుల్లో నలుగురు ఇంకా తెనాలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. సాక్షి దినపత్రికలో ‘‘భోజనంలో బల్లి–కేజీబీవీ ఉపాధ్యాయినులకు అస్వస్థత’ అనే శీర్షికన గురువారం వార్త ప్రచురితం అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయినులను పరామర్శించారు. ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇన్ సర్వీస్ టీచర్ ప్రోగ్రాంపై శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజే కళాశాలలో ఇన్ సర్వీస్ టీచర్ ప్రోగ్రాంను సోమవారం నుంచి నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అనకాపల్లి, అనంతపూర్, అన్నమయ్య, ఏఎస్ఆర్, బాపట్ల, చిత్తూరు, ఏలూరు, కడప, కర్నూలు, మన్యం, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాల పరిధిలోని కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే 170 మంది ఉపాధ్యాయినులు తెనాలి వచ్చారు. వీరికి వసతిని కళాశాల యాజమాన్యం సమకూర్చింది. భోజనం, టిఫెన్స్లను ప్రభుత్వం నియమించిన వెండర్ సమకూరుస్తున్నారు. పుల్కా కర్రీలో బల్లి బుధవారం రాత్రి 8గంటల సమయంలో ఉపాధ్యాయినులకు భోజనం, టిఫెన్‌ను సదరు వెండర్ ఏర్పాటు చేశారు. పుల్కా కర్రీలో అప్పటికి బల్లి పడింది. దీన్ని గమనించక అందరూ దానిని తిన్నారు. చివరి సమయంలో ఒక ఉపాధ్యాయిని బల్లిని గమనించి ఫిర్యాదు చేసింది. దీంతో అందరిలో ఆందోళన ప్రారంభమైనది. ఇలా జరిగిన కొద్ది గంటలకే సుమారు 14 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. అధికారులు వారికి మందులు పంపిణీ చేశారు. 14 మందిని చికిత్స నిమిత్తం తెనాలిలోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. 10మందికి ప్రాథమిక చికిత్స చేసి మరలా వసతి గృహానికి పంపారు. మిగిలిన నలుగురు వైద్యశాలలో గురువారం కూడా చికిత్స పొందుతూ వచ్చారు. అప్రమత్తమైన అధికారులు సాక్షిలో కథనం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై ఆరా తీశారు. స్థానిక వీఆర్వో, ఉపాధ్యాయినుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. మిగిలిన వారికి గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. సకాలంలో అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది.శిక్షణ తరగతికి తమ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని, అధికారుల ఆదేశాల మేరకు వసతి మాత్రమే కల్పించని జేఎంజే కళాశాల నిర్వాహకులు తెలిపారు. కాంట్రాక్టర్‌ను మార్చాం సంఘటన దురదృష్టకరం. భోజనం కాంట్రాక్టర్‌ను మార్చివేశాం. అస్వస్థతకు గురైన వారిని కొలుకున్న తరువాత స్వగృహాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – సి.వి.రేణుక, డీఈవో కోలుకుంటున్న కేజీబీవీ ఉపాధ్యాయినులు నలుగురికి ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స జిల్లా విద్యాశాఖాధికారి రేణుక పరామర్శ సాక్షి కథనంతో దిద్దుబాటు చర్యలకు దిగిన అధికారులు ఫుడ్ కాంట్రాక్టర్‌కు ఉద్వాసన అస్వస్థతకు గురైన వారిని ఇంటికి పంపేందుకు చర్యలు -
సాగర్ చెంత సందర్శకుల సందడి
విజయపురి సౌత్: నాగార్జున సాగర్, కొండకు గురువారం పర్యాటకులు తరలివచ్చారు. సాగర్ డ్యాం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో తిలకించిన వస్తున్నారు. నాగసిరి, అగస్త్య లాంచీలలో నాగార్జున కొండకు తరలివెళ్లారు. ఇలా రూ.48 వేల ఆదాయం చేకూరినట్లు అధికారులు తెలిపారు. మ్యూజియంలో బుద్ధుడి ప్రతిమలు, రాతి సామగ్రి, మట్టి కుండలు, బుద్ధుడి 9 అడుగుల పాలరాతి విగ్రహం, మహా స్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానాల గట్లు, బోది వృక్షం చూసి తన్మయత్వం చెందారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపు, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి దేవాలయం, అనంతరం 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. నాగార్జునసాగర్ డ్యాంపై 26 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో నూతన బ్రిడ్జి, పాత వంతెన, లాంచీస్టేషన్, కృష్ణవేణి పుష్కర్‌ఘాట్ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. -
యోగా పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ
● జేఎన్వీ ప్రాంతీయ స్థాయి యోగా క్రీడల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న వైఎస్సార్ కడప క్లస్టర్ ● ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్ ● త్వరలో జాతీయస్థాయి పోటీలకు అర్హత యడ్లపాడు: ఆట ఏదైనా పోటీల నిర్వహణ క్రీడాకారులకు ఒక వేదిక మాత్రమేనని.. యోగాను జీవితంలో భాగం చేసుకోవడమే అసలైన విజయమని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి పేర్కొన్నారు. చిలకలూరిపేట రూరల్ మండలం మద్దిరాలలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ పాఠశాలలో హైదరాబాద్ జేఎన్వీ రీజియన్ పరిధిలో నిర్వహించిన ప్రాంతీయస్థాయి యోగా క్రీడా ప్రదర్శన పోటీలు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు విభాగాల్లో మూడు రోజుల పాటు కొనసాగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం గురువారం జరిగింది. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగా ఒక దివ్యౌషధంగా ఉపయోగపడుతుందన్నారు. యోగా శిక్షణ యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుందన్నారు. విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు మాట్లాడుతూ యోగా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి నవోదయ జాతీయ క్రీడలకు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. పోటీల నిర్వహణకు సమన్వయంతో కృషి చేసిన విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీఈటీలు ఆర్.పాండురంగారావు, జి.గోవిందమ్మ, అధ్యాపకులు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఎస్కార్ట్‌లను అభినందించారు. ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన ‘వైఎస్సార్ కడప క్లస్టర్’ జవహర్ నవోదయ విద్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రాంతీయస్థాయి యోగాక్రీడా ప్రదర్శన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ కడప క్లస్టర్‌లోని జేఎన్వీ సాధించుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలోని 8 క్లస్టర్ల నుంచి క్లస్టర్ లెవర్ వరకు జరిగిన యోగా పోటీల్లో గెలుపొందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కృష్ణా, వైఎస్సార్ కడప, బీదర్, షిమోగా, తుమ్మకూర్, పట్నంతిట్టా, వైనాడ్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన 278 మంది క్రీడాకారులు పాల్గొని ఆసనాలు, ఆర్టీస్టిక్, రిథమిక్ విభాగాల్లో యోగా విన్యాసాలు ప్రదర్శించి తమ కళాత్మక నైపుణ్యాలను చాటారు. ఆయా పోటీల్లో రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ కడప క్లస్టర్ జేఎన్వీ ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను కై వసం చేసుకోగా, కృష్ణా క్లస్టర్ ద్వితీయస్థానంలో నిలిచింది. వీటితో పాటు వివిధ విభాగాల్లో వ్యక్తిగతంగా విజేతలైన 42 మంది త్వరలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు అర్హత సాధించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న 21 మంది విద్యార్థులు, 21 మంది విద్యార్థినులను మెడల్స్, సర్టిఫికెట్లతో సత్కరించారు. అన్ని విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన వైఎస్సార్ కడప క్లస్టర్ విద్యార్థులను, ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్ విద్యార్థులను, షీల్డ్‌లు, సర్టిఫికెట్లతో సత్కరించారు. చిలకలూరిపేట టౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని జవహర్ పీఎంశ్రీ నవోదయ విద్యాలయం వేదికగా, దక్షిణ భారతదేశంలోని జేఎన్వీ విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రాంతీయ స్థాయి యోగా ప్రదర్శన పోటీలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు ఉత్సాహంగా సాగాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటకకు చెందిన 8 క్లస్టర్ల నుంచి 278 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జూలై 29, 30, 31 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన యోగా నైపుణ్యాలను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఆసనాలు, రిథమిక్, ఆర్టిస్టిక్ (కళాత్మక) యోగా ప్రదర్శనలతో వేదికపై మెరుపులు మెరిపించారు. అండర్ –14, అండర్–17, అండర్ –19 విభాగాల్లో గ్రూపు, వ్యక్తిగత విభాగాల్లో బాలబాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీఈటీ ఆర్ పాండురంగారావు, జి.గోవిందమ్మ, ఇతర అధ్యాపకులు పర్యవేక్షించారు. -
సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు సుదర్శన స్వామికి అభిషేకం, దృష్టి దోష నివారణ, దుష్ట గ్రహ దోష నివారణ, ఆయురారోగ్యాభివృద్ధికి సర్వరక్షాకర హోమం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో సుదర్శన పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. అసభ్య ప్రవర్తన కేసులో పదేళ్ల జైలు నరసరావుపేట టౌన్: కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం గురువారం తీర్పు చెప్పినట్లు టూటౌన్ సీఐ హైమారావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. అప్పటికే వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. చివరి కుమార్తె 5వ తరగతి చదువుతోంది. గతేడాది సెప్టెంబర్ 7న నిందితుడు మద్యం మత్తులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో అధికారులు వెళ్లి బాలికను కాపాడారు. రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగింది. కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది. కేసును రెండో పట్టణ సీఐ హైమారావు దర్యాప్తు చేయగా, ఏపీపీ బర్కత్ అలీఖాన్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు. ఎయిమ్స్‌లో ఆన్లైన్ సేవలకు అంతరాయం 45 నిమిషాల తర్వాత పునరుద్ధరణ తాడేపల్లి రూరల్: మంగళగిరి ఎయిమ్స్‌లో గురువారం ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఓపీ దగ్గర భారీగా రోగులు నిలబడి ఆందోళన చేశారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది మాన్యువల్‌గా సేవలను అందించారు. 45 నిమిషాల అనంతరం ఆన్లైన్ సేవలను పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతిరోజు వేల మంది వస్తున్నారు. నెలకు రెండు, మూడు సార్లు ఇదే పరిస్థితి ఏర్పడుతోందని అక్కడి సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్ సేవలు నిలిచిపోయిన వెంటనే మాన్యువల్ సేవలు అందజేశామని తెలిపారు. ఎక్కువ మంది రావడంతో కొంత ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్ సేవలను పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా అథ్లెటిక్ క్రీడాకారుల జట్ల ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): చీరాలలో ఈ నెల 9, 10 వ తేదీల్లో జరగనున్న అండర్–18, 20 యువతీ యువకుల అంతర్ జిల్లాల అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే జట్లను ఎంపిక చేసినట్లు అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డుతో శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు సభ్యులు 9వ తేదీ ఉదయం 6 గంటలకు చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలోని క్రీడా మైదానంలో రిపోర్ట్ చేయాలన్నారు. -
జెడ్పీ చైర్పర్సన్ అమెరికా పయనం
వైస్ చైర్మన్‌కు అప్పగించని బాధ్యతలు గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. జెడ్పీ చైర్పర్సన్ స్థానికంగా అందుబాటులో లేని సమయంలో వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే, హెనీ క్రిస్టినా బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించ లేదు. దీనిపై అధికారులను వివరణ కోరగా చైర్పర్సన్ విదేశాలకు వెళ్లిన విషయం వాస్తవమేనని తెలిపారు. వైభవంగా నరనారాయణ జయంతి తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై నరనారాయణ జయంతిని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్‌స్వామి మంగళా శాసనాలతో నరనారాయణ జయంతి సందర్భంగా ఉదయం 7 గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపం, శ్రీకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులను బుధవారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉందని తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 246, బ్యాంక్ కెనాల్ 1356, తూర్పు కాలువకు 650, పశ్చివ కాలువకు 227, నిజాంపట్నం కాలువకు 450, కొమ్మూరు కాలువకు 1780 క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 71,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లారీ ఢీకొని విద్యార్థి మృతి పట్నంబజారు: ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీ ఢీకొని తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేటకు చెందిన షేక్ షాహిద్ అహ్మద్ (13) కొత్తపేటలోని భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కు వెళుతున్న క్రమంలో పెన్ను కోసం తండ్రి ద్విచక్ర వాహనంపై ఒక్కడే బయటకు వచ్చాడు. ఈ సమయంలో గుంటూరు నుంచి తెనాలి వెళుతున్న రేషన్ బియ్యం ఢీకొట్టింది. దీంతో షాహిద్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి షబ్బీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం–2020ని పొడిగించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో రాష్ట్రంలో జూన్ 30, 2025 వరకు వేసిన అనధికార లే ఔట్లను, ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు ద్వారా అనధికార లే ఔట్లో ఉన్న స్థలానికి ప్లాను తయారు చేసుకొని, అపరాధ రుసుములో 50 శాతం (లేదా కనిష్టంగా రూ.10 వేలు) చెల్లించి, జూలై 26 నుంచి 90 రోజులలోపు (అక్టోబర్ 24లోపు) ఆన్లైన్లో http://rrdtcp.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకంలో 45 రోజులలోపు పూర్తి రుసుం చెల్లించిన వారికి 10 శాతం, 45 నుంచి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందన్నారు. గడువు అనంతరం మిగిలిన లేఔట్లు/ప్లాట్లకు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, డ్రైయినేజీ అనుమతించబడవని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ యొక్క నిషేధ ఆస్తుల రిజిస్టర్లో నమోదు చేస్తారని చెప్పారు. లావాదేవీలు అనుమతించబడవని ఆయన స్పష్టం చేశారు. -
నేషనల్ తైక్వాండోలో పతకాలు
వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు నేషనల్ తైక్వాండో పోటీల్లో సత్తా చాటి కాంస్య, రజత పతకాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని బుధవారం తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు విజవాడలో తైక్వాండో నేషనల్ ఓపెన్ పోటీలు జరిగాయి. హైస్కూల్లో చదువుతున్న అక్కాచెల్లెళ్లు యార్లగడ్డ లక్ష్మీప్రియ, లాస్యప్రియ విజేతలుగా నిలిచి కాంస్య, రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు జె. దేవభిక్షం ఉపాధ్యాయిని జె. శ్రావణి అభినందించారు. -
ఏఐతో రైల్వే డివిజన్ అభివృద్ధికి కృషి
లక్ష్మీపురం: ఆర్టిఫీషియల్ ఇంటల్జెన్స్ (ఏఐ)తో రైల్వే డివిజన్‌ను మరింత ఆధునాత పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధేష్ట సేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఏఐపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. సిబ్బంది అంతా డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా పని చేయాలని తెలిపారు. నూతన హంగులు, అధునాతన పద్ధతులు, కొత్త దనంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయా విభాగాధిపతులు సమర్థమైన పనితీరుతో డివిజన్ మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం రమేష్‌కుమార్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.డీఆర్ఎం సుథేష్ట సేన్ -
ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి
చీరాల: డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ నవ్యాంధ్ర వికలాంగుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా బుధవారం డీఎస్పీ ఎండీ మొయిన్‌కు వినతిపత్రం అందించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందన లేదన్నారు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఇది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమేష్, జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు, పి.అనిల్‌నాయుడు, జి.రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
‘సీనియర్ సిటిజన్ల’ చట్టంపై అవగాహన అవసరం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు నరసరావుపేట: తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007పై విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజెన్స్, ట్రాన్స్‌జెండర్ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007, ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 అమలుపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఏడీ దుర్గా భాయ్, వరలక్ష్మి, లాయర్ శిరీష పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లల మధ్య సఖ్యత లేని కారణంగా వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. అన్నివర్గాల కుటుంబాల్లోనూ ఇటువంటి పరిస్థితి చూస్తున్నామన్నారు. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణలో ఆయా కుటుంబ సభ్యుల బాధ్యత వహించాల్సి ఉందని, తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన సొంత సంపాదన నుంచి లేదా అతని సొంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు ప్రాథమికంగా ఆర్డీఓ అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆర్డీఓ ద్వారా నోటీసులు అందించి విచారణ చేసి సమస్యను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులు, తల్లిదండ్రులను, నిర్లక్ష్యం వహించే కుమారులు, కుమార్తెలపైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 ద్వారా ట్రాన్స్ జెండర్లకు హక్కులు కల్పించడం జరిగిందన్నారు. లాయర్ శిరీష పలు సూచనలు, సలహాలు అందించారు. -
సైబర్ నేరాల కట్టడికి బ్యాంకర్లు సహకరించాలి
చీరాల అర్బన్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికను సైబర్ నేరగాళ్లు నిరంతరం ఉపయోగించుకుంటూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని డీఎస్పీ ఎండీ మొయిన్ ఆందోళన వ్య్తం చేశారు. నేరాల నియంత్రణకు బ్యాంకు మేనేజర్లు వారి బ్యాంకుల్లో భద్రతా నియమాలను సక్రమంగా పాటిస్తే చోరీలను కొంత వరకు అరికట్టవచ్చన్నారు. బుధవారం స్థానిక బాపనమ్మ కల్యాణ మండపంలో డీఎస్పీ అధ్యక్షతన సైబర్ నేరాల, దొంగతనాల నియంత్రణపై బ్యాంకు మేనేజర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నకిలీ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, మెయిల్స్ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం పొందుతున్నారన్నారు. వ్యక్తిగత వివరాలు వారి చేతిలోకి వెళ్లగానే ఖాతాల్లోని నగదు ఖాళీ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెబితే వాటిని విశ్వసించ వద్దన్నారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి వారితో మాట్లాడాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలను, ఏటీఎం పిన్ నంబర్లు, సీవీవీ నెంబర్లు ఇతరులకు చెప్పవద్దని సూచించారు. వీటిని అరికట్టేందుకు బ్యాంకులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా, వీడియో రికార్డింగ్ వ్యవస్థలు పనిచేస్తున్నాయా, అలారం, ఎమర్జెన్సీ బటన్లు స్థిరంగా పనిచేస్తున్నాయనే అంశాలపై ప్రశ్నించారు. బ్యాంకుల్లో 24 గంటలు పనిచేసే సీసీ కెమెరాలు తప్పకుండా ఉండాలన్నారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్లు, సీఐలు నాగభూషణం, శేషగిరిరావు, ఎస్సైలు రాజ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, జనార్దన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉచిత బస్సు’ అనంతరం జాతర వాతావరణం
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సు అంశంపై నెల్లూరు జోన్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల అధికారులతో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కార్యాలయంలో బుధవారం ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల ప్రయాణం ఏర్పాలయ్యాక కొద్ది రోజులు జాతర వాతావరణం ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ పరిధిలో ఉచిత బస్సుల సౌకర్యం కల్పించేందుకు విధి విధానాలు, సంసిద్ధత, సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో ఆపరేషన్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని తెలిపారు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని, వారు ఆధార్, పాన్‌కార్డు వంటి గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆర్టీసీ ఎండీ నుంచి డీఎం వరకు సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 1050 బస్సులు రానున్నట్లు తెలిపారు. అధికారికంగా ఆదేశాలు రానప్పటికీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, డీలక్స్, సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అవకాశం ఉన్న వరకు ఎక్కడ నుంచైనా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు తిరిగే అవకాశం ఇస్తున్నామని, సిబ్బందికి కూడా కొద్దిగా పని పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు జోన్ పరిధిలో ఈడీలు, ఆర్ఎం, డీఎంలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
అటవీ జంతువుల రక్షణ మన బాధ్యత
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట: వన్య ప్రాణులు మానవ హితులని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. ప్రపంచ పాముల దినోత్సవం (జూలై 16), అంతర్జాతీయ పులుల దినోత్సవం (జూలై 29) నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్లోని వన్య మృగ సంరక్షణ వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సహజంగా పాములు, పులుల వంటి జీవరాశులు అంటే ప్రజల్లో భయం ఉంటుందన్నారు. ఆ భయంతో వాటిని వేటాడటం, చంపడం జరుగుతుందన్నారు. వాస్తవానికి వన్యప్రాణులు కేవలం భయంతో మాత్రమే మనుషులపై దాడి చేస్తాయన్నారు. పర్యావరణంలో వివిధ రకాల ఆహార చక్రాలలో వన్యప్రాణులు భాగస్వాములై పర్యావరణానికి, మానవాళికి మంచి చేస్తాయని గుర్తుచేశారు. రైతులు ప్రమాదకర సర్పాలు, విషంలేని సర్పాల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. వర్క్‌షాప్‌లో నిజమైన సర్పాలతో ఏర్పాటు చేసిన లైవ్‌షో వీక్షకులను ఆకట్టుకుంది. వర్క్ షాప్ నిర్వహించిన అటవీశాఖ అధికారులను ఎమ్మెల్మే చదలవాడ అభినందించారు. ఈ సందర్భంగా జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో పులి ఆవశ్యకత గురించి తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. వర్క్ షాపులో ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ పాల్గొన్నారు. -
సౌకర్యాలు పెంచాలి
సర్కారు వసతి గృహాల్లో సత్తెనపల్లి: జిల్లాలోని ప్రభుత్వ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు నరకకూపాలుగా మారాయని, తక్షణమే అక్కడి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రైల్వేగేట్ సమీపంలో గల సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. కనీసం దోమల మెష్‌లు లేవన్నారు. ముఖ్యంగా బియ్యం, కందిపప్పులో ముక్క పురుగులు ఉన్నాయని చెప్పారు. సాంబార్లో మచ్చుకై నా పప్పు కనిపించడం లేదన్నారు. విద్యార్థులకు చిక్కీ ఇవ్వడం లేదని, అసలు మెనూ ప్రకారం ఆహారం అందిచడం లేదని తెలిపారు. ప్రతి నెలా కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, అధికారులు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆహార పదార్థాలు నాణ్యతగా లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వైస్ ప్రెసిడెంట్ వేణు, నరసరావుపేట యువజన విభాగం ప్రెసిడెంట్ కోటపాటి మణీంద్రారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు మోహిద్దీన్, రాజేష్, తరుణ్, హరి, మధు తదితరులు ఉన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయాలి కందిపప్పు, బియ్యంలో అన్నీ ముక్క పురుగులు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ -
ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన అవసరం
ఇంటర్ విద్య ఆర్జేడీ పద్మ నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ విద్యా విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇంట ర్మీడియెట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జె.పద్మ తెలిపారు. పల్నాడుజిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్జేడీ జె.పద్మ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతి వారాంతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలనీ, ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు అందిస్తుందన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం మొబైల్ ఫోన్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో హాజరు నమోదు చేయాలని తెలిపారు. అధ్యాపకులు డ్రెస్‌కోడ్ పాటించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ప్రతినెలా రెండు కళాశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గుంటూరు ఆర్ఐఓ సునీత మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరగటంతో ప్రవేశాలు సైతం పెరిగాయని తెలిపారు. అధ్యాపకులు నాణ్యమైన విద్యా బోధన అందించాలని కోరారు. డీఐఈఓ ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ, అధ్యాపకులు ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతిపై చర్చించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని ములకలూరు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... సత్తెనపల్లికి చెందిన నాటకం రాకేష్(34), షేక్ జాని(45)లు కుక్కపిల్లను నరసరావుపేటలో వదిలివెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ములకలూరు సమీపంలోని టౌన్షిప్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుంచి ఇరువురు కిందపడిన సమయంలో వెనుక వచ్చిన గుర్తుతెలియని టిప్పర్ వీరిపై నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రధాన రహదారిపై ఛిద్రమైన మృతదేహాలు పడిపోవడంతో విషాదకర వాతావరణం కనిపించింది. ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలాన్ని రూరల్ ఎస్ఐ కిషోర్ పరిశీలించి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి జెడ్పీ సీఈఓ జ్యోతిబసు గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జెడ్పీ సీఈఓ వి. జ్యోతిబసు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పాటు మండలానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి పీఏఐ పోర్టల్‌పై సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈఓ జ్యోతిబసు మాట్లాడుతూ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 వెర్షన్ (పీఏఐ పోర్టల్)కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, తెన్నులపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఎం డి. రవీంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ ఫొటోలు వచ్చాయంటూ టోకరా ● బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.5.72 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు ● ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు చీరాల అర్బన్: సైబర్ నేరగాళ్ల పంజాకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్ళు పెచ్చుమీరుతున్నారు. వాట్సాప్‌లో ఫొటోలు వచ్చాయని చూడమంటూ ఓ వ్యక్తికి కాల్ చేయగా.. వాట్సాప్ తెరిచిన వెంటనే రూ.5.72లక్షల నగదును అతని అకౌంట్లో మాయమయ్యాయి. దీంతో బాధితుడు బుధవారం ఈపూరుపాలెం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన పులి హరికృష్ణకు ఈనెల 3 న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి యాక్సిడెంట్ ఫొటోలు వాట్సాప్‌లో వచ్చాయి చూడమని చెప్పాడు. దీంతో ఏం జరిగిందోనని హరికృష్ణ వాట్సప్‌లో చూడగా ఫొటోలు కనిపించలేదు. కొద్ది నిమిషాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయినట్లుగా మెసేజ్‌లు వచ్చాయి. విడతల వారీగా 5 లక్షల 72 వేల రూపాయలు డెబిట్ అయ్యాయి. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ కావడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని అకౌంట్ హోల్డ్‌లో ఉంచడంతో ఒక లక్ష రూపాయలు డెబిట్ కాకుండా ఆపారు. సైబర్ క్రైం పోలీసుల సూచనల మేరకు బుధవారం ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.చంద్రశేఖర్ తెలిపారు. -
అవినీతి దూర విద్య
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కాపీయింగ్ చేసే విద్యార్థికి ఒక రేటు, పరీక్షలను వేరే వారితో రాయిస్తే ఒక రేటు అంటూ ఏఎన్‌యూ దూర విద్యా పరీక్షల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు పెద్దఎత్తున దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు సభ్యులతో జిల్లాల వారీగా తనిఖీ బృందాలను యూనివర్సిటీ నియమించింది. జూలై 10న ప్రారంభమైన దూర విద్య పరీక్షల్లో మొదటి విడత కేవలం పరీక్ష కేంద్రానికి పరిశీలకులను మాత్రమే నియమించాలి. కాంట్రాక్టు అధ్యాపకులే అబ్జర్వర్లుగా డబ్బులు దండుకోవాలా అంటూ పర్మినెంట్ అయిన తమను ఎందుకు తనిఖీ బృందాలుగా నియమించలేదంటూ కొందరు ఆచార్యులు యూనివర్సిటీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వీరిని రెండో దఫాలో ప్రత్యేక తనిఖీ బృందాలుగా నియమించేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. మూడో విడత పరీక్షలు ప్రారంభం దూరవిద్యలో మూడో విడత పరీక్షలు 30వ తేదీ నుంచి మొదలయ్యాయి. పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంటల వరకూ జరిగితే, మధ్యాహ్నం ఒంటిగంటకు యూనివర్సిటీలోని ఒక ఆచార్యుడు తనిఖీ బృందం అంటూ రెండు సెంటర్లలో హడావుడి చేశారు. తాము ముగ్గురం వచ్చామంటూ రు.60 వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై నిర్వాహకులు యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు. అయితే, అధికారులు స్పందించలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం తిరుపతి, చిత్తూరు జిల్లాలలో తనిఖీలకు వస్తానని.. నిర్వాహకులు తన సంగతి చూసుకోవాలని ముందుగానే వర్తమానం పంపినట్లు సమాచారం. దొడ్డిదారిన ఉద్యోగం పొందిన ఈయన ఒక ఎమ్మెల్యేకి క్లాస్‌మేట్‌నని, ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేకి దగ్గర బంధువునంటూ హల్చల్ చేస్తున్నాడు. బీఈడీ పరీక్షల వివాదంలో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు వచ్చినా పలుకుబడితో కొనసాగుతున్న ఆ ఆచార్యుడి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. మనకబారుతున్న ఏఎన్‌యూ ప్రతిష్ట దూర విద్య కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీ బృందాల పేరుతో దోపిడీ లాడ్జిలో పంచాయితీ రాయలసీమ జిల్లాల్లో ఒకే ప్రాంతంలో 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలను సీజ్ చేసి లాడ్జిలో పంచాయితీ పెట్టారు. వారు అడిగిన మొత్తం చెల్లించకపోవడంతో సెంటర్‌ను రద్దు చేయించారు. కోనసీమలో ఒక అతిథి అధ్యాపకుడు రూ.2 లక్షలు, తనిఖీ బృందాల పేరిట మరో రూ.50 వేలు వసూలు చేసినట్లు సమాచారం. దీనిపై అక్కడ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వచ్చాయి. ఒక తనిఖీ బృందంలోని ఒక ఆచార్యుడు ఒక సెంటర్లో ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. -
భర్త చిత్రహింసలపై ఫిర్యాదు
నగరంపాలెం: ఎమ్మెల్యే వద్ద ఉంటున్న భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన పేర్ల వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి నంబూరు లక్ష్మి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో మళ్లీ ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వెంకటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కిందట పౌల్రాజుతో ప్రేమ వివాహామైంది. భర్త పంచాయతీరాజ్‌లో పనులకెళ్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే వద్ద ఉంటున్నాడు. పాండ్రపాడులోని రెండెకరాల పొలంలో ఎకరాన్ని ఆరేళ్ల కిందట రూ.19 లక్షలకు విక్రయించాడు. మిగతా ఎకరం కూడా విక్రయించేందుకు నాపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై హింసకు గురిచేస్తున్నాడు. ఈనెల 11న మరణాయుధంతో దాడికి పాల్పడగా, ప్రాణాలతో బయటపడ్డాను. కుమార్తె సేవిత భర్త వద్దనే ఉంటుంది. ప్రస్తుతం నా భర్త, మరో రౌడీషీటర్‌తో కలసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నెల్లో డీపీఓ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అతనిపై ఫిర్యాదిచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో చేసేది లేక మరలా ఫిర్యాదు చేసేందుకు వచ్చామని బాధితురాలు వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి లక్ష్మి వాపోయారు. పాపను నాకు అప్పగించాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని భార్య వెంకటేశ్వరమ్మ మీడియా ఎదుట వేడుకుంది. -
మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు
నరసరావుపేట టౌన్: మానవ అక్రమ రవాణాపై పట్టణంలోని పెద్ద చెరువు 9వ లైన్లో గల బాలుర సంక్షేమ వసతి గృహంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాన సీనియర్ సివిల్ అధికారి కె. మధుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు చిన్నపిల్లలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు. వెట్టి చాకిరి, యాచకత్వం, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం బాలురను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరిచితులను నమ్మ వద్దన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
నరసరావుపేట రూరల్: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఇంటి మీద దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నరసరావుపేట పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది కె.స్నేహరెడ్డి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు.సత్తెనపల్లి రోడ్డులో నివసిస్తున్న తనను స్థానికంగా ఉంటున్న ఆనం శివ అనే వ్యక్తి వెంటపడి వేధిస్తున్నాడని, ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్‌తో పాటు పబ్లిక్ గ్రీవెన్స్‌లో రెండుసార్లు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశానని వివరించారు. నిందితుడు జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, తనపైనే కౌంటర్ కేసు పెడతామని టూటౌన్ పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. అధైర్య పడొద్దని వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. -
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పల్నాడు జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు గుత్తా లక్ష్మీనారాయణ బుధవారం కలిశారు. సామాజిక వర్గం పేరిట ఆయన్ని టీడీపీ గుండాలు ఓవైపు.. మరోవైపు పోలీసులు సైతం వేధించగా.. భరించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారాయన.పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ తొలి నుంచి వైఎస్సార్సీపీ అభిమాని. అయితే ఆ పార్టీలో కొనసాగడం జీర్ణించుకోలేక పోతున్న పెదనెమలిపురి టీడీపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనను తీవ్రంగా వేధించడంతో పాటు, ఒకసారి దాడి చేసి చేయి కూడా విరగ్గొట్టారు. ఇదే విషయాన్ని ఆయన జగన్‌కు తెలిపారు. మరో వైపు స్థానిక డీఎస్పీ ఒకరు, ఏకంగా కులాన్ని ప్రస్తావించి.. కమ్మ కులంలో పుట్టి.. రెడ్డిలకు చెందిన పార్టీలో ఎందుకున్నావని దూషించారని, దీంతో తీవ్ర మనస్థాపం చెందిన తాను, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. దీర్ఘకాల చికిత్స అనంతరం కాస్త కోలుకున్నాకే జగన్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారాయన. లక్ష్మీనారాయణ యోగక్షేమాలు విచారించిన వైఎస్ జగన్.. ఆయనకు ధైర్యం చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం కార్యదర్శి పి.శివారెడ్డి తదితరులు జగన్‌ను కలిసినవాళ్లలో ఉన్నారు. -
కోడెల విగ్రహ శిలాఫలకానికి మరమ్మతులు
సత్తెనపల్లి: పేరేచర్ల–కొండమోడు జాతీయ రహదారిలోని సత్తెనపల్లి తాలూకా సెంటర్లో డివైడర్ పై ఏర్పాటు చేసిన ఏపీ మాజీ స్పీకర్, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేరు ఉన్న శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోడెల అభిమానులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి మంగళవారం ఆ శిలాఫలకానికి మరమ్మతులు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కృషి గుంటూరు వెస్ట్: జిల్లాలో పర్యావరణ పరిరక్షణ పెంపొందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గాలి నాణ్యతను మరింతగా పెంపొందించేందుకు జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మిని సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను జిల్లా స్థాయి అమలు కమిటీలు నిర్వహించాలన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు నగరానికి 2011–15 మధ్య గాలి నాణ్యతా డేటా ఆధారంగా నాన్ అసైన్మెంట్ నగరాల్లో ఒకటిగా గుర్తించిందన్నారు. జాతీయ కాలుష్యాన్ని గుర్తించేందుకు జాతీయ క్లీన్ఎయిర్ ప్రోగ్రామ్‌ను రూపొందించారని పేర్కొన్నారు. రానున్న పది సంవత్సరాల్లో గాలిలో కాలుష్యాన్ని 70 నుంచి 80 శాతం తగ్గించే లక్ష్యంతో పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. దీనిలో భాగంగా 2019–20, 2024–25 వరకు గుంటూరు నగరానికి మొత్తం ఎన్సీ ఏపీ కింద రూ. 20.51 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి క్లీన్ సిటీ రూ.2.73 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన పనులను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సకాలంలో పూర్తి చేయాలన్నారు. గాలి నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కూ ల్చడం, నూతన బ్రిడ్జి నిర్మాణ క్రమంలో జీజీహెచ్, ట్రావెల్స్ బంగ్లాలో వద్ద ఉన్న నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఏర్పాటు చేసిన స్టేషన్లను ప్రత్యామ్నాయ ప్రాంతాలకు మార్చాలన్నారు. సమావేశంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్వీరాన్మెంట్ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, డీఎస్ ఆర్.చంద్రమౌళి పాల్గొన్నారు. రైల్వే సిగ్నల్ కంట్రోల్ కార్యాలయం ప్రారంభం దుగ్గిరాల: దుగ్గిరాలలో నిర్మించిన నూతన కార్యాలయంలో మంగళవారం రైల్వే సిగ్నల్ కంట్రోల్ వ్యవస్థను రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం ప్రారంభించారు. మూడు సంవత్సరాల నుంచి ఆధుని కీకరణ పనులతో పాటు మూడవ లైను నిర్మాణం జరుగుతుంది. పనులు పూర్తి కావడంతో అత్యంత ఆధునిక సాంకేతిక విధానం కలిగిన కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన
గుంటూరు మెడికల్: టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంటూరులోని జిల్లా జైలులో 250 మంది ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, దగ్గినప్పుడు కళ్లెతోపాటు రక్తం పడడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా భావించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, నిర్ణీత కాల వ్యవధి ఉన్న మందుల కోర్సు వాడడం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అన్నారు. క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుందని, దగ్గే సమయంలో నోటికి కర్చీఫ్ పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎ.బి.శాంతరాజు, వైద్య అధికారిణి డాక్టర్ లక్ష్మీసుధ, సిబ్బంది నాగజ్యోతి, స్వరూప, రాంబాబు, సాంబశివరావు, నాగమణి, సంధ్యారాణి పాల్గొన్నారు. -
యోగా పోటీల్లో సత్తా చాటాలి
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: జాతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీల్లో పతకాల సాధనే లక్ష్యంగా క్రీడాకారులు కృషి చేయాలని చిలకలూరిపేట పురపాలక కమిషనర్ పి.శ్రీహరిబాబు చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం యోగా క్రీడాకారులతో కళకళ లాడింది. జేఎన్వీ పరిధిలో జరిగే ప్రాంతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీలకు మద్దిరాల నవోదయ విద్యాలయం వేదికగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఇటీవల జరిగిన క్లస్టర్ స్థాయి యోగా పోటీల్లో విజేతలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. తరలివచ్చిన 278 మంది విద్యార్థులు 29వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం ఐదు రాష్ట్రాలకు చెందిన 278 మంది క్రీడాకారులు, తమ పీఈటీలు, ఎస్కార్ట్‌లతో తరలివచ్చారు. మున్సిపల్ కమిషనర్ ిపి.శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా ప్రదర్శన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు అధ్యక్షత వహించిన విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్.నరసింహారావు స్వాగతోపన్యాసం చేశారు. ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ లింగయ్య చౌదరి, నవోదయ విశ్రాంత సహాయ కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జేఎన్వీల విద్యార్థులు యోగా ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో జేఎన్వీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీలో దక్షిణ భారత యోగా ప్రదర్శన పోటీలు ప్రారంభం ఐదు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు -
ఉన్నపళంగా పొమ్మంటే ఎలాగయ్యా!
నెహ్రూనగర్: అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని.. ఇప్పుడు ఉన్న పళంగా నోటీసులు ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజమని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలను చూపించి.. మా ఇళ్లను పడగొట్టండి అంటూ నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆందోళన నిర్వహించారు. తమ గోడు విన్నవించుకునేందుకు వస్తే అధికారులు తమపై మండిపడుతూ, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూకుమ్మడి ఆత్మహత్యలే గతి 18 సంవత్సరాలకు పైబడి ఊరికి దూరంగా కనీస మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, రూ.వేల అద్దెలు చెల్లించే స్థోమత లేక చిన్న ఇళ్లు నిర్మించుకుని కూలీ పనులు చేసుకుంటూ తాము జీవిస్తున్నామని, ఆ ఇళ్లను ఖాళీ చేయాలంటూ జీఎంసీ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారని వాపోయారు. ఇళ్లు ఖాళీ చేయడంలో తమకు అభ్యంతరం లేదని.. కానీ గత ప్రభుత్వ హయాంలో కొర్నెపాడు దగ్గర ఇచ్చిన స్థలాలను తమకు చూపించి ఇళ్లు తొలగించాలని వారు ప్రాధేయపడ్డారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లను తొలగించాలని చూస్తే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు గత్యంతరం లేదని వాపోయారు. టిడ్కో ఇళ్లల్లో నివాసం కల్పించాలి ప్రస్తుతం కొర్నెపాడులో తమకు ఇచ్చిన స్థలాల్లో రైతులు పంట పండిస్తున్నారని.. అవి తమకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని.. అడవి తక్కెళ్లపాడు, వెంగళాయపాలెంలో ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లల్లో తమకు నివాసం ఉండేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. స్థలాలు చూపించి మా ఇళ్లు పడగొట్టండి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నల్లపాడు చెరువు కట్ట నివాసితుల ఆందోళన -
వెయిట్ లిఫ్టింగ్‌లో అంగలకుదురు విద్యార్థుల సత్తా
తెనాలిరూరల్: దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని అంగలకుదురు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 60 కిలోల విభాగంలో బి.దివ్య, 70 కిలోల విభాగంలో జి.అఖిల, 105 కిలోల విభాగంలో ఎం.బాలాజీ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. అలానే 83 కిలోల విభాగంలో టి.హేమచంద్, 90 కిలోల విభాగంలో వై. శ్రీశశాంక్ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వ్యాయామోపాధ్యాయులు వేమూరి శరత్‌బాబు, పులివర్తి రాజులను పాఠశాల హెచ్ఎం ఎన్.అనురాధ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మంగళవారం అభినందించారు. -
సమన్వయంతో పనిచేస్తే ప్రమాదాల నివారణ
నరసరావుపేట: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలైన రెవెన్యూ, రవాణా, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, ఆరోగ్య శాఖలు పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ‘డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశానికి కలెక్టర్ చైర్మన్ హోదాలో హాజరై, ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్టుమెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని కోరారు. యూ టర్న్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రొంపిచర్ల వద్ద హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడ ప్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం నోడల్ అధికారి ఈ–డార్ యాప్ పై అవగాహన కల్పించారు. ఆర్టీఓ వి.సంజీవ కుమార్, ఆర్అండ్బీ ఈఈ, ఆర్టీసీ ఆర్.ఎం, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. గంజాయి హాట్స్పాట్లపై నిఘా పెట్టండి.. నరసరావుపేట: జిల్లావ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్స్పాట్లపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో ఉన్న అనుమానితుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లా మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మించిన భవనాలు, ఖాళీగా వదిలివేసిన భవనాలలో కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై, గంజాయి సరఫరా చేస్తూ, అమ్ముతూ దొరికిన వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లస్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. డీ–అడిక్షన్ సెంటర్లు పునరావాస సహాయం కోసం అవుట్‌రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కలువ రవీంద్ర, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం.ప్రసూన, సైకియాట్రిస్ట్ డీజీపీఎస్ రాజు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి, డీపీఓ ఎస్వి.నాగేశ్వర నాయక్, డీసీజీఎస్డబ్ల్యూఎస్ ఏపీ గోపిరెడ్డి, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు జిల్లా ఎస్పీతో కలిసి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహణ -
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో అవసరమైన డేటా ను రూ పొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కార్యాచరణ ప్రణాళిక 2025–26 రూపకల్పనలో భాగంగా ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్, ప్రగతి పోర్టల్‌పై మండల స్థాయిలోని సాంకేతిక సిబ్బందికి శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ టీఎంపీ, ప్రగతి పోర్టల్, ప్రగతి యాప్ వినియోగించే పద్ధతి, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణకు సంబంధించిన అంశాలను పోర్టల్‌లో నమో దు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడంలో సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోస్ట్, ప్రీ అసెస్మెంట్, ఆధార్ ఆథెంటిఫికేషన్, ఈ–సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి అంశాలను పూర్తి చేసేందుకు ప్రతి ఉద్యోగికి శిక్షణ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు రవీంద్రబాబు, కె.నాగేశ్వరరావు, కరీముద్దీన్, అనురాధ, ఏవో ప్రతాప్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో మద్యం అమ్మకం దారులు తాడికొండ: ‘మద్యం మత్తులో యువకుల ఘర్ష ణ’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. తాడికొండలోని మద్యం దుకాణంలో రాత్రి వేళ అమ్మకా లు చేస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు 80కి పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఉద్యోగుల ప్రయోజనాలు సాధించేందుకు రాజీపడం
గుంటూరు మెడికల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను సాధించేందుకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం గుంటూరులో గుంటూరు వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఏపీ ఎన్జీజీవో సంఘ సాంస్కృతిక సమావేశ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యా సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, సరండర్ లీవ్ బకాయిలు కొంత మేరకు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. మిగిలిన వాటిని చెల్లించేందుకు రాష్ట్ర నాయకులతో కృషి చేస్తుందని తెలిపారు. గుంటూరులో ఎన్జీవో ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని అభినందించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఎన్జీవో ప్రాంగణాలను ఉద్యోగులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు గుంటూరు జిల్లా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ ఉద్యోగ నాయకుల సమష్టి కృషితో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు సాధించుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యామ్‌సుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి, రామ్‌ప్రసాద్, రంజిత్‌నాయుడు, తదితరులు మాట్లాడారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమక్షంలో నూతన సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. సంఘ గుంటూరు నగర అధ్యక్షుడు సూరి, కార్యదర్శి కళ్యాణ్‌కుమార్, సంఘ నేతలు సత్యనారాయణరెడ్డి, శరత్‌బాబు, కృష్ణారెడ్డి, రామకృష్ణ, రాంబాబు, జానీబాషా, వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, సుకుమార్, శ్రీవాణి పాల్గొన్నారు. -
బీభత్సం సృష్టించిన కారు
నరసరావుపేట టౌన్: అతివేగంగా వచ్చిన కారు ఢీకొని ద్విచక్ర వాహనదారులతో పాటు నడిచి వెళ్తున్న బాలికకు తీవ్రగాయాలైన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యలమంద గ్రామానికి చెందిన ఎ. మరియదాసు, బూదాల బాబురావులు ద్విచక్ర వాహనంపై ప్రకాష్‌నగర్ సెయింట్ జోసఫ్ స్కూల్ వైపు నుంచి 60 అడుగుల రోడ్డుకు వెళ్తున్నారు. పక్కనే మరో ద్విచక్ర వాహనంపై నవీన్ అనే వ్యక్తి వస్తున్నాడు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఏపీ 11 ఏఎస్ 1638 నంబర్ గల కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కారును వెంబడించటంతో కారు అతివేగంగా రివర్స్ చేస్తూ అప్పుడే ట్యూషన్ నుంచి వస్తున్న బాలిక షేక్ ఆయేషాను ఢీకొట్టింది. సంఘటనలో బాలిక ఎడమ చేయి విరిగింది. క్షతగాత్రులు నలుగురిని ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారును స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.వి. చరణ్ మంగళవారం తెలిపారు. కారు నడిపిన నిందితుడు పట్టణానికి చెందిన మైనర్ బాలుడు షేక్ సుభానిగా గుర్తించారు. మైనర్‌కు కారు నడిపేందుకు ఇచ్చిన ఓనర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులపైకి దూసుకెళ్లి.. బాలికను ఢీకొట్టి నలుగురికి గాయాలు కారు డ్రైవర్ మైనర్ బాలుడిగా గుర్తింపు -
సుబ్రమణ్యేశ్వరునికి నాగపంచమి విశేష పూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలోని సుబ్రమణ్యేశ్వరస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకులు శంకరమంచి రాజేష్‌శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రమణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుబ్రమణ్యేశ్వరుని పూజలలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొ న్నారు. విజయకీలాద్రిపై ఘనంగా గరుడ పంచమి తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం గరుడ పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్‌స్వామి మంగళ శాసనాలతో ఉదయం 9 గంటలకు గరుత్మంతునికి పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు సంతాన ప్రాప్తి కోసం గరుడ హోమం ఘనంగా నిర్వహించామని అన్నారు. పద్మావతి అమ్మవారి మాస తిరునక్షత్ర సందర్భంగా పద్మావతి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 75 త్యాళ్లూరు పీఎంశ్రీ ఉన్నత పాఠశాల జాతికి అంకితం పెదకూరపాడు: జాతీయ స్థాయిలో పల్నాడు జిల్లాలో ఉత్తమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ‘జాతీయ విద్యా విధానం’ ఎన్ఈపీ–2020 ఐదో వార్షికోత్సవం సందర్భంగా భారత్ మండపం న్యూ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేయగా స్థానికంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్, ఏఎంవో పూర్ణచంద్ర రావు అంకితం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 75 త్యాళ్లూరు హైస్కూల్ ఉండటం విశేషం. డీఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మకమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంశ్రీ పథకం ఎంతగానో దోహదపడుతుందని, ఇది పాఠశాలలకు ఒక వరం లాంటిదని అన్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రసారమైన వివిధ కార్యక్రమాలను విద్యార్థులు, అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్పర్సన్ బి.చంద్రకుమారి, మండల విద్యాశాఖ అధికారి టి.సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఈ అనుముల శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ సీఆర్ఎంటి శివ తదితరులు పాల్గొన్నారు. నేడు శివాలయంలో హుండీ కానుకల లెక్కింపు పెదకాకాని: శివాలయంలో హుండీ కానుకలు లెక్కింపు కార్యక్రమం బుధవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు నియమించిన అధికారి సమక్షంలో ఉదయం 9 గంటలకు హుండీలను తెరిచి కానుకలు లెక్కించడం జరుగుతుందన్నారు. ఆలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొంటారన్నారు. కానుకల లెక్కింపులో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. -
అవే సమస్యలు– అవే అర్జీలు
నరసరావుపేట రూరల్: జిల్లా ఎస్పీ కార్యక్రమంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అర్జీదారుల సమస్యలను ఒపిగ్గా తెలుసుకొని స్థానిక పోలీసులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. ఆస్తి, కుటుంబ, ఆర్థిక పరమైన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన అర్జీల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్జీలను తీసుకొని పోలీసు స్టేషన్‌కు వచ్చే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాయంత్రం రండి , రేపు రండి అంటూ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. న్యాయం చేయక పోగా స్టేషన్లో ఎదురవుతున్న అవమానాలతో అర్జీదారులు మనస్తాపం చెందుతున్నారు. ప్రతి వారం వంద వరకు ఫిర్యాదులు.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలను తెలియజేసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. ప్రతి వారం సుమారు వంద వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక్కడకు వచ్చిన ఫిర్యాదులు స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్‌కు పంపి అధికారులు కూడా చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక పోలీసు స్టేషన్లో న్యాయం జరగకపోతేనే ప్రజలు ఎస్పీ కార్యాలయానికి వస్తున్నారు. ఇక్కడకి వచ్చిన ఫిర్యాదులను తిరిగి అదే పోలీసు స్టేషన్‌కు పంపుతుండటంతో ప్రజలకు న్యాయం లభించడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చి అర్జీలు అందజేసినా ఫలితం లేకపోవడం పలు మార్లు తిరిగే ఓపిక లేక పలువురు న్యాయం కోసం దిక్కులు చూస్తున్నారు. అవే సమస్యలు పునరావృతం.. పీజీఆర్ఎస్ ఆర్జీల పట్ల జిల్లాలోని పోలీసు అధికారులు ఆసక్తి చూపించడం లేదు. జిల్లా కార్యాలయం నుంచి వచ్చే అర్జీలపై నామమాత్రంగా విచారణ చేపడుతున్నారు. రెండు రోజులు అర్జీదారులను స్టేషన్ చుట్టూ తిప్పి విచారణ పూర్తయినట్టుగా వారి చేత సంతకం తీసుకొని పంపుతున్నారు. జిల్లా అధికారుల దృష్టిలో సమస్య పరిష్కారం అయినట్టు చూపుతున్నారు. అర్జీదారులు మాత్రం తమ సమస్యకు పరిష్కారం దొరకపోవడంతో ఎస్పీ కార్యాలయానికి అవే సమస్యలతో వస్తున్నారు. కొంత మంది అర్జీదారులు మూడు, నాలుగు సార్లు ఎస్పీ కార్యాలయానికి వచ్చినా న్యాయం లభించని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీసుల తీరుపైన, ప్రభుత్వ తీరుపైన మండిపడుతున్నారు. సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని పోలీసులను కోరుతున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని మాటలు చెప్పడం తప్ప ఆచరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్ఎస్ అర్జీల పట్ల పోలీసు అధికారుల నిర్లక్ష్యం జిల్లా ఎస్పీకి అందుతున్న ఫిర్యాదుల్లో అధికశాతం పునరావృతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సడలుతున్న నమ్మకం -
నేను పీజీఆర్ఎస్కు రావడం మూడవ సారి
నా భర్త అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం 2021లో మాకు ఉన్న 75 సెంట్ల స్థలాన్ని డి.వాసు అనే వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి రూ.5.25 లక్షలు తీసుకున్నాం. కమీషన్, రిజిస్ట్రేషన్ ఖర్చులు అని చెప్పి రూ.4.25లక్షలు ఇచ్చారు. అప్పుగా తీసుకున్న నగదుకు వడ్డీగా 2023లో రూ.4లక్షలు చెల్లించాం. సదరు స్థలాన్ని మాకు తెలియకుండా వాసు వేరే వాళ్లకి విక్రయించాడు. న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయానికి వచ్చి అర్జీలు ఇస్తున్నా క్రోసూరు పోలీసులు పట్టించుకోవడం లేదు. – మక్కెన పార్వతి, క్రోసూరు -
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలసిన బాఽధితులు
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ సీపీ సానుభూతిపరులన్న నెపంతో దుర్మార్గంగా మా ఇళ్లను కూల్చేశారని బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలసి తమగోడును విన్నవించుకున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వెంట వెళ్లి జననేతకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కూటమి నాయకుల ఆదేశాలతో నిరుపేదలమన్న కనికరం కూడా లేకుండా అధికారులు ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ద్వారా న్యాయపోరాటానికి అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారని బాధితులు మీడియాకు తెలిపారు. తమ సమస్యను జగనన్న వరకు తీసుకెళ్లిన బొల్లా బ్రహ్మనాయుడికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన బాధితులలో గంగబోయిన వెంకటనారాయణ, కంభంపాటి జీవన్ ఉన్నారు. -
కోర్టు ఉత్తర్వుల పేరుతో రోడ్డున పడేశారు
సాక్షి టాస్క్‌ఫోర్స్: బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ఇళ్లు కూల్చివేత ఒక పఽథకం ప్రకారం జరిగిందని, కోర్టు ఉత్తర్వుల పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగారని బాఽధితులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన కంభపాటి దాసు, గంగనబోయిన మునెయ్య, నాగరాజు, చెంచినీటి గౌరమ్మ, కంచర్ల గోవిందమ్మ, చొప్పవరపు చిన్నమునెయ్య, నారాయణమ్మలు కొన్నేళ్లుగా రోడ్డు పక్కన ఉన్న స్థలంలో నివాసగృహాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ద్రోణాదుల మల్లికార్జున తన వ్యవసాయ భూమికి అడ్డుగా ఇళ్లున్నాయని వాటిని తొలగించాలని కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ స్థలంలో కట్టుకున్న ఇళ్లను తొలగించమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తమకు అప్పీల్ చేసుకొనే సమయం ఇవ్వాలని కోరామని, అయితే టీడీపీ నేతల ఒత్తిడితో ఈనెల 25 తేదీ అకస్మాతుగా ఇళ్లు కూల్చడానికి జేసీబీలతో వచ్చారంటున్నారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని, దాన్ని అమలు చేయడానికి అడ్డురాబోమని చెబుతున్నారు. అయితే కనీసం ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు తీసుకునే సమయం ఇవ్వకుండా ఆర్ అండ్ బీ, రెవెన్యూ, పోలీసులు అధికారులు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల కూల్చివేత నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కావాలనే మరో అరగంటపాటు ఇళ్లను కూల్చేలా కూటమి నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్‌లో పల్నాడు జిల్లా కలెక్టర్‌ను కలసి మా గోడు వెళ్లగక్కినా ఫలితం లేదన్నారు. బాధితులకు అండగా ఉంటాం... బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామస్తుల ఆందోళన ఇంటిలోని సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు గ్రీవెన్స్‌లో కలెక్టరుకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదు కోర్టు ఆదేశాల పేరుతో నివాస గృహాలను దౌర్జన్యంగా కూల్చివేయడం అన్యాయం. కనీసం ఇంటిలో సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలపై వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఇళ్లను కక్షతో కూల్చడం బాధాకరం. కూటమి నేతలు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ సీపీ తరపున పూర్తిగా అండగా నిలిచి న్యాయపోరాటానాకి సహకరిస్తాం. –బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే -
మంత్రి లోకేష్ చెప్పినా పరిష్కారం కాలేదు
నా సోదరుడు మోతిలాల్‌తో పాటు కొంతమంది నాపై 2024లో దాడి చేశారు. నా మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసు దొంగిలించారు. దీనిపై మాచర్ల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ పట్టించుకోకపోవడంతో పీజీఆర్ఎస్లో మూడుసార్లు ఫిర్యాదు చేశా. స్పందన లేకపోవడంతో రాష్ట్రమంత్రి లోకేష్‌ను కలిసి సమస్యను తెలియజేశా. అయినా ఇప్పటికి నాకు న్యాయం జరగలేదు. – రమావత్ రవినాయక్, చింతలపూడి తండా, మాచర్ల మండలం -
ఇదేనా సంక్షేమం?!
● నరసరావుపేటలోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ● పది గదుల్లో లేని లైట్లు, ఫ్యాన్లు ● ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులు ● ఒక్కో బాత్రూమ్ను వినియోగిస్తున్న 30 మంది విద్యార్థులు ● విద్యార్థుల దుర్భర స్థితిపై డాక్టర్ గోపిరెడ్డి ఆవేదన నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల నిర్వాహణ దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలోని రామిరెడ్డిపేట పాత సమితి కార్యాలయ సెంటర్ సమీపంలోని ప్రభుత్వ సంక్షేమ బాలుర ఎస్సీ హాస్టల్‌ను పరిశీలించారు. హాస్టల్ రెండు అంతస్తులు తిరిగి చూశారు. వంటశాలను పరిశీలించి విద్యార్థుల కోసం తయారుచేస్తున్న అన్నం, కూరలను పరిశీలించారు. అన్నం తిని రుచిచూశారు.. తాము పడుతున్న బాధలను విద్యార్థులు డాక్టర్ గోపిరెడ్డికి వెల్లడించారు. ● హాస్టల్లో సుమారు 160 మంది విద్యార్థులు ఉంటుండగా వారందరూ రూమ్‌కు 15 నుంచి 20మంది వరకు ఉండటాన్ని గమనించారు. ● అలాగే సుమారు పదిరూమ్లలో లైట్లు, ఫ్యాన్లు లేకపోవటం, బాత్రూమ్లో లైటు లేకపోవటాన్ని గమనించి వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ● ఎక్కడిచెత్త అక్కడనే కుప్పలుగా పడిఉండటాన్ని గమనించి వార్డెన్‌ను ప్రశ్నించగా వర్కర్లు లేరని వార్డెన్ సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరపున 24గంటల వ్యవధిలో ఫ్యాన్లు, లైట్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. అధ్వాన స్థితిలో హాస్టళ్లు అనంతరం మీడియాతో డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్టైఫండ్ రావట్లేదన్నారు. విద్యార్థులకు ఫ్యాన్లు, లైట్లు, బెడ్లు లేవని చెప్పారు. ఈ హాస్టల్లో రెండు వారాల నుంచి పది రూములలో లైట్లు లేవని, లైటు లేకుండా ఏవిధంగా చదువుకుంటారని ప్రశ్నించారు. ఒక్కో బాత్రూమ్ 30మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారని, దానిలో లైటుకూడా లేదని చెప్పారు. తాగేందుకు మంచినీరు లేకపోవటంతో ఎదురుగా ఉన్న ఆర్ఓ ప్లాంట్‌లోని నీటిని కొనితెచ్చుకొని తాగుతున్నారన్నారు. వారానికి ఒక్కసారి మాత్రమే ఒక మహిళచేత చెత్త ఊడ్పిస్తున్నారన్నారు. పారిశుద్ధ్యం లోపించటంతో దోమలు, ఈగలు కారణంగా జ్వరాలతో విద్యార్థులు బాధపడుతున్నారన్నారు. ఇంజినీరింగ్, ఇంటర్ విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారన్నారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చిశివకోటి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, మాదిగ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ కందుల ఎజ్రా, గంటెనపాటి గాబ్రియేలు, కుక్కల పౌలు, మైలేరి మార్క్, వేణుమాధవ్, మణికంఠారెడ్డి, షాయాబ్, శాంతకుమార్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ తరఫున లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తాం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో హాస్టళ్లను చాలా చక్కగా నిర్వహించారని, నాడు–నేడు కింద హాస్టళ్లను బాగుచేసే ప్రయత్నంలో ప్రభుత్వం మారిందన్నారు. కూటమి హయాంలో నేడు తినేందుకు ఇచ్చిన బియ్యంలో ముక్కపురుగులు తిరుగుతున్నాయన్నారు. హాస్టల్లోని ఎస్సీ విద్యార్థులు చదువుకునే పరిస్థితి కన్పించట్లేదన్నారు. హాస్టల్ బిల్టింగ్ యజమానే హాస్టల్‌కు రంగులు వేయించాడని చెప్పారు. ఒక రూమ్‌లో పదిహేను రోజుల నుంచి లైటు లేకుండా విద్యార్థులు ఉంటున్నారంటే హాస్టల్ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో రూ.1.75లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని, ఆ డబ్బులతో కనీసంగా హాస్టళ్లను కూడా బాగుచేయకుండా వాటిని దిగమింగుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున ప్రైవేటు ఎలక్ట్రిషీయన్చే లైట్లు వేయిస్తున్నామని, ఎస్సీ సోదరుల సహకారంతో మరో 24గంటల్లో ఫ్యాన్లు వేయిస్తామని భరోసా ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పెద్దలు మొద్దునిద్ర పోతున్నారని, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి వెంటనే హాస్టళ్లను విజిట్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఉచిత ఇసుక తూచ్!
● కిలోమీటరుకు ఇంతని వసూలు చేస్తున్న ప్రభుత్వం ● రేవుల నుంచి తెచ్చి యథేచ్ఛగా టీడీపీ నేతల ఇసుక దోపిడీ ● వాగులూ, వంకలనూ వదలని అక్రమార్కులు సత్తెనపల్లి: ఎన్నికల ముందు ఉచితంగా ఇసుక ఇస్తామని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కిలోమీటర్లకు ఖరీదు కట్టి అమ్ముతోంది. భవన నిర్మాణదారుల నుంచి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటుంది. మరో వైపు అధికార పార్టీ నేతలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన తోడేస్తూ.. టిప్పర్లు, లారీల్లో అక్రమంగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యజమానులకు తప్పని భారం ఇసుక బుక్ చేసుకోవడం తెలియని యజమానులు అందుబాటులో ఉన్న ఇసుకను కొనుగోలు చేసి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కూటమినేతలు అడ్డదారుల్లో ఇసుకను తీసుకువచ్చి ట్రాక్టర్లలో నిల్వ ఉంచి మరీ అందిన కాడికి దోచుకుంటూ విక్రయాలు చేస్తున్నారు. ఇసుక రేవుల్లోనే కాక వాగులు, వంకలను వదలకుండా ఇసుకు తీసుకు వస్తున్నారు. బుకింగ్ చేసుకుంటే రోజుల తరబడి జాప్యం అవుతుందనే ఉద్దేశంతో భవన యజమానులు అందుబాటులో ఉన్న ఇసుకను అధిక రేట్లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కృత్రిమ కొరతతో ఇక్కట్లు సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాలకు ఇసుక పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి మండలాల నుంచి సరఫరా అవుతుంది. ఆయా మండలాల్లోని ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక సరఫరా అవుతుంది. జూన్ 12న కొలువు దీరిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అందరికీ ఉచిత ఇసుక అంటూ బూటకపు హమీ ఇవ్వడంతో భవన నిర్మాణ యజమానులు కొంతకాలం వేచి చూశారు. అయితే కూటమి సర్కారు ఉచితమన్న పదానికి అర్థం మార్చేసింది. ఇసుకకు ధరలు కేటాయించింది. అంతేకాక జిల్లాకు ఒక స్టాక్ యార్డు పెట్టి ఇసుక కృత్రిమ కొరత సృష్టించింది. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేయడంతో కార్మికులు ఇళ్లకే పరిమితమై ఆందోళనలు చేశారు. మొన్నటివరకు ఆషాఢ మాసం కావడంతో గృహ నిర్మాణాలు ప్రారంభించేందుకు యజమానులు ముందుకు రాలేదు. ప్రస్తుతం శ్రావణమాసం రావడంతో భవన నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ఈ క్రమంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తే భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరికే పరిస్థితి ఉండదు. -
అర్జీల సత్వర పరిష్కారానికి కృషి
నరసరావుపేట: కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్)లో 148 అర్జీలు స్వీకరించారు. అధికారులు అందరూ అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటిజాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు బల్లకట్టు ప్రయాణికులకు రక్షణ కల్పించండి సరైన భద్రతా చర్యలు లేని చింతిర్యాల గోవిందపురం వద్దనున్న బల్లకట్టుపై ప్రయాణం చేస్తున్న వారందరికీ రక్షణ కల్పించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే బల్లకట్టుపై ప్రయాణికులను రక్షించేందుకు గజ ఈతగాళ్లు లేరు. బెలూన్లు లేవు. – ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారు.. వినుకొండ రూరల్ పరిధిలోని 2.45 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎన్ఎస్పీ కాలువతో సహా రిజిష్టర్ చేయించుకున్న శాంతమ్మ, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. దీనిపై ఈ ఏడాది మే 28న ఒకసారి తహసీల్దార్‌కు, జూన్ 30న గ్రీవెన్‌సెల్‌లో మరోసారి ఫిర్యాదు చేశాం. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆక్రమణ దారుల్లో ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు ఉన్నారు. వారిపై విచారణ చేయించి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి. –వై.వెంకటేశ్వరరావు, మస్తాన్‌వలి, పీడీఎం -
రూ.2కోట్లతో చిట్టీ నిర్వాహకులు పరారీ
నరసరావుపేట రూరల్: చిట్ల పేరుతో వసూళ్లు చేసిన సుమారు రూ.2కోట్ల సొమ్ముతో నిర్వాహకులు పరారైనట్టు నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన పలువురు బాధితులు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలకు సంబంధించిన 98 ఫిర్యాదులు అందాయి. చిట్టీ పేరిట 100 మందికి టోపీ లింగంగుంట్ల గ్రామంలో పానుగంటి ప్రసాద్, రంగమ్మలు గత 30 సంవత్సరాలుగా చిట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సకాలంలో డబ్బులు చెల్లిస్తుండటంతో నమ్మిన గ్రామస్తులు అధిక సంఖ్యలో సభ్యులుగా చేరారు. 20 రోజుల నుంచి ప్రసాద్, రంగమ్మలు కనిపించకుండా పోయారు. ఆందోళనకు గురైన చిట్ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సుమారు 100 మందికి రూ.2కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పోలీసు పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన లింగంగుంట్ల గ్రామస్తులు -
రాష్ట్రమంతా అంటూ ఊదరొట్టారు
ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికి తిరిగి రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఊదరగొట్టారు. తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కేవలం పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే సదుపాయం ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా పల్లెవెలుగు, అల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే ఉచితమని చెప్పలేదు. తీరా అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు తన సహజ బుద్ధిని బయటపెట్టి హామీలో కోతలు పెట్టాడని మహిళలు ఆరోపిస్తున్నారు. చిరువ్యాపారాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యా ర్థినులు పట్టణాలకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి, వాటిలో ప్రయాణ సదుపాయం ఇవ్వకపోతే ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న ఒకటి అర పల్లెవెలుగు బస్సులో ప్రయాణించడం కష్టమని పెదవి విరుస్తున్నారు. -
వంతెనపై ప్రయాణం.. భయం !
పూడుకుపోయిన పంట కాలువ నకరికల్లు: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే వంతెనపై ప్రయాణం ప్రమాదంగా మారింది. మండలం పరిధిలోని నకరికల్లు – మాచర్ల రహదారిలో బెల్లంకొండ బ్రాంచికెనాల్ వంతెనపై ప్రమాదం పొంచి ఉంది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అల్యూమినియం సైడ్‌వాల్స్ విరిగిపోయాయి. దీంతో వాహనాలు అదుపుతప్పితే కెనాల్లో పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఇదే ప్రదేశంలో అదుపుతప్పిన లారీ కెనాల్లో పడిపోయింది. ప్రాణాపాయం తప్పినప్పటికీ వాహనం మొత్తం నుజ్జునుజ్జయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సత్వరమే వంతెనకు సైడ్‌వాల్స్‌ను పటిష్టం చేసి, వంతెనకు ఇరువైపులా పూర్తిస్థాయిలో వాటిని నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. ధ్వంసమైన అంతర్గత సైడ్‌వాల్స్ బెల్లంకొండ బ్రాంచి కెనాల్ పరిధిలో నకరికల్లు, రాజుపాలెం మండలాల పొలాలకు సాగునీటిని సరఫరా చేస్తారు. నర్శింగపాడు గ్రామం సమీపంలోని వంతెన వద్ద సాగునీరు సక్రమంగా కెనాల్లో పయనించేందుకు, కట్ట కోతకు గురికాకుండా సైడ్‌వాల్స్‌ను నిర్మించారు. ప్రస్తుతం సైడ్‌వాల్స్ పూర్తిగా దెబ్బతిని ధ్వంసమై ఉన్నాయి. సైడ్‌వాల్స్ పగిలిపోయిన కారణంగా కట్ట కోతకు గురికావడం, గండిపడడం, సాగునీటి వృధా అయ్యే ప్రమాదం పొంచి ఉంది. నిత్యం కంటికి కనిపించే సమస్య అయినప్పటికీ అంతర్గత సైడ్‌వాల్స్‌కు మరమ్మతులు చేయడంపై ఎన్నెస్పీ అధికారులు దృష్టిసారించడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. రక్షణ గోడలు నిర్మించాలి నర్శింగపాడు సమీపంలోని బెల్లంకొండ బ్రాంచికెనాల్ కాలువపై గల వంతెన రక్షణ గోడలు పూర్తిగా విరిగిపోయాయి. గతంలో వాహనాలు ఢీకొని అల్యూమినియం వాల్స్ విరిగిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు స్పందించి సత్వరమే మరమ్మతులు చేపట్టాలి. – ముజావర్ జాన్అహ్మద్, స.హ.చట్టం ప్రచార ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి బెల్లంకొండ బ్రాంచి కెనాల్ నుంచి పొలాల్లోకి సాగునీరు సరఫరా చేసే పంటకాలువ పిచ్చిచెట్లు, ముళ్లపొదలు, గడ్డితో పూడుకుపోయింది. కనీసం కాలువ కూడా కనిపించే పరిస్థితి లేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న తరుణంలో సాగునీటి సరఫరా అవశ్యం. కానీ పంటకాలువ పూడిపోవడంతో పొలాలకు నీరుచేరే అవకాశం కన్పించడం లేదు. సాగునీటి విడుదలకు చాలా సమయం పట్టినప్పటికీ పంటకాలువను సిద్ధం చేసుకోవడంలో అధికారులు దృష్టి సారించకపోవడంతో పొలాలకు సాగునీరు సక్రమంగా చేరుతుందా అన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొని ఉంది. ●బెల్లంకొండ బ్రాంచి కెనాల్ వంతెనపై పొంచి ఉన్న ప్రమాదం కూలిపోయిన సైడ్ వాల్స్ శిథిలావస్థకు చేరిన అంతర్గత సైడ్ వాల్స్ పట్టించుకోని అధికారులు -
విద్యార్థుల మెదడుకు పదును
● శాసీ్త్రయ పరిశోధనల దిశగా ప్రోత్సాహం ● విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష ద్వారా ఎంపిక ● పరిశోధనలు, ప్రయోగాలపై ఆసక్తి కనబర్చే విద్యార్థులకు పుష్కల అవకాశాలు ● పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ● హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఆన్లైన్లో మొదలైన రిజిస్ట్రేషన్లు సత్తెనపల్లి/గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల మెదడుకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా వారిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరిట జాతీయస్థాయి సైన్స్ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వీవీఎం 2025–26 ముఖ్యాంశాలు జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఆర్టీ) జాతీయ స్థాయిలో నిర్వహించనున్న వీవీఎం సైన్స్ ప్రతిభా పరీక్షకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ బోర్డు నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షను ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ భాషల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులను పరిశోధన, ప్రయోగాల వైపు ప్రోత్సహించడం దీని లక్ష్యం. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ఉన్నత చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది. శాస్త్ర, పరిశోధనలకు ప్రోత్సాహం విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం, సంప్రదాయ యుగం నుంచి ఆధునిక యుగం వరకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన సహకారాల గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించడం వీవీఎం ముఖ్య ఉద్దేశం. వర్క్‌షాప్‌లు, కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందించి, శాసీ్త్రయ దృక్పథం ఉన్న విద్యార్థులను గుర్తించడానికి పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది. శాసీ్త్రయ రంగంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధనల దిశగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు మార్గదర్శకులను అందించడం లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయవంతమైన విద్యార్థులను గుర్తించి, వారిని సత్కరించడం, దేశంలోని వివిధ పరిశోధన, అభివృద్ధి సంస్థలకు విజేతల కోసం ఎక్స్పోజర్ సందర్శనలను నిర్వహించడం ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. పరీక్షకు రిజిస్ట్రేషన్ అక్టోబర్‌లో జరగనున్న ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విద్యార్థుల తాము చదువుతున్న పాఠశాల హెచ్ఎం, ప్రిన్సిపాల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. విద్యార్థులు వ్యక్తిగతంగానూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివిధ దశల్లో జరగనున్న వీవీఎం ప్రతిభా పరీక్ష సిలబస్, సబ్జెక్టు పరమైన సందేహాలు నివృత్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలకు vvm. org. in సైట్లో బ్రోచర్, నోటిఫికేషన్ పరిశీలించాలి. -
ప్రైవేట్ నర్సరీలతో జర జాగ్రత్త
సత్తెనపల్లి: జిల్లాలో మిర్చి పంటలు సాగు చేసే రైతులు నారు కోసం నర్సరీలను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు నారు కోసం ప్రైవేట్ నర్సరీలపై ఆధారపడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది ప్రైవేట్ నర్సరీల నిర్వాహకులు నాసిరకం నారును రైతులకు అంటగడుతున్నారు. నర్సరీల నిర్వాహకుల మాటలు నమ్మి రూ.లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేసిన రైతులు దిగుబడులు సక్రమంగా రాక, తెగుళ్ల బెడదతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా నారు కొనుగోలు సమయంలో మోసపోతే రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. పైరు ఏపుగా పెరిగి ఎన్ని మందులు వాడినా దిగుబడులు రాక రైతులు నష్టపోతుంటారు. పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ప్రైవేట్ నర్సరీల నిర్వాకంతో రైతులు నష్టపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే రైతులు మోసపోకుండా ఉండేందుకు విత్తన చట్టం ప్రకారం నర్సరీల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్వాహకులు విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? ఎలా పెంచుతున్నారు? రైతులకు ఎలా ఇస్తున్నారని? ఉద్యాన శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. జిల్లాలో ప్రైవేట్ నర్సరీలు 380 నిర్వహిస్తున్నారు. ఉద్యాన శాఖ అధి కారులు పరిశీలించి లైసెన్స్ గడువు ముగిసిన నర్సరీలను వెంటనే రెన్యువల్ చేసుకోవా లని నర్సరీల నిర్వాహకులకు సూచిస్తున్నారు. ఏమాత్రం పొరపాటు జరిగిన రైతుకు తీవ్ర నష్టం నారు నాణ్యతలో రాజీ పడకూడదు ప్రైవేట్ నర్సరీల నిర్వాహకులు నిబంధనలను పాటించకుంటే చర్యలు జిల్లా వ్యాప్తంగా 380 మిర్చి సాగు ప్రైవేట్ నర్సరీలు నర్సరీలు పాటించాల్సిన నిబంధనలు... నారు పెంచే నర్సరీ చుట్టూ ఇన్సెక్ట్ నెట్ ఉండాలి ఇన్సెక్ట్ నెట్‌కు ఎలాంటి చిల్లులు లేకుండా చూడాలి డబుల్ డోర్‌కు ఎలాంటి సందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి షేడ్ నెట్‌కు మూడు అడుగుల విస్తీర్ణం వరకు ఎలాంటి కలుపు, చెట్లు ఉండకూడదు నర్సరీ లోపల పసుపు రంగు జిగురు అట్టలు ఉంచాలి నర్సరీ లోపల వైరస్ నిర్మూలనకు చుట్టూరా ట్రాప్ క్రాఫ్ (బంతి మొక్కలు) వేయాలి ప్రతి బెడ్డుకు ముందు ఆ బెడ్డులో పోసిన నారును సూచిస్తూ కంపెనీ, వైరెటీ, నాటిన తేదీ మొదలగు వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలి నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన కంపెనీల బిల్లులు తీసుకోవాలి నర్సరీ కి సంబంధించిన ఏడు రిజిస్టర్ లలో పూర్తి వివరాలు నమోదు చేయాలి నర్సరీ లైసెనన్స్ నెంబర్ ప్రింట్ చేసిన బిల్లులు మాత్రమే నారు కొనుగోలుదారులకు ఇవ్వాలి నర్సరీ పేరును సూచిస్తూ నర్సరీ బయట పెద్ద బోర్డును ఏర్పాటు చేయాలి -
వడియరాజులను ఎస్టీ జాబితాలో చేర్చటం తమ కల
సత్తెనపల్లి: వెనుకబడిన వడియరాజులను ఎస్టీ జాబితాలో చేర్చటం తమ కల అని, దాని సాధన కోసం అనేక ఉద్యమాలు చేశామని ఆంధ్రప్రదేశ్ వడ్డెర (వడియరాజుల) సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు వేముల బేబీ రాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర (వడియరాజుల) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్తెనపల్లిలోని ఏఐఎం ఫంక్షన్ హాల్లో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడుగా తన్నీరు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. బేబీరాణి మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నామని, ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారే తప్ప తమకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో తాము 40 లక్షల మంది జనాభా ఉన్నామని, 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రాజకీయ అభివృద్ధిలో భాగస్వామ్యల్ని చేయాలన్నారు. ఎస్టీ సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నామని, 80 శాతం మంది వడ్డెర జాతికి సంబంధించిన నాయకులు కూటమి ప్రభుత్వం రావడానికి చాలా కృషి చేశారన్నారు. రాజకీయంగా వడ్డెర జాతికి ప్రాధాన్యత ఇవ్వా లని, ఒక రాజ్యసభ సీటు, మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియను అమలుపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాసరావు మాట్లాడుతూ వడ్డెర జాతి అభివృద్ధి కోసం అన్ని జిల్లాలు పర్య టిస్తానని, తమకు జరిగిన అన్యాయాన్ని వడ్డెర జాతి అంతా ఐక్యమై ప్రశ్నిస్తుందన్నారు. పల్నాడు జిల్లాలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి ఎస్టీ సాధన కోసం ఉద్యమం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డీ.వేలాద్రి, రాష్ట్ర కన్వీనర్ బత్తుల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఉప్పుతల దేవరాజ్, రాష్ట్ర యువజన విభాగ కన్వీనర్ డేరంగుల అంజి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాతర్ల మంజునాథ్, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు వేముల శ్రీదేవి, సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మన్నెం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. వడియరాజులను ఎస్టీ జాబితాలో చేర్చటం తమ కల వడియరాజుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు బేబీరాణి -
రివాల్వర్‌తో బెదిరించి..
రియల్టర్ల కిడ్నాప్‌నకు నిందితులు తుపాకీ ఉపయోగించినట్టు తెలుస్తోంది. నిందితులు హత్యల తరువాత పారిపోతూ చిలకలూరిపేట వద్ద వదిలిన కిడ్నాప్‌నకు ఉపయోగించిన కారులో లభించిన రివాల్వర్ పౌచ్ ద్వారా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఈ కారులో తుపాకీ పౌచ్తోపాటు హత్యలకు వినియోగించేందుకు తెచ్చిన ఓ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తుపాకీ, కత్తులతో బెదిరించడం వల్లే తండ్రీకొడుకులు కిడ్నాప్‌నకు గురయ్యే సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేయలేకపోయి ఉంటారని భావిస్తున్నారు. -
టీడీపీ నేతలతో సంబంధాలు..
నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన తండ్రీకొడుకులను బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు పరిఽధిలో హత్య చేయడం వెనుక ముందస్తు వ్యుహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సంతమాగులూరు గ్రామానికి చెందిన నిందితుడు బాదం మాధవరెడ్డికి బాపట్ల, ప్రకాశం జిల్లాలలో అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా పరిధి దాటగానే బాపట్ల జిల్లా ప్రారంభమైన 200 మీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ వెంచర్లో హత్యలు చేశారు. ముందస్తు పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి పరారయ్యారు. -
అప్రమత్తతతో డెంగీకి చెక్
గుంటూరు మెడికల్: డెంగీ జ్వరం... ఈ మాట వినగానే జిల్లా ప్రజల్లో వణుకు పుడుతుంది. గతంలో అధికంగా కేసులు జిల్లాలోనే నమోదవ్వడంతో హెల్త్ ఎమర్జన్సీ సైతం ప్రకటించారు. డెంగీ జ్వరంతో మరణాలు కూడా సంభవించాయి. సాధారణంగా కొన్ని జ్వరాలు వచ్చిన కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో జ్వరాలు వస్తుంటాయి. కానీ మండుటెండల్లోనూ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట జ్వర బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డెంగీపై కొద్దిపాటి అవగాహనతో జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండొచ్చు. ఇవీ.. లక్షణాలు పగటి పూట కుట్టే ఎడిస్ ఈజిస్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. వాంతులు, తలనొప్పి, కంటి గుడ్డు కదిలినప్పుడు నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతి అయినట్లు భ్రాంతి కల్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఒంటిపై ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది. ఎలీసా పద్ధతిలో రక్త పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అపోహలతో ప్రాణాల మీదకు.. డెంగీపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంత మంది బొప్పాయి రసం తాగితే, బొప్పాయి తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయనే అపోహల్లో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డెంగీపై అవగాహనతో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం బారిన పడకుండా ఉండొచ్చు. పట్టణాల్లో కేసులు అధికం గ్రామీణ ప్రాంతాల్లో కంటే మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది గుంటూరు నగరంలో 31 కేసులు నమోదయ్యాయి. నగరంలోని భాగ్యనగర్, బొంగరాలబీడు , బృందావన్ గార్డెన్స్, గోరంట్ల, కోబాల్డ్‌పేట, గుండారావుపేట, గుంటూరువారితోట, శారదాకాలనీ, ఆర్.అగ్రహారం, వసంతరాయ పురం, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, ఎన్జీఓ కాలనీ, మంగళదాస్ నగర్, లాంచెస్టర్రోడ్, ఐపీడీకాలనీ, గుంటూరువారితోట, లాలాపేట, తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితుల వివరాలు సంవత్సరం బాధితుల సంఖ్య 2021 447 2022 168 2023 375 2024 432 2025 50 (జూన్ వరకు) జిల్లాలో 50 కేసులు నమోదు అపోహలతో ప్రాణాలు పోయే ప్రమాదం కొద్ది జాగ్రత్తలతో జ్వరానికి అడ్డుకట్ట డెంగీ పేరుతో ప్రైవేటు వైద్యుల దోపిడీ దోమలు పెరిగే ప్రదేశాలివీ.. మంచినీటిని నిల్వ చేసే ప్రదేశంలో, వాడి పారేసిన వస్తువులు, నిలువ ఉండే నీటిలో దోమ పిల్లలు పురుగుల మాదిరి కదులుతూ ఉంటాయి. నీటిని నిల్వచేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బురోళ్లు, వాడి పారేసిన టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, కొబ్బరి చిప్పలు, బొండాలు, ఫ్రిజ్, ఎయిర్ కూలర్ల వెనుక భాగాల్లో, పూల కుండీలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, నీటి సంపుల్లో ఈ దోమ లార్వాలు పెరుగుతాయి. -
టీడీపీ నుంచి మొగల్ జాన్‌ను సస్పెండ్ చేయాలి
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రైతులు నష్టపోయిన బంగారాన్ని ఇప్పించాలంటూ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కౌలు రైతు సంఘం నాయకుడు హనుమంతరావుపై దాడి చేయటాన్ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య ఖండించారు. అధికార పార్టీకి చెందిన క్రోసూరు మండల అధ్యక్షుడు మొగల్ జాన్ దాడి చేయటం అధికార తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుందా లేక దొంగల పక్షాన పనిచేస్తుందా, అటువంటి వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులపై దాడులు చేస్తే వెన్నుచూపరని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతర పోరాటం సాగిస్తారన్నారు. ఆదివారం దొడ్లేరు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ దొడ్లేరు గ్రామస్తులు అనంతవరం మీదగా క్రోసూరు వెళ్లడానికి, ఆవులువారిపాలెం మీదుగా బెల్లకొండ వెళ్లడానికి పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పునరుద్ధరించాలని ఆర్ అండ్ బీ అధికారులను కలిసి గ్రామ ప్రజల సమస్యలను విన్నవించామన్నారు. అంతేకాకుండా సాగర్ కాలవ నీళ్లు చివరి ఆయకట్టు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు షరతులు లేకుండా రుణాలు కల్పించాలని, అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై రాధాకృష్ణ, వై గోపాలరావు గద్దె చలమయ్య, ఆంజనేయులు నాయక్, జి మల్లేశ్వరి, డి విమల. పి మహేష్, అచ్చంపేట క్రోసూరు మండలాల రైతు సంఘం నాయకులు, హనుమంతరావు ఆవుల ఆంజనేయులు, ఆర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య దొడ్లేరులో ప్రదర్శన, రాస్తారోకో -
తైక్వాండో పోటీల్లో 15 మందికి బంగారు పతకాలు
తెనాలి అర్బన్: గుంటూరు జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెనాలి కేఎస్ఆర్ అకాడమి విద్యార్థులు 15 మందికి బంగారు, ఆరుగురికి వెండి, ఇద్దరికి కాంస్య పతకాలు లభించినట్లు కోచ్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. పోటీలను రేపల్లెలో ఈ నెల 19,20 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. వీరందరూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఆదివారం అకాడమి ఆవరణలో క్రీడాకారులకు పతకాలు పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, వీరవల్లి మురళి, కుర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు. క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు మంత్రి అభినందనలు తాడేపల్లి రూరల్: మంగళగిరికి చెందిన యువ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఉండవల్లిలోని ఆయన కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో జెస్సీ రాజ్ సిల్వర్ మెడల్ సాధించినందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. -
ప్లేట్లెట్లపై అపోహలు వీడండి
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గటం సహజం. అంతమాత్రానికే ఊరికే రోగులు కంగారు పడకూడదు. సాధారణంగా రక్తంలో 2 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదం లేదు. డెంగీ మొదటి దశలో జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రగా మారతాయి. రెండో దశలో ప్లేట్లెట్స్ తగ్గటం, జ్వరం, వాంతులు, కాళ్ల వాపులు వస్తాయి. మూడో దశలో బీపీ తక్కువగా ఉండటం, ప్లేట్లెట్స్ తగ్గటం, శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. నాలుగో దశలో రోగికి కామెర్లతోపాటుగా షాక్‌లోకి వెళతాడు. బీపీ తగ్గడంతోపాటు కిడ్నీల పనితీరు కూడా తగ్గిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. అవి పగిలి రక్తం బయటకు వస్తుంది. మూత్రంలో, దగ్గు తున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. నాలుగో దశను డెంగీ హెమరేజ్ షాక్ సిండ్రోమ్ అంటారు. మొదటి మూడు దశలలో ఎలాంటి భయాందోనలు చెందాల్సిన పనిలేదు. – డాక్టర్ కోగంటి కల్యాణ్ చక్రవర్తి, జ్వరాల స్పెషలిస్ట్, గుంటూరు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది
బొల్లాపల్లి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. మండలంలోని వెల్లటూరులో ఇటీవల కూల్చివేసిన నివాస గృహాలను ఆదివారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. బొల్లా మాట్లాడుతూ తెలుగుదేశం దుర్మార్గపాలన చేస్తోందని చెప్పారు. ప్రజలను రక్షించాల్సిన పాలకులు కక్ష సాధింపు చర్యలు చేపట్టారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఇదే స్థలంలో 50 ఏళ్ల నుంచి నివాసముంటున్నారని, రోడ్డుకి ఎలాంటి అడ్డంకులు లేకపోయినా వీరందరిని స్థానికంగా టీడీపీ నాయకుల ప్రోద్బలంతో కోర్టు ఉత్తర్వులు పేరుతో కూల్చివేయడం దారుణమని చెప్పారు. బాధితులు గంగనబోయిన నాగరాజు, మునేయ్యలకు చెందిన ఎద్దులు దొంగతనం చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. కూల్చివేత గురైన బాధితుల్లో నిరుపేదలు, చిరు వ్యాపారులు, సన్న, చిన్న కారు రైతులు, ఎస్సీ, బీసీలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఎంపీటీసీ, సర్పంచి, వలంటీర్‌గా పనిచేశారని, ఇక్కడ నివాసముంటున్నారని కక్ష పూరితంగా కూల్చివేసినట్లు చెప్పారు. కూల్చివేత సమయంలో ఇల్లు ఖాళీ చేసే సమయం ఇవ్వలేదన్నారు. బాధితుల గోడు పట్టించుకోకుండా డబ్బులు బంగారం ఇష్టం వచ్చినట్లు లూటీ చేశారని ఆరోపించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రైవేట్ కేసు వేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం అందించాలని, స్థానిక ఎమ్మెల్యే వీరందరికీ అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు -
చదరంగంలో చిచ్చరపిడుగు
ఏడేళ్లకే జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్న బాలుడు మాచర్ల రూరల్: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా ఈ చిన్నోడు చదరంగంలో ప్రతిభ చాటుతున్నాడు. ఎత్తు వేశాడంటే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. మాచర్ల పట్టణంలో ఉంటున్న చదరంగం కోచ్ కటారపు కిరణ్, మధుమతి దంపతుల కుమారుడు జాషువా మ్యాగ్నస్ చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్నాడు. చిన్ననాటి నుంచే.. తండ్రి నేర్పిన ఆటపై శ్రద్ధ పెట్టి నైపుణ్యాలను పెంచుకుంటూ జాషువా మ్యాగ్నస్ ప్రతిభ చాటుతున్నాడు. చిన్ననాటి నుంచే చక్కని సాధనతో ఆటపై పట్టు సాధించాడు. 2022లో తొలిసారిగా నాలుగేళ్ల వయసులోనే గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ –7 పోటీల్లో సత్తా చాటాడు. 2024లో ఆంధ్రా చెస్ శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 3వ స్థానం సాధించాడు. నంద్యాలలో జరిగిన టోర్నమెంట్లో, గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలలో మొదటి స్థానం కై వసం చేసుకున్నాడు. అండర్ –7 రాష్ట్ర స్థాయి పోటీల్లో 2వ స్థానం సాధించి ఏపీ నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 2024 మైసూర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తొలి స్థానం పొందాడు. ఏడేళ్ల వయసులోనే వరుసగా జాతీయ స్థాయి పోటీలకు మూడుసార్లు ఎంపికై చరిత్ర సృష్టించాడు. బాలుడు చదువు, చదరంగాన్ని సమన్వయం చేసుకునేలా కుటుంబం సహకారం అందిస్తోంది. ఎక్కడ పోటీలు జరిగినా కుటుంబం మొత్తం వెళ్లి ప్రోత్సహిస్తోంది. జాషువా మ్యాగ్నస్ సోదరుడు శాన్లీ కూడా చెస్ ఆటగాడే. ఇరువురు ఇంట్లో సాధన చేయటం పోటీలలో ఎంతగానో ఉపయోగపడుతోంది. అనారోగ్యం పాలైనా టోర్నమెంట్ ఆడిన రోజులు కూడా ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. ప్రముఖ చదరంగ క్రీడాకారుడు మ్యాగ్నస్ కార్లసన్‌పై అభిమానంతో జాషువా మ్యాగ్నస్ అని పేరు పెట్టామన్నారు. ఆ పేరుకు ఏ మాత్రం తీసిపోకుండా చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడీ చిన్నారి. గతేడాది పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిలు జాషువా మ్యాగ్నస్ను ప్రత్యేకంగా అభినందించారు. జనవరిలో జరిగిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ పోటీలలోనూ విజయం సాధించాడు. ఎప్పటికైనా మ్యాగ్నస్ కార్లసన్‌తో తలపడాలని ఈ చిన్నారి కోరిక. గ్రాండ్ మాస్టర్ కావటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. కుటుంబ ప్రోత్సాహంతో... -
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం
తాడేపల్లి రూరల్ : మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ ప్లాజాలో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కూడారి తిరుపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వినియోగదారులు పడుతున్న సమస్యలకు పరిష్కారం, హక్కులపై ఫోరం అవగాహన కల్పిస్తోందని తెలిపారు. వినియోగదారులు తమకు జరిగిన నష్టంపై మంగళగిరిలో నూతనంగా ప్రారంభించిన జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు బొమ్ము జస్వంత్‌రెడ్డి, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు టి.రవికుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రియారెడ్డి, యూత్ జిల్లా ఇన్చార్జి షేక్ రిజ్వాన్, యూత్ వింగ్ ప్రతినిధి రాజ్‌కుమార్ పాల్గొన్నారు. యోగాలో లిమిట్లెస్ సెంటర్ విద్యార్థులకు పతకాలు గుంటూరు వెస్ట్ (క్రీడలు): యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్జీఓ కాలనీలోని సుమేధ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగసన పోటీల్లో తమ విద్యార్థులు పతకాలు సాధించారని యోగా టీచర్ వంగా వెంకటేష్ తెలిపారు. 10–14 ఏళ్ల వయస్సు విభాగంలో గోహితకు కాంస్యం, 18–28 ఏళ్ల విభాగంలో పి.భార్గవికి స్వర్ణం, కాంస్యం, 28–35 ఏళ్ల విభాగంలో వి.వెంకటేష్‌కు రెండు స్వర్ణాలు, 35–45 ఏళ్ల విభాగంలో రేణుక రెండు బంగారు పతకాలు సాధించారన్నారు. యోగాసనాలతోపాటు ఆహార అలవాట్లు మార్పు చేసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతం అవుతుందని తెలిపారు. విజేతలకు, పోటీల్లో పాల్గొన్న వారికి లిమిటెస్ ఫిట్నెస్ సెంటర్ అధినేత నీలిమ అభినందనలు తెలిపారు. వైభవంగా గిరిజా కల్యాణం నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారంలోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం గిరిజా కల్యాణం వైభవంగా నిర్వహించారు. వామనాశ్రమ స్వామిజీ మాట్లాడుతూ గిరిజా కల్యాణం నిర్వహించడం వల్ల వివాహ దోషాలు తొలగిపోతాయని అన్నారు. త్వరగా పెళ్లిళ్లు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో త్వరగా పెళ్లిళ్లు కావాలని ఆశీర్వదించారు. గిరిజా కల్యాణాన్ని వేద పండితులు (శ్రీకాళహస్తి) శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దాదాపు 200 మంది యువతీ, యువకులకు తీర్థప్రసాదాలు అందించారు. తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్ఎస్ఆర్ ఆంజనేయులు, గుడివాడ రవీంద్ర, కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడమానూరు సురేష్, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు. 582 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 582.90 అడుగులకు చేరింది. ఇది 291.3795 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,151, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ఉచితంగా నిర్ధారణ పరీక్షలు
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు కిట్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నాం. కేసులు నిర్ధారణ జరిగితే సమాచారం ఇవ్వాలని, ప్లేట్లెట్స్ పేరుతో భయపెట్టవద్దని ప్రైవేటు వైద్యులందరికీ ఆదేశాలు జారీ చేశాం. ప్రతిరోజూ వైద్య సిబ్బందిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి వివరాలు సేకరిస్తున్నాం. దోమల నివారణ చర్యల్లో భాగంగా గంబూషియా చేప పిల్లలను నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో వదిలాం. కేసులు నమోదైన ప్రాంతంలో యాంటీ లార్వా పద్ధతులు, ఫాగింగ్ చేస్తున్నాం. దోమల పెరుగుదలకు అపరిశుభ్రమైన వాతావరణమే ముఖ్య కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు, వర్షపునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమల నుంచి రక్షణకు ఉదయం, సాయంత్రం సమయాల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. నిద్రించే సమయంలో తప్పనిసరిగా దోమ తెరలు వాడటం చాలా మంచిది. –డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి, గుంటూరు. -
పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలి
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన నారా లోకేష్ టీడీపీ కూటమి సర్కారు గతంలో అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు ప్రశ్నించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు బాలాజీనగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లు వద్దంటూ ఆదివారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బాబురావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన టీడీపీ నేడు అధికారంలోకి వచ్చి స్మార్ట్ మీటర్లు వేగంగా ఏర్పాటు చేస్తూ ప్రజలపై భారాలు మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన జరిగే పోరాటంలోనూ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు లక్కా అరుణ, బి.ముత్యాలరావు, ఎం.ఎ. చిష్టీ, పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసీహెచ్ బాబూరావు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పాతగుంటూరులో ప్రచారం -
ఆట్యా– పాట్యా జిల్లా జట్టు ఎంపిక
నకరికల్లు: పల్నాడు జిల్లా ఆట్యా– పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని పలు ఉన్నతపాఠశాలల నుంచి క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. న్యాయనిర్ణేతలు 15 మంది బాలికల, 15 మంది బాలురను పల్నాడు జిల్లా జట్టులో ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాణించి రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటాలని ఆట్యా–పాట్యా అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు చింతా సామ్రాజ్యం అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఆగస్ట్ 9, 10వ తేదీలలో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీఎంసీ చైర్మన్ కాసా మల్లికార్జునరావు, ఫిజికల్ డైరెక్టర్లు చింతా పుల్లయ్య, జి.ఝాన్సీరాణి, తిరుమలబాయి, పి.తిరుపతిరావు, పెద్ద వెంకటేశ్వర్లు, అశోక్, పి.ఆంజనేయులు, షేక్.నాగూర్వలి, దరియావలి, వెంకటరమణ పాల్గొన్నారు. బాలికల జట్టులో.. బి.సౌజన్య(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ నజ్మ(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ సుహానా మస్తాని(శ్రీ చైతన్య కళాశాల), కె.వైష్ణవి(జెడ్పీ హెచ్ఎస్, ఎస్.బి.పురం), డి.రంగ మహాలక్ష్మి(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), సీహెచ్ విజయ(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), ఎం.స్నేహ(శ్రీచైతన్య), ఎం.దివ్యసన్నిధి(జెడ్పీహెచ్ఎస్, కావూరు), షేక్.జి.సాధిక(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), టి.లిఖిత(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), బి.మేఘన(ఏపీ మోడల్‌స్కూల్, దేచవరం), కె.బుజ్జి(ఏపీ మోడల్కాలేజ్, దేచవరం), బి.ప్రమీల(జెడ్పీహెచ్ఎస్, కావూరు), పి.దీక్షిత(సింధూ స్కూల్), బి.స్వాతి ప్రియ(సింధూ స్కూల్) ఎంపికయ్యారు. బాలుర జట్టులో.. షేక్ ఇస్మాయిల్(ఏపీ మోడల్ స్కూల్, దేచవరం), పి.వరప్రసాద్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), ఎం.వి.సాయిప్రదీప్(ఆక్స్ఫర్డ్ విట్, నరసరావుపేట), కె.శ్రీనివాస్(వాగ్దేవి జూనియర్ కళాశాల, నరసరావుపేట), టి.మణిదీప్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), షేక్ జాన్‌సైదా(ఆక్స్ఫర్డ్ విట్, నరసరావుపేట), ఆర్.లక్ష్మీనారాయణ(తిరుమల ఆక్స్ఫర్డ్), జి.లక్ష్మీప్రశాంత్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), ఎస్.సాయితేజ(ఆక్స్ఫర్డ్ విట్), బి.మణికంఠ(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), షేక్ నబిరసూల్(జడ్పీహెచ్ఎస్,నకరికల్లు), డి.కోటేశ్వరరావు(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), వై.అఖిల్(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), డి.శ్రీవెంకట అతులిత్(సింధూ స్కూల్), డి.ప్రసూన్(జెడ్పీహెచ్ఎస్, కావూరు) ఎంపికయ్యారు. ప్రతిజట్టులోను అదనంగా స్టాండ్బైలో ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. -
నిండుకుండలా సాగర్
సాక్షి, నరసరావుపేట: కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరదప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 312.045 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 582.90 అడుగులు వద్ద ఉండగా, నీటి నిల్వ 291.3795 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 66,417 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా మరో 26,698 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. కాలువల ద్వారా 35,749 క్యూసెక్కులు కిందకు వదలుతున్నారు. మరో 20 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుతుంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 24.08 టీఎంసీలకు చేరింది. ఎగువనుంచి పులిచింతలకు 26,430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రేపు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కృష్ణానదిలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటం, ప్రాజెక్టు నీటి మట్టం ఇప్పటికే 583 అడుగులకు చేరింది. దీంతో మంగళవారం నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పోటెత్తిన తుంగభద్రనీట మునిగిన పంట పొలాలుకౌతాళం/హొసపేటె : కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఆదివారం పోటెత్తింది. నదితీరంలో అర కిలోమీటర్ మేర పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. కర్ణాటకలోని హోస్పేట్ టీబీ డ్యాం నుంచి శనివారం రాత్రి తుంగభద్ర నదికి 92వేలు క్యూసెక్కులు నీరు వదలగా అవి ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా సరిహద్దుకు చేరాయి. అప్పటికే రైతులు అప్రమత్తమై తమ వ్యవసాయ విద్యుత్ మోటార్లు, పైపు లైన్లను సురక్షిత ప్రాంతానికి తరలించుకున్నారు. నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో తీర గ్రామాల రైతులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కౌతాళం మండలం కుంబళనూరు వద్ద వరి పైర్లు వేసి పక్షం రోజులు అవుతుండడంతో తమ పంటలపై ఎక్కడ ఇసుక మేట వేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నిలిచిపోయిన రాకపోకలు తుంగభద్ర నదిలో ప్రవాహం పెరగడంతో కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెళ్లేకుడ్లూరు–మేళిగనూరు మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీనితో పాటు కుంబళనూరు వద్ద కూడా వంకకు నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మండ్య జిల్లాలో కావేరి నది కూడా ఉప్పొంగుతోంది. కేఆర్ఎస్ డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేశారు. -
పూజారులకూ షోకాజ్ నోటీసులు
చిలకలూరిపేట: దైవకార్యం అయినా.. మరొకటి అయినా అగ్రతాంబూలం తమకే దక్కాలన్న అహం టీడీపీ నేతల్లో పెరిగిపోయింది. ఆ అహమే పూజారుల పట్ల శాపంగా మారింది. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం శ్రీ గోపీనాథస్వామి ఆలయంలో మాజీమంత్రి విడదల రజిని కుటుంబ సభ్యులతో పూజలు చేయించారన్న కారణంగా పూజారులకు ఆలయ కార్యనిర్వహణాధికారి నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. మాజీమంత్రి విడదల రజిని కుటుంబానిది పురుషోత్తమపట్నం కాగా.. ఈ గ్రామంలో ప్రాచీన గోపీనాథస్వామి ఆలయం ఉంది. ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి విడదల రజిని సహకారంతో దీనిని పునర్నిర్మింపజేరు. తొలినుంచీ విడదల రజిని మామయ్య లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబం సభ్యులు గోపీనాథస్వామి భక్తులు కావడంతో తరచూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. విరాళాలు ఇస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగానూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు.పూజలు చేయించడమే నేరమైంది సాధారణ భక్తులతోపాటు వచ్చిన విడదల లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సైతం శుక్రవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో టీడీపీ నాయకులకు పట్టరాని కోపం వచి్చంది. ఇంత పెద్దఎత్తున ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా తమను మాత్రమే పిలవాలని ఆలయ ఈవోపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఈవోపై రాజకీయ ఒత్తిడి తెచ్చి అర్చక స్వాములకు నోటీసులు ఇప్పించారు. ఆలయంలో పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకురాకపోవడానికి కారణం తెలపాలని అర్చకులు మురికిపూడి శ్రీనివాసాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులుకు ఈవో నోటీసులు ఇచ్చారు. తమ అనుమతి లేకుండా వందలాది మంది భక్తులకు పూజలు ఏర్పాటు చేయడంపై 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఆనోటా, ఈనోట బహిర్గతం కావడంతో ఇదేమి చోద్యం అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. ‘పర్వదినం రోజుల్లో దేవుడికి పూజలు చేసినా పాపమై పోయిందా... ఇవెక్కడి రాజకీయాలు రా నాయనా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈవో కె.మంజూషను వివరణ కోరగా.. అనుమతి తీసుకోకుండా కుంకుమార్చన వంటి పూజలు నిర్వహించినందుకు ఆలయ అర్చకులతో పాటు, గుమస్తాకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. -
ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్‌లు అన్నారు. వేతన చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ డీఏలు, పీఆర్సీపై ప్రభుత్వం నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతాల విషయంలో తాత్సారం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. రోజూ రకరకాల అప్లోడ్ పనులతో టీచర్లను బోధనకు దూరం చేస్తున్నారని, ఇది పరోక్షంగా ప్రభుత్వ విద్యను కాలరాయడమే అన్నారు. టీచర్లకు రకరకాల శిక్షణ ఇచ్చి బోధనను ఆటంకపరుస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇక నుంచైనా ఆన్లైన్ పనులు ఆపి అధికారులు సహకరించాలని కోరారు. అనంతరం డీవైఈవో ఏసురత్నంకు వినతి పత్రం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందు, బి.ప్రసాదు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్ కుమార్, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం. చిన్నయ్య, మండల శాఖ నాయకులతోపాటు బదిలీ అయిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు సాక్ష్యాలు అందించాం
తాడేపల్లి రూరల్: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రజలను రెచ్చగొడుతూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడినట్లు సీఐ సాక్ష్యాలు అడగడంతో శనివారం నారాయణమూర్తి ఆ సాక్ష్యాల వీడియో ఫుటేజీని పెన్‌డ్రైవ్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా నాగ నారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ... ‘పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తలతో చంపండి... నరకండి.. అది సివిలైజేషన్’ అంటూ రెచ్చగొట్టే విధంగా మట్లాడారని చెప్పారు. సీఐకి సాక్ష్యాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, వి.రవీంద్రారెడ్డి, బి.నరేంద్ర సింగ్, ఎస్కే జావీద్ బాషా, హాసన్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి -
క్రైస్తవుల రక్షణకు పటిష్ట చట్టం తేవాలి
నరసరావుపేట: భారత రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యాంగం మేరకు క్రైస్తవ మైనార్టీల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం రూపొందించి వారిని ఆదుకోవాలని సామాజికవేత్త, జాతీయ క్రైస్తవ, దళిత నాయకుడు డాక్టర్ గోళ్ళమూడి రాజ సుందరబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక బాపనయ్యనగర్ బేతేలు చర్చిలో యూపీఎఫ్ జిల్లా కార్యవర్గం, నేషనల్ క్రిస్టియన్ బోర్డు జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. దీనిలో ముఖ్యవక్తగా గోళ్లమూడి పాల్గొని ప్రసంగిస్తూ 2023లో మణిపూర్‌లో 65వేల కుటుంబాలను మారణ హోమానికి గురిచేసిన సంఘటనపై క్రైస్తవులు దేశంవ్యాప్తంగా భయాందోళనకు గురయ్యారన్నారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో ప్రపంచ సువార్తికుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపైనా ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు, పాస్టర్లపై దాడులు పెరిగాయన్నారు. పాస్టర్లు స్వేచ్ఛగా సువార్త ప్రకటించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. సమావేశానికి సత్తెనపల్లికి చెందిన షాలోమ్ చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ సుధీర్ కుమార్ అధ్యక్షత వహించారు. యూపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్సీ రావు, మాజీ అధ్యక్షుడు జీవరత్నం, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జిల్లా అధ్యక్షుడు పి.సుబ్బారావు(జోసఫ్) మాట్లాడారు. వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు. పలు క్రైస్తవ సంఘాల డిమాండ్ -
మహానాడులో యువకుడు ఆత్మహత్య
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తన మరణానికి సైదులు అనే టీడీపీ నాయకుడు కారణమంటూ ఓ యువకుడు గోడపై రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి రాగా, కొడుకు మరణించాడన్న బాధలో ఉన్న వారిని అవమానించడంతో వారు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి మొహమ్మద్ మునీనురీసా మాట్లాడుతూ.. తన కుమారుడైన ఎం.డి. బాజీ (31) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 23వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఎందుకు చనిపోయాడో తమకు తెలియక 24వ తేదీ మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పారు. ఖననం అనంతరం ఇంటిని శుభ్రం చేస్తుండగా గోడమీద ‘తన మరణానికి ఎస్డీ సైదులు, రాకేష్ కారణం అని, చంపుతామని బెదిరించారని, వారు టీడీపీ నేతలని, తాను ఏం చేయగలవంటూ బెదిరించినట్లు’ కుమారుడు రాశాడని తెలిపారు. ఈ విషయాన్ని 25వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా ఖననం చేసి తమ దగ్గరకు వస్తే ఏం చేయలేమని పోలీసులు పేర్కొన్నట్లు చెప్పారు. తమ కుమారుడి చావుకు కారణం వాళ్లు ఎందుకు అవుతారని ప్రశ్నించారని తెలిపారు. గోడపై కుమారుడు రాసిన విషయాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి చూపించగా తాము కేసు కట్టబోమని, బయటకు వెళ్లాలని, ఎవరి దగ్గరకు వెళ్లినా న్యాయం జరగదని, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కృష్ణానది ఒడ్డున తమ కుమారుడికి అన్నయ్య వరుస అయ్యే వారిని సైదులు కొట్టాడని, అప్పుడే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, కేసు వాపస్ తీసుకుంటారా లేదా అంటూ అనేకసార్లు బెదిరించారని ఆమె తెలిపారు. 23వ తేదీన కూడా సైదులు, రాకేష్‌లు కత్తి తీసుకుని చంపేస్తామని, తమది టీడీపీ అని చెప్పినట్లు ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామని ఆమెతోపాటు బాజీ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. గుట్టుచప్పుడు కాకుండా ఖననం టీడీపీ నాయకుడి వల్లే తన కుమారుడు చనిపోయాడంటున్న తల్లి ఫిర్యాదు తీసుకోని పోలీసులు -
అలరించిన గరికపాటి ప్రవచనాలు
నరసరావుపేట: స్థానిక పాతూరులోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక తరంగణి, శ్రీ నాగసరపు సుబ్బరాయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వేదాంత భేరీ ప్రవచనానికి మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు హాజరై ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ట్రస్టు చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తాలు డాక్టర్ గరికపాటిని ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాంప్ నోడల్ అధికారిగా కృష్ణారావు నరసరావుపేట: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనిచేసేందుకు జిల్లా పరిశ్రమల అధికారి జి.కృష్ణారావును నోడల్ అధికారిగా నియమించారు. ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్ల ర్యాంపు ప్రోగ్రాం ప్రత్యేక పర్యవేక్షణ చేసేందుకు కలెక్టర్ శనివారం ఈ ఆదేశాలు జారీచేశారు. ప్రతి నియోజకవర్గస్థాయిలో ఎంఎస్ఎంఈ–ర్యాంపు కార్యక్రమం నిర్వహించేలా షెడ్యూల్‌ను తయారుచేసి ప్రతి ఒక్క మండల ప్రత్యేక అధికారికి ప్రణాళిక ప్రకారం ఇవ్వాలని సూచించారు. ఎంఎస్ఎంఈ – ర్యాంపు కింద రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్, జేఈడీ వర్క్ షాప్, రివర్స్ బయర్ సెల్లర్ మీటింగ్, వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ టెక్నిక్స్, ట్రేడ్ రేసివబుల్స్పై కార్యక్రమం నిర్వహించాలని నోడల్ అధికారి, సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ, మెప్మా పీడీ, ఎల్డీఎం, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పాల్గొన్నారు. -
ఇంటర్ సంస్కరణలపై అవగాహన అవసరం
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలను అమలు చేస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. ఇంటర్మీడియెట్ విద్యా సంస్కరణలపై శనివారం హార్డ్ కళాశాలలో అవగాహన సమావేశం నిర్వహించారు. పల్నాడుజిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో నీలావతిదేవి మాట్లాడుతూ, విద్యార్థులను జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సిలబస్ రూపకల్పన జరిగిందని తెలిపారు. అలాగే అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా సిలబస్ ఉంటుందని తెలిపారు. జాతీయస్థాయిలో మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల సూచనల మేరకు సంస్కరణల అమలుకు కార్యాచరణ తీసుకవస్తున్నట్టు వివరించారు. దుర్గి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు ఇంటర్ బోర్డు ప్రవేశ పెట్టిన నూతన సిలబస్, నూతన సబ్జెక్స్ కాంబినేషన్‌పై అవగాహన కల్పించారు. సమావేశంలో దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టి.జె.చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి -
చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
కర్లపాలెం: మండల పరిధిలోని దమ్మనవారి పాలెంలో బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 141 గ్రాముల బంగారం, అర కేజీ వెండి, రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర చాకచక్యంగా దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేశారని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శనివారం కర్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. దమ్మనవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు పెద వెంకటరెడ్డి కుటుంబం ఈ నెల 17వ తేదీన ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లినట్లు తెలిపారు. 21వ తేదీన వారి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉన్నట్లు ఆయన తమ్ముడు గమనించి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. 22వ తేదీన వెంకటరెడ్డి వచ్చి చూడగా బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ అయినట్లు గుర్తించారన్నారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలుసుకున్నారని చెప్పారు. నిందితులు బాపట్ల మార్కెట్ యార్డ్ సమీపంలో సంచరిస్తుండగా అరెస్ట్ చేశారని తెలిపారు. రాజమహేంద్రవరం పరిధి కొల్లమూరు గ్రామానికి చెందిన జనదివ్యశేఖర్, పురంపుల్లతి వీధికి చెందిన లంక హర్షవర్ధన్, బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంకు చెందిన మరుప్రోలు నాగేంద్రరెడ్డిలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరు పాత నేరస్తులని, జైలులో పరిచయాల మేరకు బయటకు వచ్చిన తరువాత చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. చోరీ సొత్తు పూర్తిగా రికవరీ చేసినట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారని వివరించారు. వారికి వ్యక్తిగత రివార్డులు అందిస్తామని తెలిపారు. 141 గ్రాముల బంగారు, అర కేజీ వెండి నగలు స్వాధీనం -
రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
గుంటూరు రూరల్: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు శనివారం జూలై నెలకు సంబంధించిన శిక్షణ, సందర్శన వర్క్‌షాప్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి లాంఫాం ఏడీఆర్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఏడీఏలు వ్యవసాయ స్థితిగతులు వివరించారు. శాస్త్రవేత్తలు పత్తి, కంది పంటల కట్ ఆఫ్ డేట్స్, వివిధ ప్రాతాలకు అనువైన వరి రకాలు, నేరుగా విత్తన వరిలో కలుపు యాజమాన్యం, జీవన ఎరువుల వినియోగం, ఎండు తెగులును తట్టుకునే కంది రకాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు వంటివి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో పంట వేయకుండా ఖాళీగా ఉంచి అనంతరం శనగ వేయదలచిన రైతులు స్వల్పకాలిక అపరాలు సాగు చేపట్టవచ్చని తెలిపారు. డీఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏటీఎంఏ సహకారంతో వ్యవసాయశాఖ, యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సీజన్ ప్రారంభమైన సందర్భంగా విస్తరణ కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు చేపట్టాలన్నారు. నానో ఎరువులు వినియోగం, డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారి, జీవన ఎరువుల పనితీరు, మెషీన్ హార్వెస్ట్‌ను అనుకూలమైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులు రైతులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా డీఏవో శివకుమారి, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ డివిజన్ల ఏడీఏలు, కేవీకే, డాట్, ఉద్యాన, పరిశోధన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
పత్తి పంటకు బీమా గడువు పొడిగింపు
నరసరావుపేట రూరల్: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో పత్తి పంటకు బీమా గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు శనివారం తెలిపారు. భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ అగ్రికల్చర్ ఇన్యూరెన్స్ కంపెనీ ద్వారా జిల్లాలో పంటల బీమా అమలులో ఉందని తెలిపారు. రైతులు పత్తి పంటపై అమలవుతున్న బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల ద్వారా నమోదు చేయబడతారని తెలిపారు. రుణాలు తీసుకోని రైతులు మీ సేవా కేంద్రాలు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు , క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్‌ఏలను సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు. వాతావరణ సంబంధిత ప్రమాదాల సమయంలో పంటలకు కలిగే నష్టాన్ని బీమా ద్వారా పొందే అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక పీజీఆర్ఎస్లో 38 అర్జీలు స్వీకరణ నరసరావుపేట: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల కోసం శనివారం కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 38 అర్జీలు స్వీకరించారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేశారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రూ.2.75 కోట్ల విలువైన 20 పనులకు పౌడా ఆమోదం నరసరావుపేట: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.2.75 కోట్లతో చేసే 20 పనులకు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ కమిటీ (పౌడా) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శనివారం కలెక్టరేట్లో పౌడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన అభివృద్ధి, ప్రణాళికా కార్యకలాపాలపై అథారిటీ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు అజెండాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలియచేశారు. దీనిలో అథారిటీ సభ్యులు డీటీసీపీ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సునీత, రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ టి.రవీంద్రబాబు, ఏపీ సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.రాంబాబు, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, కాలుష్య నియంత్రణ మండలి విభాగ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పారిశ్రామిక కేంద్ర కార్యదర్శి ఎం.నవీన్‌కుమార్ పాల్గొన్నారు. 581 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.30 అడుగులకు చే రింది. ఇది 286.7635 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,20,339 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
కొరవడిన సంతోషం
సంక్షేమంలోసంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సమస్యల స్వాగతం జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు కొరవడుతున్నాయి. ముఖ్యంగా హాస్టళ్లలోని విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదు. నాసిరకమైన కూరగాయలతో వండి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని చీపురు, ఫినాయిల్ లాంటివి కొనుగోలు చేసేందుకు కూడా నిధులు లేకపోవడంతో నిర్వహణ ఎలా సాధ్యమని హాస్టల్ వార్డెన్లు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ శనివారం జిల్లాలోని పలు హాస్టళ్లను విజిట్ చేయగా సమస్యలు వెలుగుచూశాయి.సత్తెనపల్లి: జిల్లాలో ప్రీ మెట్రిక్ బీసీ 20, ఎస్సీ 18, ఎస్టీ 6, పోస్ట్ మెట్రిక్ బీసీ 14, ఎస్టీ 11, ఎస్టీ మూడు హాస్టళ్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 7,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలు ఉండే సంక్షేమ వసతి గృహాలు సమస్యల ఊబిలో చిక్కుకున్నాయి. అసౌకర్యాల మధ్య రేపటి పౌరులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణను కూటమి ప్రభుత్వం విస్మరించింది. హాస్టళ్లు పునఃప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. కిటికీలకు దోమతెరలు లేవు. వర్షాకాలంలో దోమలు విజృంభిస్తుండడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఇంతవరకు బెడ్ షీట్లు ఇవ్వలేదు. అద్దె భవనాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అల్లాడి పోతున్నారు. సక్రమంగా అమలు కాని మెనూ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాసిరకమైన భోజనం పెడుతున్నా వారిని ప్రశ్నించేవారు లేరు. గత ప్రభుత్వం వసతి గృహాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మెనూ ప్రకారం భోజనం అందించేది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వసతి గృహాల్లోని విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కొరవడింది. దీనికి తోడు ఇటీవల కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో నిర్వాహకులు నాసిరకమైన కూరగాయలు తెచ్చి వాటితోనే విద్యార్థులకు భోజనం చేసి పెడుతున్నారు. ఆ ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి తోడు వంటగది, బాత్రూములు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం నిధులు కాజేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. పాములకు నిలయంగా బీసీ బాలుర హాస్టల్ నరసరావుపేట మండలం కోటప్పకొండ బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోటప్పకొండలోని జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలోనే ఉన్న ఈ హాస్టల్‌కు ప్రకాశం జిల్లాతోపాటు వినుకొండ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి చేరుతుంటారు. కొండ పక్కనే ఈ వసతి గృహం ఉండటంతో పాములు హాస్టల్ ప్రాంగణంలోకి తరచూ వస్తున్నాయి. మరుగుదొడ్లు ఆరు బయట ఉండటంతో రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే విద్యార్థులు భయపడాల్సి వస్తుంది. దీంతోపాటు విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు అందుబాటులో లేవు. విద్యార్థులు స్నానాలు చేసేందుకు సమీపంలోని త్రికోటేశ్వర జెడ్పీ హైస్కూల్‌పై ఽఆధారపడాల్సి వస్తుంది. హాస్టల్ ఆధునీకరించి మంచాలు అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ గదులకు తలుపులు ఏర్పాటుచేయలేదు. హాస్టల్లో వార్డెన్ అందుబాటులో ఉండకపోవడం, సీనియర్ విద్యార్థుల వేధింపులు, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాది 80 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్లో ఈ ఏడాది 30 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. గత నెల 31వ తేదీ హాస్టల్ వార్డెనన్ ఉద్యోగ విరమణ చేయగా, నూతనంగా మరో వార్డెన్న్ను ఉన్నతాధికారులు నియమించారు. అందని కాస్మోటిక్ ఛార్జీలు ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే 3–6 తరగతుల బాలురకు నెలకు ఒక్కొక్కరికి రూ.175, బాలికలకు రూ.130, 7నుంచి 10 వరకు చదివే బాలురకు రూ.200, బాలికలకు రూ.200 కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలి. అలాగే పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.250 కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం ప్రతి నెలా చెల్లించాలి. 2024 సెప్టెంబర్ నుంచి ప్రీ మెట్రిక్ వసతి గృహాల విద్యార్థులకు, 2024 మార్చి నుంచి పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు రావాల్సి ఉంది. ఇవి ప్రతి నెలా అందకపోవడంతో విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతతోపాటు దుస్తులు శుభ్రపరుచుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు విద్యార్థులు మురికి దుస్తులతోనే పాఠశాలలకు, కళాశాలలకు వెళుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికై నా సంక్షేమ వసతి గృహాల పట్ల పాలకులు, జిల్లా అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అద్దె భవనంలోనే ‘సంక్షేమం’ వినుకొండ పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరింది. దీంతో రెండేళ్లుగా అద్దె భవనంలోనే వసతిగృహం నిర్వహిస్తున్నారు. స్నానపు గదులు మాత్రం లేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. 80 మందికి మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉండటంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ నూతన భవనం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో విద్యార్థుల పాలిట శాపంలా మారింది. అమరావతిలో అరకొర వసతులు అమరావతి మండలం ధరణికోటలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో 50 శాతం విద్యార్థులు కూడా లేని పరిస్థితి ఉంది. ఎస్సీ హాస్టల్లో మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 25 మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ బాలుర హాస్టల్లో 23 మంది విద్యార్థులు ఉన్నారు. స్నానాల గదులు ఉన్నప్పటికి వాటికి తలుపులు లేవు. హాస్టల్‌కు ఉత్తరాన క్రోసూరు రోడ్డువైపు ప్రహరీ లేకపోవటంతో అకుపచ్చపట్ట కట్టారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే చిత్తడే.. వందల మందికి ఒక్కరే వంట మనిషి జిల్లాలో 14 బీసీ, 11 ఎస్సీ, 3 ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క హాస్టల్లో 100 మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. సత్తెనపల్లిలోని వెంకటపతి కాలనీలోగల ఎస్సీ పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతి గృహంలో 340 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇంత మందికి ఒక్కరే వంట మనిషి ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అనేది కనీసం జిల్లా స్థాయి అధికారులు ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇది సాధ్యం కాక ప్రతి హాస్టల్లో అదనంగా ఇరువురిని వార్డెన్లు నియమించకొని చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఇలా ప్రతి వసతి గృహంలో ఏదో ఒక సమస్య విద్యార్థులను వెంటాడుతుంది. ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పలుచని సాంబారు .. రుచి లేని భోజనం విద్యార్థులకు అందని బెడ్షీట్లు, పేట్లు, గ్లాసులు నెలలతరబడి అందని కాస్మోటిక్ చార్జీలు అవస్థలతో తప్పని సహవాసం జిల్లాలో 44 ప్రీ మెట్రిక్, 28 పోస్ట్ మెట్రిక్ వసతి గృహలు నరసరావుపేట పెద్దచెరువు 9వ లైనులో ఓ ప్రైవేటు బిల్డింగ్‌లో కొనసాగుతున్న ఎస్సీ బాలుర హాస్టల్, ప్రకాష్‌నగర్‌లోని బీసీ బాలుర హాస్టల్లో 4వ వాల్గవ తరగతి నుంచి బీటెక్ చదివే సుమారు 280 మంది విద్యార్థులు ఉంటున్నారు. వర్షం కురిస్తే ఎస్సీ హాస్టల్ మొత్తం చిత్తడి చిత్తడిగా తయారవుతుంది. కొన్ని గదుల్లోకి నీరు వస్తుంది. ఒకటీ, రెండు గదుల్లో సగం నీరు ఉండగా మిగతా సగంలో ఓ విద్యార్థి పడుకొని ఉండటం కన్పించింది. డ్రమ్ముల్లో పట్టిన నీటినే విద్యార్థులు తాగునీరుగా ఉపయోగిస్తున్నారు. హాస్టల్ మొదటి అంతస్తు కారిడార్ మధ్యలో నీరు పోయేందుకు కాలువ ఏర్పాటుచేశారు. విద్యార్థులు పడుకునేందుకు ఎక్కడా బెడ్లు లేవు. గదుల్లో నేలపై చాపలు, దుప్పట్లు పర్చుకొని పడుకుంటున్నారు. బీసీ బాలుర హాస్టల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు సామూహికంగా స్నానాలు చేస్తున్నారు. బియ్యంలో ముక్కపురుగులు ఉన్నాయి. -
కూటమి అరాచకాన్ని తిప్పికొడదాం
పోలీసులను శిఖండిగా మార్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వ పెద్దలు పోలీసులను శిఖండిగా వినియోగిస్తూ వారిచేత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను కొట్టిస్తున్నారు. పోలీసులు చేస్తున్న అరాచకాలపై ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేయాల్సిన అవసరం ఉంది. –కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గురజాల పోలీసులపై ప్రైవేటు కంప్లయింట్ పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఏ లీగల్‌సెల్ సభ్యుడు ఊరుకోవద్దు. అక్రమాలకు, అరాచకాలకు పాల్పడిన పోలీసులపై ఖచ్చితంగా ప్రైవేట్ ఫిర్యాదు చేస్తాం. –రోళ్ల మాధవి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షురాలు నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ అరాచకాన్ని తిప్పికొట్టడంలో లీగల్ సెల్ న్యాయవాదులు సమష్టిగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షులు మల్లసాని మనోహరరెడ్డి పేర్కొన్నారు. రామిరెడ్డిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో జిల్లా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జిల్లా అధ్యక్షురాలు, న్యాయవాది రోళ్ల మాధవి అధ్యక్షతన శనివారం నిర్వహించిన పార్టీ లీగల్‌సెల్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అరాచకం పరాకాష్టకు చేరిందన్నారు. ప్రభుత్వమే రాక్షస పాలన సాగిస్తుందని, బాధితులు ఎక్కువగా పల్నాడు జిల్లాలోనే ఉన్నారన్నారు. పిన్నెల్లి లాంటి గ్రామాల్లో వందలమంది ఊరువిడిచి పెట్టి వెళ్లాల్సి వచ్చిందన్నారు. జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌పై అనేక అక్రమ కేసులు పెట్టారన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లీగల్ సెల్ ప్రతినిధులు అద్భుతంగా పనిచేశారని, ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను ఛేదించి నాయకులు, కార్యకర్తలను బయటికి తీసుకొస్తున్నారన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గుర్తుపెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో తొలుత దివంగత వైఎస్సార్ ప్రతిమకు పూలమాల వేసి నివాళులర్పించారు. సీనియర్ న్యాయవాదులు కట్టా నారపరెడ్డి, పక్కాల సూరిబాబు, చల్లా రామిరెడ్డి మాట్లాడారు. మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ సుదర్శనరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు భగవాన్, జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన లీగల్‌సెల్ న్యాయవాదులు నరేంద్ర, వై.సీతారామిరెడ్డి, చిట్టిబాబు, సీహెచ్.నాగిరెడ్డి, ఎం.ఎన్.ప్రసాదు, హరిప్రసాదు, పెద్దసంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.మాకు రక్షణ లీగల్‌సెల్ న్యాయవాదులే తమకు రక్షణ కల్పిస్తుందని లీగల్‌సెల్ న్యాయవాదులే. పార్టీ కార్యకర్త రషీద్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నిందితులైన కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు. లీగల్ సెల్ ప్రతినిధులు కోర్టులో న్యాయపోరాటం చేసి ఆ పేర్లు తిరిగి ఎఫ్ఐఆర్లో చేర్పించారు. లీగల్‌సెల్ కమిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ కోసం పనిచేస్తున్న వారందరినీ గుర్తుపెట్టుకుని పదవులు ఇస్తాం. –బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే, వినుకొండ కార్యకర్తల సంరక్షణే లక్ష్యం కావాలి కార్యకర్తలను పోలీసులు కొట్టకుండా వారి చెర నుంచి బయటకు తీసుకురావటమే లక్ష్యంగా లీగల్ సెల్ సభ్యులు పనిచేయాలి. నాయకులు, కార్యకర్తలపై ఏవిధంగా కేసులు పెట్టాలో, ఏఏ సెక్షన్లు బనాయించాలో, రిమాండ్ రిపోర్టు ఎలా తయారుచేయాలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. పల్నాడు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా రాజకీయపరమైన కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లీగల్ సెల్ అవసరం ఎంతో ఉంది. ఎక్కడైనా కేసులు బనాయించిన సత్వరమే స్పందించి న్యాయ సహాయం అందిస్తున్నారు. –డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్ అధ్యక్షులు మనోహరరెడ్డి నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ న్యాయవాదుల సదస్సు లీగల్‌సెల్ పాత్ర కీలకం రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనలో లీగల్‌సెల్ న్యాయవాదుల ప్రాముఖ్యత తెలియచేస్తుంది. తనతోపాటు అనేకమంది నాయకులపై ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంది. తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానంటే అందుకు లీగల్‌సెల్ సహకారమే కారణం. –విడదల రజిని, మాజీ మంత్రిప్రతి ఇంట్లో ఒక న్యాయవాది అవసరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెంటపాళ్ల పర్యటన న్యాయవాదుల ప్రాధాన్యతను తెలియచేసింది. ప్రతి ఇంట్లో ఒక న్యాయవాది ఉండాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం రేకెత్తిస్తుంది. –డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, సమన్వయకర్త, సత్తెనపల్లి -
కంది వైపు ఖరీఫ్ రైతు
సాక్షి, నరసరావుపేట : ప్రధాన పంటల సాగుకు ఖర్చు విపరీతంగా పెరగడం, రాబడి అంతంత మాత్రంగా ఉండటంతో జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కంది సాగు ఏడాదికేడాదికి పెరుగుతోంది. పత్తి సాగులో సవాలక్ష సవాళ్లు ఎదురవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు కల్తీ మొదలు, సాగు ఖర్చు అధికంగా ఉంటోంది. మరోవైపు గులాబీ రంగు పురుగు బెడద అధికంగా ఉంటోంది. చీడ, పీడలతో పత్తి దిగుబడి తగ్గిపోతోంది. మరోవైపు ధరలు తగ్గిపోతున్నాయి. ఆ ధరలతో పత్తి సాగు గిట్టుబాటు కావడం లేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెడుతున్నారు. అలాగే మిర్చి పంటలోను రైతులు గతేడాది కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇప్పటికీ కోల్డ్ స్టోరేజ్‌లలో సరుకు ఉంచారు. దీంతో కంది సాగుతోనైనా తమ వెతలు తీరుతాయని భావిస్తున్నారు. 2023 ఖరీఫ్‌లో 14,626 హెక్టార్లలో కంది సాగు చేశారు. 2024 ఖరీఫ్ కంది సాగు లక్ష్యం 19,259 హెక్టార్లు కాగా ఏకంగా 26,509 హెక్టార్లలో సాగైంది. ఈ ఏడాది కంది సాగు 30 వేల హెక్టార్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పెట్టుబడి తక్కువ...ధర ఎక్కువ కంది సాగుకు ఎకరాకు రూ.10–15 వేల మధ్య ఖర్చవుతుంది. ఇది మిగిలిన పంటలతో పోల్చితే చాలా తక్కువ. బెట్ట పరిస్థితులకు నిలబడే స్వభావం ఉంటుంది. డిసెంబర్, జనవరి నెలల్లో పంటకోతకు వస్తుంది. కాయదశలో తెగుళ్లు ఆశించకుండా పంటను కాపాడుకుంటే రైతులకు ఆదాయం వస్తుంది. హెక్టారుకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కంది పంటకు గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం 2022లో క్వింటాలు రూ.6,300, 2023లో రూ.7,వేలు ప్రకటించగా గతేడాది రూ.7,550 చొప్పున ప్రకటించారు. ఈ ఏడాది మరో రూ.450 బోనస్‌గా ప్రకటించి క్వింటాలు ధర రూ.8 వేలు చేశారు. ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో... పల్నాడు జిల్లాలో వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, దుర్గి, నరసరావుపేట ప్రాంతాలలో దాల్ మిల్లులు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో వ్యాపారులు నేరుగా కొనుగోలు చేయడం రైతులకు కలసి వచ్చేది. అయితే గతేడాది కూటమి ప్రభుత్వం కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో విఫలమైంది. రైతుల నుంచి వ్యాపారులు నేరుగా కంది కొనుగోలు చేయకపోవడంతో దళారుల ఇష్టారాజ్యమైంది. కనీస మద్దతు ధర రూ.7,550 ఉన్నప్పటికి రైతుకు రూ.6 వేలు కూడా దక్కని దుస్థితి. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా కొంటే మద్దతు ధర లభించి ఆదాయం దక్కుతుంది. మరోవైపు గత ప్రభుత్వంలో కంది పంటకు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేది. కూటమి ప్రభుత్వంలో రైతులే చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు కంది రైతులకు ఆర్బీకేల ద్వారా ఎల్‌ఆర్‌జీ–22 వంటి దీర్ఘకాలిక రకాలైన కంది విత్తనాలను రాయితీతో అందజేస్తారు. అయితే రైతులు తక్కువ వ్యవధిలో పంట పూర్తి కావడంతోపాటు చీడపీడలను తట్టుకొనే హైబ్రిడ్ రకాలను సాగు చేస్తారు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. పత్తి, మిర్చి సాగుకు వెనుకాడుతున్న రైతులు 2023 ఖరీఫ్‌లో 14,626 హెక్టార్లు, 2024లో 26,509 హెక్టార్లలో కంది సాగు ఈ ఏడాది 30 వేల హెక్టార్లలో సాగుకు అవకాశం ఖర్చు తక్కువ, గిట్టుబాటు ధరతో లాభాలు ఎక్కువ జిల్లాలో పత్తికి ప్రత్యామ్నాయంగా సాగుకంది సాగుపై గంపెడు ఆశలు.... గత ఖరీఫ్ సీజన్లో ఎన్నో ఆశలతో వ్యయ ప్రయాసలతో పత్తి, మిర్చి సాగు చేసి తీవ్రంగా నష్టపోయాను. మద్దతు ధర లభించక వచ్చినకాడికి అమ్మి తీవ్రంగా నష్టపోయాం. కందికి తక్కువ పెట్టుబడి కావడంతో సాగుకు సిద్ధంగా ఉన్నాం. గతేడాది ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి తగ్గింది. వచ్చిన పంటను అమ్మే సమయంలో దళారులు తక్కువకే కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్‌కు క్వింటాలుకు రూ.8 వేలు మద్దతు ధర ప్రకటించడంతో కంది సాగుకు మొగ్గు చూపుతున్నాం. – పుచ్చకాయల రామకృష్ణ, రైతు, తేరాల గ్రామం, దుర్గి మండలం -
జల్సాలకు అలవాటుపడి బైకులు చోరీ
నగరంపాలెం: జల్సాలు చేయడానికి సొమ్ము కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. సుమారు రూ.25 లక్షల విలువైన 34బైకులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల గుంటూరు తూర్పు, పశ్చిమ సబ్ డివిజన్లలోని పట్టాభిపురం, పాత గుంటూరు, నగరంపాలెం, తాడికొండ పీఎస్‌ల పరిధిలో ఎక్కువ గా బైకు చోరీలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, పాత నేరస్తుల కదలికలు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించామని చెప్పా రు. అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశామని అన్నారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు (కేవీపీ కాలనీ 4వ వీధి, శ్రీనివాసరావు పేట వాసులు)తోపాటు అక్కిశెట్టి ఆకాష్ (ఎల్ఐసీ కాలనీ), ఉప్పు రాకేష్ (స్తంభాలగరువు), మడుగుల రవితేజ (కేవీపీ కాలనీ), షేక్ అషీరు (పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామం), కోన వెంకటగోపీ (లక్ష్మీనగర్ రెండో వీధి), టి.రాజేష్, బోయపాటి జయసాయి (తాడికొండ మండలం మోతడక గ్రామం ఎస్టీ కాలనీ)లను అరెస్ట్ చేశామని వివరించారు. అందరూ 27 ఏళ్లలోపు వారే... అరెస్ట్ అయిన వారందరూ 27 ఏళ్లలోపు వయస్సు వారే. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. రవితేజ, ఆకాష్‌లు చోరీలకు ఆజ్యం పోశారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొంతకాలంగా గుంటూరు నగర పరిధిలోని ఇళ్ల ఎదుట, మార్కెట్ ప్రదేశాలు, ఆసుపత్రులు, ప్రార్థన స్థలాల వద్ద నిలిపి ఉంచిన బైకులను దొంగిలించారు. తర్వాత ఆ బైక్‌లను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వీరిలో ఒకరిద్దరు పాత నేరస్తులు ఉన్నారు. బైకులను కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. చోదకుల నిర్లక్ష్యం వల్లే వాహన చోరీలు జరగుతున్నాయని అన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వాహనాలకు హ్యాండిల్ లాక్, వీల్ లాక్‌లను బిగించుకోవాలని చోదకులకు సూచించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), అబ్దుల్ అజీజ్ (తూర్పు), అరవింద్ (పశ్చిమ), సీఐలు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇద్దరు మైనర్లు సహా తొమ్మిది మంది నిందితులు అరెస్ట్ రూ.25 లక్షల ఖరీదైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ -
‘విజయ’ స్ఫూర్తి.. చెరగని కీర్తి
తెనాలి: పాక్‌తో 1999లో కార్గిల్ యుద్ధం అనివార్యమైంది. భారతీయ సేనలు మూడునెలలు భీకర పోరాటం చేసి విజయం సాధించాయి. ఆ యుద్ధంలో ఉమ్మడి తెనాలి డివిజన్ సైనికులు ముగ్గురు వీరమరణం పొందారు. వారి స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. కార్గిల్ యుద్ధంలో మాతృభూమి రక్షణకు ప్రాణం అర్పించడమే లక్ష్యంగా భారత సైనికులు దూసుకెళ్లారు. శత్రువుకు అవకాశం ఇవ్వకుండా తరిమికొట్టారు. యుద్ధ విజయంలో భారతీయ ఇన్ఫాంట్రీ విభాగం సైనికులే నిజమైన హీరోలయ్యారు. నాడు వీరమరణం పొందిన సైనికుల్లో తెనాలి డివిజన్‌కు చెందిన ఎస్కే మస్తాన్‌వలి, ఎండీ హాజీబాషా, కేసన శివయ్య ఉన్నారు. నేడు కార్గిల్ దివస్ సందర్భంగా వారి గురించి ప్రత్యేక కథనం ఇది. యువరక్తం చిందించిన మస్తాన్‌వలి... ఎస్కే మస్తాన్‌వలి స్వస్థలం నిజాంపట్నం. అప్పటికి ఆయన వయస్సు 25 ఏళ్లు. పేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి సైనికుడు కావాలన్నదే లక్ష్యం. 1994లో ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యారు. సైనికుడిగా విధులు నిర్వర్తిస్తూ కార్గిల్ యుద్ధంలో కదం తొక్కారు. మాతృభూమి కోసం అమరడయ్యారు. మస్తాన్‌వలి భౌతికకాయానికి నాడు అధికారిక లాంఛనాలతో జరిగిన అంత్యక్రియలకు నిజాంపట్నంలో జనం పోటెత్తారు. గ్రామస్తులతోపాటు ఎందరో పుష్పాంజలి ఘటించారు. ఆయన గుర్తుగా స్మారకస్తూపాన్ని నిర్మించారు. ఆయన తండ్రి బాక్సి నిజాంపట్నంలోని మస్తాన్ వలి సమాధి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. మస్తాన్‌వలి పేరుతో ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలు స్ఫూర్తిగా హాజీబాషా... చందోలు గ్రామంలో 1973లో అబ్దుల్ రెహ్మాన్, ముంతాజ్‌బేగం దంపతులకు జన్మించారు హాజీబాషా. హాజీబాషా తండ్రి రెహ్మాన్, తాత షేక్ మస్తాన్లు కూడా సైన్యంలో పనిచేసిన వారే. తమ పెద్దల స్ఫూర్తితో 20 ఏళ్ల వయసులోనే అంటే 1993లో సైన్యంలో చేరారు. 110 ఇంజినీర్ రెజిమెంట్ ముంబయి ఇంజినీరింగ్ గ్రూపులో 17వ బెటాలియన్ గార్విల్ రైఫిల్స్‌లో పనిచేశారు. ‘ఆపరేషన్ విజయ్’లో వీరమరణం పొందారు. కుమారుడి మరణంతో ఆయన తండ్రి రెహ్మాన్ దిగులుపడి తర్వాతి ఏడాదిలోనే కన్నుమూశారు. హాజీబాషా తమ్ముడు కూడా ఎనిమిదేళ్ల వయసులో మెదడువాపుతో చనిపోయారు. శివయ్య త్యాగం చిరస్మరణీయం చేబ్రోలు మండల గ్రామం శేకూరులో వ్యవసాయ కూలి దంపతులు సాంబయ్య, వెంకటేశ్వరమ్మ దంపతుల కుమారుడు కేసన శివయ్య. గ్రామం నుంచి పలువురు సైన్యంలో చేరటంతో వారి స్ఫూర్తితో తానూ సైనికుడు కావాలని శివయ్య భావించారు. పదో తరగతితోనే చదువు ఆపేశారు. 1989–90లో ఆర్మీకి ఎంపికయ్యారు. రైఫిల్స్ విభాగంలో పనిచేస్తూ కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తమ కుమారుడు స్ఫూర్తిగా నిలవాలనే భావనతో ఆయన విగ్రహాన్ని శేకూరులో కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని చూసినపుడల్లా శివయ్య త్యాగం తమకు స్ఫూర్తిగా నిలుస్తుందని గ్రామస్తులు చెప్పారు. కార్గిల్ యుద్ధంలో తెనాలి ప్రాంత వాసులు ముగ్గురు వీరమరణం నేడు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వారి సేవలు స్మరణీయం -
ఇంద్రకీలాద్రికి శ్రావణ శోభ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. అమ్మ వారి ప్రధాన ఆలయంతోపాటు అన్ని మార్గాల ను పూలతో అలంకరించారు. అమ్మవారికి నిర్వహించిన పలు అర్జిత సేవలు, ప్రత్యేక కుంకుమార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర న వార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద శ్రావణమాస ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన జరుగుతుందని ఆల య అర్చకులు పేర్కొన్నారు. ప్రతి గంటకు ఒక బ్యా చ్ చొప్పుల పూజ నిర్వహిస్తామని చెప్పారు. అమ్మ వారి పాత మెట్ల మార్గంలో మెట్ల పూజలను భక్తులు విశేషంగా నిర్వహించారు. కొందరు భక్తులు మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ, అమ్మవారి ఆలయ మెట్లుకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు నిర్వహించారు. ఘాట్‌రోడ్డుపై ద్విచక్రవాహనాలకు అనుమతి... గత రెండు రోజులుగా దుర్గగుడి ఘాట్‌రోడ్డును మూసివేసిన ఆలయ అధికారులు, శుక్రవారం ద్విచక్ర వాహనాలను అనుమతించారు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించారు. కార్లు, దేవస్థాన బస్సులను కనకదుర్గనగర్ వైపు మళ్లించారు. -
వరి నాట్లుకు సిద్ధమవుతున్న రైతులు
పిడుగురాళ్ల: రైతులు వరి నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నిన్నటి వరకు ఎండలు విపరీతంగా కాయటంతో నాట్లు వేసేందుకు ఆలోచనలో పడ్డ రైతులకు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూమి పదునెక్కింది. దీంతో రైతులు బోర్ల కింద వేసిన నారును కొనుగోలు చేసి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బోర్ల దగ్గర నారు పోసిన వారు ముందుగానే నాట్లు వేశారు. వర్షం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. మెట్ట భూములు కూడా పదునెక్కటంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిగమ్నయ్యారు. దీంతో సాగర్ నుంచి నీరు వస్తే పంటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలకు పదునెక్కిన భూమి -
పొలానికి దారి కోసం గృహాలు కూల్చివేత
బొల్లాపల్లి: తన పొలానికి దారి చూపాలంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అడ్డుగా ఉన్న గృహాలను తొలగించాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వుల అమలులో భాగంగా అధికారులు శుక్రవారం గృహాల కూల్చివేతకు పూనుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ బాధితులు వేడుకున్నా అధికారులు కనికరించలేదు. చివరకు కోర్టు కోర్టు స్టేటస్ కో ఆర్డరు ఇవ్వడంతో కూల్చివేతను నిలిపివేశారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు శివారులోని ఆర్ అండ్ బీ రోడ్డుకు ఆనుకుని కొంతమంది పేదలు గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. నివాస గృహాలకు ఆనుకుని ఉన్న స్థల యజమాని డి.మల్లికార్జునచారి తన పొలానికి దారి లేదంటూ కోర్టును ఆశ్రయించాడు. అడ్డుగా ఉన్న గృహాలు తొలగించాలంటూ కోర్టు స్థానిక అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనేపథ్యంలో శుక్రవారం నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు పర్యవేక్షణలో స్థానిక తహసీల్దారు ఎ.బి.సుధాకర్, ఆర్ అండ్ బీ ఏఈ కె.నవ్యలు గ్రామానికి చేరుకుని నివాస గృహాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. బాధితుల రోదనల మధ్య ఆక్రమణల తొలగింపు కొంత మేరకు నిర్వహించారు. బాధితుల్లో ఒకరు చుంచునీటి శౌరమ్మ కోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించింది. రోడ్డు సైడు ఖాళీ స్థలంలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని బాధితులు తెలిపారు. ఎం.వీరయ్య, హుస్సేన్, కె.గోవిందయ్య, జి.వెంకయ్యలకు చెందిన రేకుల షెడ్డులు, జి.మునయ్య, కె.నాగరాజులకు చెందిన పక్కా భవనాలు తొలగింపు పూర్తవుతున్న సమయంలో కోర్టు నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు వెలువడ్డాయని సమాచారం రావడంతో ఆక్రమణల తొలగింపును అధికారులు నిలిపివేశారు. ఈ విషయమై తహసీల్దారును వివరణ కోరగా రహదారులు భవనాల శాఖ నుంచి రోడ్డు ఆక్రమణలకు గురైందని గుర్తించడం జరిగిందని, ఆక్రమణదారులకు ఫారం–7 నోటీసులు అందజేశామని తెలిపారు. పొలం యజమాని నాకు దారి కావాలంటూ కోర్టుకు వెళ్లడంతో మే నెలలో రోడ్డు సైడ్ ఆక్రమణలు తొలగించాలని తమకు ఉత్తర్వులు అందాయన్నారు. అనంతరం బాధితులు కోర్టుకు వెళ్లడంతో ఆక్రమణల తొలగింపు నిలిపివేశామన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలుకు సిద్ధమైన అధికారులు మోహరించిన పోలీసులు మా ఇళ్లు కూల్చవద్దంటూ బాధితుల వేడుకోలు స్టేటస్ కోతో కూల్చివేత నిలిపివేత అధికారులు కనికరించాలి ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. పక్కా గృహం నిర్మించుకున్నాం. ఆక్రమణలంటూ తొలగిస్తే మేము ఎక్కడకు వెళ్లాలి. మాకు వేరే ఇళ్లు లేదని, అధికారులు కనికరించి ఇక్కడే నివాసం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. – జి.అనంతలక్ష్మి, బాధితురాలు, వెల్లటూరు -
శ్రావణం.. శుభప్రదం
సత్తెనపల్లి/యడ్లపాడు/గురజాల: సకల శుభాల శ్రావణమాసం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆయా ఆలయాల్లో కమిటీలు ముమ్మర ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది. అందుచేత మహిళలు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. నెల రోజులుగా ఆషాఢం కావడంతో ముహూర్తాలు లేవు. నేడు శ్రావణ మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్ష్మికి పూజలు చేసేందుకు మహిళలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. 26 నుంచి మంచి ముహూర్తాలు... నెలరోజులుగా ఉన్న ఆషాఢ మాసం ఈనెల 24 (గురువారం) తో ముగిసింది. శ్రావణమాసంలో ఈ నెల 26 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. శ్రావణ మాసం మొదలైన మరుసటి రోజు నుంచి సుముహుర్తాలు మొదలు కానున్నాయి. ముఖ్యంగా ఈనెల 26, 30, 31, ఆగస్టు నెలలో1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, సెప్టెంబర్ 23, 24, 26, 28, అక్టోబర్ 1, 2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31, నవంబర్1, 2, 4, 7, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో సుముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో ఉన్న 15 మంచి ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. బాధ్రపద మాసం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు ముహుర్తాలు లేవు. నేటి నుంచి ప్రారంభం కానున్న నోముల మాసం -
ఇక.. రెండు పూటల హాజరు
సత్తెనపల్లి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబు కార్డు కలిగిన శ్రామికులకు ఇకపై రెండు పూటలు హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం ఉపాధి శ్రామికుల చిత్రాలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆయా మస్టర్ల ఆధారంగానే కూలీలకు వేతనాలు చెల్లిస్తారు. ఉపాధి హామీ పనుల హాజరులో జరుగుతున్న అవకతవకలను నివారించేందుకు, పనులు పారదర్శకంగా జరిగే విధానంపై పర్యవేక్షణే లక్ష్యంగా కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు క్షేత్ర సహాయకులు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) ద్వారా ఉదయం, మధ్యాహ్నం చిత్రాలు తీసి అప్లోడ్ చేసేవారు. ఈ విధానంలో కూలీలు రెండు పూటలా పని చేసినట్లు నమోదు చేసుకునే వారు. దీంతో సామాజిక ఆడిట్లు జరిగినప్పుడు హాజరులో లోపాలు ఉండటంతో క్షేత్ర సహాయకులకు జరిమానాలు విధించేవారు. కొత్త విధానంలో ఉదయం, సాయంత్రం హాజరు చిత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా కూలీలు పని ప్రదేశంలో ఉండాల్సి వస్తుంది. నూతన విధానంలో ఇలా... నూతన విధానంలో పనిచేసే ప్రదేశంలో ఉదయం తొమ్మిది గంటలకు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే చిత్రాలు తీయాలి. ఇలా తీసిన వాటినే రెండుసార్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వీటిని పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీఓలకు నివేదిక పంపుతారు. ఇవి సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది ఎంపీడీఓలు తనిఖీ చేస్తారు. యాప్ ద్వారా శ్రామికులు రెండు సార్లు మస్టర్లు వేసేలా వారు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మస్టర్ల ఆధారంగానే ఉపాధి కూలీలకు వేతనాలు పని ప్రదేశంలో కూలీలు ఉండాల్సిందే -
కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోవడం వల్ల వేలాది కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నరసింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు రెండో రోజు శుక్రవారం పాత గుంటూరులోని శ్రీ కృష్ణ కల్యాణ మండపంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనసూయ, రమణరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీలోపు సంక్షేమ బోర్డు పని చేయడం ప్రారంభించాలని, లేనిపక్షంలో సెప్టెంబర్ 15న లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద సామూహిక ధర్నా చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి. నరసింహారావు మాట్లాడారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా రమణరావు, ఆర్.వి. నరసింహారావు, కోశాధికారిగా గోపాలరావు, ఉపాధ్యక్షులుగా అనసూయ, రాజ్‌గోపాల్, సహాయ కార్యదర్శులుగా సుందరబాబు, అప్పారావు, 17 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని, 63 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నరసింగరావు -
అడ్మిషన్ల పెంపునకు కృషి చేయండి
పిడుగురాళ్ల: ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల పెంపునకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం(ఏపీఓపెన్ స్కూల్‌సొసైటీ) రాష్ట్ర కో–ఆర్డినేటర్ పి.రవీంద్రనాథ్ సూచించారు. పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరగాలన్నారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. అనంతరం ఓపెన్ స్కూల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పాఠశాల హెచ్ఎం మల్లిఖార్జునరావు మాట్లాడుతూ... ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ నెల 30వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు అపరాధ రుసుం రూ.200 చెల్లించి అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440004297, 8522994297 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సార్వత్రిక విద్యా పీఠం పల్నాడు జిల్లా కో–ఆర్డినేటర్ హుస్సేన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర కో–ఆర్డినేటర్ పి.రవీంద్రనాథ్ -
నేడు అమ్మవారికి స్వర్ణ కవచాలంకారం
మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి ఆగస్టు 22 వరకు శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారం రాజ్యలక్ష్మి అమ్మవారికి స్వర్ణ కవచాలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నెల రోజుల పాటు భక్తుల కోసం హోమం, సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. -
జిల్లాలో సరిపడా వరి విత్తనాలు
జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు నకరికల్లు: డిమాండ్‌కు సరిపడా వరి విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని నర్శింగపాడు గ్రామంలో బోర్లు, బావుల కింద సాగవుతున్న వరి నారుమడులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 39,079 హెక్టార్లలో వరిసాగు చేయనున్నట్లు తెలిపారు. బీపీటీ–5204, జేజీఎల్–384, కేఎన్ఎం–1638, అంకుర్పద్మ, అంకుర్సోనమ్, హెచ్ఎంటీ సోనం విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. రైతుసేవ కేంద్రాల ద్వారా పంటసాగుకు కావలసిన ఎరువులను రైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఎకరాకు 100–200కేజీల వర్మీకంపోస్టు వాడడం ద్వారా వరిపంటలో నాణ్యత పెరుగుతుందన్నారు. అనంతరం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను సందర్శించి వర్మీకంపోస్టు ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఏడీఏ బి.శ్రీకృష్ణదేవరాయలు, ఏఓ కె.దేవదాసు, పంచాయతీ కార్యదర్శి కె.అప్పారావు, వ్యవసాయ విస్తరణాధికారి కె.దిలీప్‌కుమార్, ముస్తాక్, రైతులు జినుగు చంద్రశేఖర్‌రెడ్డి, కై పు రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
చిలకలూరిపేటటౌన్: బాల్యంపై ఉన్నం మమకారమే తనను బాల సాహిత్యకారుడిగా తీర్చిదిద్దిందని ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కవికోకిల గుర్రం జాషువా వర్ధంతి గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సత్యాలను కవిత్వంతో మేళవించి, సమాజోద్ధరణకు పూనుకున్న గొప్ప కవి, నవయుగ కవిచక్రవర్తి జాషువా అని అభివర్ణించారు. సమాజంపై జాషువా విసిరిన కవిత్వం దళిత జాతిని జాగృతం చేసి అగ్రపీఠంపై నిలబెట్టిందన్నారు. తనకు సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన ‘కబుర్ల దేవత’ పుస్తకంలోని విశేషాలను ఆయన వివరించారు. ● విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు అజయ్ బాబు మాట్లాడుతూ దళితుల ఆక్రందనలు, ఆకలి కేకలు కవిత్వీకరించి, అనాథలను, అభాగ్యులను కవితా వస్తువులుగా ఎన్నుకుని సమాజాన్ని ధిక్కరించిన కవిదిగ్గజం జాషువా అని కొనియాడారు. విశ్రాంత ఎకై ్సజ్ సీఐ గోరంట్ల నారాయణ జాషువా పద్యాలు హృద్యంగా ఆలపించారు. జాషువా వర్ధంతిపై విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేయగా, సొసైటీ ప్రతినిధులు శివకుమార్‌ను ఘనంగా సత్కరించారు. ముందుగా పట్టణ ప్రముఖులు తోట రామచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాహితీ విమర్శకులు డాక్టర్ పీవీ సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గేరా యాకోబు, సలహాదారులు న్యాయవాది దాసరి చిట్టిబాబు, దార్ల బుజ్జిబాబు, చుక్కా విన్సెంట్ పాల్, దారా కొండయ్య, బొప్పుడి వెంకటేశ్వర్లు, తంగళ్ళ సుధాకర హరిప్రసాద్, జనక్రాంతి షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సత్యాలను కవిత్వంతో మేళవించిన గొప్ప కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ -
ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది
ప్రభుత్వ సహకారం పొందే సంస్థలు, శాఖలకు నరసరావుపేట: ప్రభుత్వ సహకారం, సహాయం పొందుతున్న అన్ని సంస్థలు, శాఖా కార్యాలయాలకు సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు పేర్కొన్నారు. గురువారం ప్రకాష్‌నగర్‌లోని జిల్లా సహకార బ్యాంక్ సమావేశం హాలులో సమాచార హక్కు–2005పై అవగాహన సదస్సును ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, ప్రాథమిక సహకార సంఘాల సీఈఓలకి సబ్ డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి స్వర్ణ చినరామిరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 1964 ఏపీ సీఎస్ చట్టం కింద రిజిస్టరైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని అన్నారు. ● డివిజనల్ సహకార అధికారి కె.తిరుపతయ్య మాట్లాడుతూ పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి, సమాచార కమిషనర్ అధికార పరిధి, విధి విధానాలను, సమాచార విషయాల గురించి వివరించారు. సమాచార హక్కు ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని అధికారులు, పౌరులు పరస్పరం బాధ్యతాయుతంగా పారదర్శకంగా వ్యవహరిస్తూ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజాఅవసరాలకు ఉపయోగించుకోవాలని అన్నారు. ● విజయవాడ కో–ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ కో–ఆర్డినేటర్ రంగరాజు, ఎస్డీఎల్ సీఓ రామిరెడ్డి, డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీస్ సూపరింటెండెంట్ జీపీడీ టాండన్‌లు మాట్లాడారు. జీడీసీసీ బ్యాంకు నరసరావుపేట బ్రాంచ్, సహకార శాఖ పల్నాడు జిల్లా కార్యాలయం, డివిజనల్ కో–ఆపరేటివ్ కార్యాలయ, సబ్ డివిజనల్ కార్యాలయ సిబ్బంది, నరసరావుపేట తాలూకాలోని 18 పీఏసీఎస్‌ల సీఈఓలు పాల్గొన్నారు. జిల్లా సహకార అధికారి నాగరాజు -
పేద కుటుంబాల అభివృద్ధే లక్ష్యం
నరసరావుపేట రూరల్: పేద కుటుంబాల అభివృద్ధే పీ–4 లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. మండలంలోని దొండపాడు గ్రామంలో గురువారం పీ–4 సర్వే బంగారు కుటుంబాల పరిశీలన కోసం గ్రామ సభ నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే సచివాలయ సిబ్బంది పీ–4 సర్వే పూర్తిచేసి 139 బంగారు కుటుంబాలను గుర్తించారని తెలిపారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పుల కోసం గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 64 వేల మందిని గుర్తించినట్టు వివరించారు. 2047 నాటికి ఒక్క కుటుంబం కూడా పేదరికంతో బాధపడకుండా చూడాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఉద్యోగులు, విదేశాలలో ఉండే వారిని సమన్వయపరిచి మార్గదర్శకులుగా ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సమాజంలోని పేదవారిని గుర్తించి వారికి ప్రభుత్వం అందిస్తున్న సాయంతో పాటు మార్గదర్శకుల నుంచి ఏదో ఒక సాయం అందించడం కార్యక్రమ ఉద్దేశ్యమని తెలిపారు. పేదరికం అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా మార్గదర్శకులు పనిచేయాలని సూచించారు. ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీఓ టీవీ కృష్ణకుమారి పాల్గొన్నారు. సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. నరసరావుపేట: ఏపీ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ పి.అరుణ్‌బాబు కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. స్వర్ణ ఆంధ్ర, పీ–ఫోర్ ఫౌండేషన్, సానుకూల ప్రజా దృక్పథం, పట్టణాల్లో గ్యాస్ పంపిణీకి సంబంధించిన సమస్యలు, తదితర అంశాలపై జిల్లాలో నెలకొన్న పరిస్థితులను సీఎస్‌కు కలెక్టర్ వివరించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు -
అసమానతల నిర్మూలనకే జాషువా రచనలు
తెనాలి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సమాజంలోని అసమానతల తొలగింపు కోసం రచనలు చేశారని, తన సాహిత్యంతో సమాజ చైతన్యానికి కృషిచేశారని ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీజీఎం కొండముది సుధీర్ బాబు అన్నారు. ఆయన సాహిత్యాన్ని ముందు తరాలకు అందించటానికి తగిన కృషి జరగాలని అభిప్రాయపడ్డారు.పట్టణానికి చెందిన గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా 54వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర్లోని విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి సమితి ప్రధాన కార్యదర్శి, యునెస్కో అవార్డు గ్రహీత పినపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ జాషువా సాహిత్యం ఆనాటి కాలంలో సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిందని తెలిపారు. అంటరానితనాన్ని పారద్రోలడంలో కీలక భూమిక పోషించిందని చెప్పారు. జాషువా కారణజన్ముడని ఆయన పేర్కొన్నారు. దళిత వర్గాల్లో పుట్టిన జాషువా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రచనలు చేసి విశ్వక్ కవిగా ఖ్యాతిగాంచిన తీరు గొప్పదని ప్రశంసించారు. సమితి ఉపాధ్యక్షుడు వేజండ్ల రత్నం, కొండముది రమేష్, న్యాయవాదులు ఇందుపల్లి రాజారామ్, ఆరుమళ్ల శ్రీనివాసరావు, బొబ్బిలిపాటి ప్రసాద్, వేజండ్ల శ్రీనివాస్, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, కళాకారులు, రచయితలు అయినాల మల్లేశ్వరరావు, అబ్దుల్ హకీం జాని, చోడవరపు భాస్కరరావు, ఆర్ అండ్ బీ రాజు, వేజెండ్ల శ్రీనివాసరావు, రావూరి ప్రేమ్‌కుమార్, జయరావు, అత్తోట శ్యామ్, సిద్ధల కమలాకర్ రావు, కనపర్తి డేవిడ్, విన్సెంట్ కుమార్, శ్రీనివాసరావు, పి. అశోక్ కుమార్, రావూరి బాలరాజ్ పాల్గొన్నారు. తొలుత జాషువా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీజీఎం కొండముది సుధీర్ బాబు -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ గ్రామాన ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు సూచించారు. రైతు సేవా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులు(ఏఏ), ఉద్యాన సహాయకులు(వీహెచ్ఏ)లకు కృషీభవన్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ముందుగా సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ జూమ్ మీటింగ్ ద్వారా ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన తొమ్మిది సార్వత్రిక సూత్రాలు, సాగు పద్ధతులు, రైతులు పొందిన ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సహకరించాలని కోరారు. అన్ని రంగాలు ఒకే బాటలో పని చేయాలని, ముఖ్యంగా అది ప్రకృతి వ్యవసాయమై ఉండాలని ఆయన తెలిపారు. రసాయనాలు వాడకం తగ్గించి, సహజ జీవన ఉత్పేరకాలు ఉపయోగిస్తే భూమికి కలిగే ప్రయోజనాలను రైతులందరికీ తెలియజేయాలని సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా భూమి ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ రైతులు సాధించిన ఫలితాలను ప్రకతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి వివరించారు. ఇప్పటి వరకు 80 గ్రామ పంచాయతీలు మాత్రమే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఉన్నాయన్నారు. అయితే, ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రాం ద్వారా 233 గ్రామ పంచాయతీలు భాగమవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అంతా కలిసి రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె సూచించారు.ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను గుంటూరు ఏడీఏ మోహనరావు, జిల్లా యాంకర్ గోపీచంద్ వివరించారు. కార్యక్రమంలో జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు క్లెయిమ్‌లపై విచారణ
చీరాల టౌన్: చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు క్లెయిమ్‌లపై బీఎల్వోలతో సమర్థంగా విచారణ నిర్వహిస్తున్నామని ఈఆర్వో, ఆర్డీవో తూమాటి చంద్రశేఖరనాయుడు తెలిపారు. గురువారం చీరాల తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయపార్టీల నాయకులతో ఓటరు క్లెయిమ్‌లపై విచారణ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో ఓటరు క్లెయిమ్ అర్జీలు పెండింగ్‌లో లేకుండా విచారణ చేస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు తమ బూత్ ఏజెంట్లతో విచారణ చేయించుకోవచ్చన్నారు. క్లెయిమ్ అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అవాంతరాలు లేకుండా విచారణ చేస్తున్నారని, ఏమైనా అభ్యంతరాలుంటే వివరాలను తెలియజేయాలన్నారు. ఇటీవల మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రతి బీఎల్వో వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌లోని ఓటర్ల పూర్తి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం విచారణ చేయాలని, ఇష్టానుసారంగా విధులు నిర్వహించవద్దనే ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్యలను తనకు గానీ, ఏఈఆర్వోలకు గాని తెలియజేయాలని కోరారు. రాజకీయపార్టీల నాయకులకు ఉన్న పలు అనుమానాలను ఆర్డీఓ నివృత్తి చేశారు. తహసీల్దార్ కుర్రా గోపికృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డీటీ సుశీల, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం నేరం జె.పంగులూరు: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం నేరమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు హెచ్చరించారు. మండల పరిధిలోని కొండమంజులూరు జాతీయ రహదారి వెంబడి గత సర్వే నెంబర్ 58లో ఆక్రమణకు గురైన డొంక పోరంబోకును ఆర్డీఓ గురువారం పరిశీలించారు. 58 సర్వే నెంబర్లో మొత్తం 2.47 ఎకరాలు డొంక పోరంబోకు ఉన్నట్లు అధికారులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆక్రమణకు గురైన డొంక పోరంబోకు స్థలాన్ని గుర్తించి, ఆక్రమించిన వారిని గుర్తించి సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం పంచాయతీ, రెవెన్యూ అధికారులు.. ఆక్రమించిన వారికి నోటీసులు పంపించి స్థలం స్వాధీనం చేసుకోవాలని కోరారు. కొండమంజులూరు గ్రామానికి ఆనుకొని ఉన్న మట్టి దిబ్బను పరిశీలించారు. అక్రమ మట్టి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూర్పు కొప్పెరపాడులోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 14 వేల టన్నుల పొగాకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.సింగారావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు -
భ్రమరాంబకు విశేష అలంకరణలు
స్థానిక శివాలయంలో శ్రావణమాసం పురస్కరించుకుని మొదటి శుక్రవారం భ్రమరాంబ అమ్మవారిని పలు పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. శ్రావణ మాసమంతా శుక్రవారాల్లో అమ్మవారు పసుపు కొమ్ములు, గాజుల అలంకరణ, చీరల అలంకరణలో దర్శనమిస్తారని ఆయన పేర్కొన్నారు. భక్తులంతా శ్రీ భమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకొని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు. భక్తులందరికీ స్వామివారి తీర్థ, ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. –పెదకాకాని -
అందుబాటులో 1,681 మెట్రిక్ టన్నుల ఎరువులు
సత్తెనపల్లి: ఖరీఫ్ సాగుకు సత్తెనపల్లి పట్టణ, గ్రామీణ పరిధిలోని ఎరువుల దుకాణాల్లో 1,681 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సత్తెనపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు బి.రవిబాబు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో గల గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణ, గ్రామీణ పరిధిలోని ఎరువుల దుకాణాల్లో యూరియా–590 మెట్రిక్ టన్నులు, డీఏపీ– 327 మెట్రిక్ టన్నులు, పొటాష్ ఎరువులు –95 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు–585 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ–84 మెట్రిక్ టన్నులు నిల్వలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. రైతులందరూ మీ మీ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద, ప్రైవేట్ ఎరువుల దుకాణాలు వద్ద నుంచి ఎరువులను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి.సుబ్బారెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
రెంటపాళ్ళలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి
సత్తెనపల్లి: మిరప నారు దిబ్బల పైకి గొర్రెల మందను వదలడమే కాకుండా వైఎస్సార్ సీపీ శ్రేణులపై సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో టీడీపీ సానుభూతిపరులు మంగళవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు, వల్లెపు రవితేజ, వల్లెపు వీరయ్య మిరప నారు దిబ్బలు సాగు చేస్తుండగా టీడీపీ సానుభూతి పరులైన నంబుల కాటంరాజు, యాగంటి బాబురావు, సైదయ్యలకు చెందిన గొర్రెల మంద పడటంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన కాటంరాజు, బాబురావు, సైదయ్యలు దాడి చేయడంతో వల్లెపు రాంబాబు, వల్లెపు రవితేజ, వల్లెపు వీరయ్యలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ప్రతిగా టీడీపీ సానుభూతిపరులు కూడా ఫిర్యాదు చేశారు. గాయపడి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్సార్ సీపీ నాయకులు కొర్లకుంట వెంకటేశ్వర్లు, కొమ్మెర శివశంకర్, కొమెర వీరాంజి, మారిశెట్టి వెంకట్రావు, వల్లెపు సహదేవుడు, గంగిలి ఏసోబు, చల్లా వెంకటేశ్వర్లు, తదితరులు పరామర్శించారు. -
వర్షానికి కోతకు గురైన కల్వర్టు
బొల్లాపల్లి: రెండు రోజులు క్రితం కురిసిన భారీ వర్షానికి మండలంలోని గరికపాడు –పమిడిపాడు గ్రామాల మధ్య రహదారిలో ఉన్న కల్వర్టు కోతకు గురైంది. దీంతో రెండువైపులా రాకపోకలు నిలిచాయి. భారీ వర్షానికి మండలంలోని నాగులేరు ఉధృతంగా ప్రవహించడంతో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన చప్టా ఆనుకుని రోడ్డు కోతకు గురైంది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వినుకొండ–కారంపూడి రహదారి పరిధిలో బొల్లాపల్లి మండలం నుంచి రేమిడిచర్ల గుమ్మంపాడు గరికపాడు పమిడిపాడు గ్రామాలను కలుపుతూ ఈ రహదారి కారంపూడి వెళ్తుంది. గత రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాహన చోదకులు వాపోతున్నారు. బొల్లాపల్లి నుంచి కారంపూడికి చిరు వ్యాపారులు ఉద్యోగులు విద్యార్థులు రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. రెండు రోజులుగా నాగులేరు ప్రవాహానికి కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. గతంలో అదేవిధంగా వర్షాలకు కల్వర్టు మరమ్మతులకు గురైందని, అప్పట్లో తూతు మంత్రంగా మరమ్మతులు చేపట్టంతో ఈ దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు కోతకు గురైన కల్వర్టును మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని వాహన చోదకులు కోరుతున్నారు.గరికపాడు– పమిడిపాడు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు -
పిడుగురాళ్లలో హతమార్చి నంద్యాలలో డోర్ డెలివరీ!
నంద్యాల: భర్తను తన తమ్ముడితో కలిసి చంపేసి.. ఆపై మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి నంద్యాలలోని భర్త ఇంటి వద్ద విడిచిపెట్టింది. ఈ ఘటన నంద్యాలలో జరిగింది. నంద్యాల టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన రమణయ్య (50)కు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి సంతానం. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా భార్య కొంతకాలంగా పుట్టిల్లు అయిన పిడుగురాళ్లలో ఉంటోంది. ఈ క్రమంలో భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకొని రావడానికి భర్త పిడుగురాళ్లకు సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ భార్య బంధువులు, రమణయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమణమ్మ, ఆమె తమ్ముడు రామయ్య కలిసి, రమణయ్య కంట్లో కారం చల్లి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తమ్ముడితో కలిసి భర్త మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చి, మృతదేహాన్ని అక్కడ పడేసి పరారయ్యారు. మృతుడి ముఖంపై కారంపొడి ఉండటం..తల, వీపుపై గాయాలు ఉండటంతో రమణయ్య కుమార్తెలు జ్యోతి, చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి భర్త ఇంటి వద్ద విడిచిపెట్టిన భార్య హత్యకు సహకరించిన తమ్ముడు -
డివైడర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
నరసరావుపేటటౌన్: ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే గడియార స్తంభం సెంటర్లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. పోలీసుల కథనం ప్రకారం.. షిర్డీలో మారుతి సుధాశ్రీ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని గుంటూరుకు బయలు దేరింది. మార్గమధ్యంలో తెల్లవారు జామున నరసరావుపేట గడియార స్తంభం వద్దకు వచ్చే సరికి ఆగి ఉన్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి బస్సు డివైడర్‌ను ఢీకొంది. సంఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. సంఘటనతో ట్రాఫిక్ నిలిచి పోయింది. సమాచారం అందుకున్న సీఐ లోకనాథం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
వరుణా.. ఎంత పనిచేశావ్!
యడ్లపాడు: సీజన్ ఆరంభానికి ముందే కురిసి, తీరా అదును సమయానికి ముఖం చాటేసిన వరుణుడు, ఇప్పుడు కుండపోత వర్షాలతో రైతుల ఆశలను అడియాశలు చేశాడు. శుక్ర, ఆది, సోమవారాల్లో 76.2 మీమీ వర్షపాతం కురవడంతో రెండు పంటలు సాగు చేయాలన్న మండల రైతులకు రెండో పంట సంగతి ఏమోగాని, ప్రతీ రైతు రెండసార్లు విత్తనా లు నాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో ఉప్పవాగు, కొండవాగులు ఉధృతమై ప్రవహించాయి. ఎప్పుడు నీటి జాడ కనిపించని నక్కవాగు, లింగారావు పాలెంలోని పడమర వాగులు సైతం నిండుగా పారాయి. వాగులు, వంకలు, కుంటలు నిండిపోయాయి. కుండపోత వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వాననీరు వరదగా మారి మండలంలోని దిగువ ప్రాంతాలపైకి విరుచుకుపడింది. ఇప్పటికే పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులకు ఈ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆయా గ్రామా ల్లోని పంట పొలాల్లో అక్కడక్కడా గండ్లు పడటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మరోవైపు సోమవారం రాత్రి లింగారావుపాలెంలో పడమర వాగు పొంగడంతో, వరద నీరు ఊరిని చుట్టుముడుతుందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన తో రాత్రంతా జాగారం చేశారు. విత్తనాలు బొగిలి, మొలకలు కుళ్లి.. ముందస్తుగా యడ్లపాడు, లింగారావుపాలెం, సొలస, చెంఘీజ్‌ఖాన్ పేట, తిమ్మాపురం పత్తి విత్తనాలు వేసుకున్న పత్తి రైతులు వర్షాభావ పరిస్థితులు కారణంగా భూమిలో నాటుకున్న విత్తనా లు బొగిలిపోవడంతో రెండోసారి విత్తుకున్నారు. వీరికి ప్రస్తుతం కురిసిన కలిసి వచ్చినా రెండుసార్లు అచ్చుతోలి నాటుకున్న అధిక ఖర్చుల భారం మీద పడింది. ఇక కారుచోల, గుత్తావారిపాలెం, జగ్గాపురం, జాలాది గ్రామాల్లో వాగు, కుంటలు, బోర్ల కింద కొందరు పత్తి విత్తనాలు నాటారు. ఇవి మొలకలు వచ్చాయి. అయితే శుక్రవారం నుంచి దశల వారీగా దంచికొట్టిన వానకు అవికూడా కుళ్లిపోవడంతో వీరు రెండో పర్యా యం విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వర్షం వచ్చే సూచన్లు ఉన్నాయని తెలిసీ పత్తి విత్తనాలు నాటిన వారి పరిస్థితి అధిక వర్షంతో తేమశాతం ఎక్కువై నేలలోనే నాటిన గింజలు కుళ్లి పోతాయని తాము తప్పక తిరిగి మరోమారు విత్తుకోవాల్సిందేనని అలా నాటుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జాలాది పరిసర పొలాల్లో వర్షాలకు 15 రోజులకు ముందుగా ఎదబెట్టి జ్యూట్ విత్తనాలను సుమారు 50 ఎకరాలకు పైగా విత్తుకున్నారు. సోమవారం రాత్రి ఎగువ ప్రాంతాల నుంచి ఉధృతంగా ప్రవహించిన వరద నీరు కారణంగా జ్యూట్ విత్తనాలు కుళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు. వీరు రెండోసారి విత్తనాలు ఎదబెట్టక తప్పదని పెదవిరుస్తున్నారు. ఇలా వర్షాభావంతో, వర్షం కురుస్తుందని కొందరు, వర్షం అధికమై మరికొందరు విత్తన దశలోనే చిత్తయిపోయారు. ఖరీఫ్ సీజన్లో రెండు పైర్లు సాగు చేయాలన్న ఆలోచన అటుంచి, రెండుసార్లు విత్తనాలు నాటుకోవాల్సిన పరిస్థితి మాత్రం రైతులకు తప్పడం లేదు. వరద నీరు ప్రవాహమై ముంచెత్తిందిలా... ఎగువ ప్రాంతాల నుంచి తిమ్మాపురం, దింతెనపాడు మీదుగా వచ్చిన పొలాల్లోని వరద నీరు కొల్లుగుంట నిండి గణేశునివారిపాలెం, సందెపూడి, తుర్లపాడు వైపుగా ప్రవహిస్తూ చివరకు కుప్పగంజి వాగులో కలుస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలకు ముందుగానే విత్తుకున్న పత్తి, జ్యూట్ విత్తనాలు కుళ్లిపోయాయి. అలాగే ఉన్నవ పొలాల్లోని వరద నీరంతా కారుచోల చెరువులోకి వచ్చి ఆ చెరువు అలుగు మీదుగా పారి యడ్లపాడు, జగ్గాపురం పొలాల పరిధిలోని బొల్లయ కాలువ మీదుగా జాలాది పంట పొలాల్లోకి చేరి అక్కడి నుంచి నక్కవాగులో కలుస్తుంది. ఆయా గ్రామాల్లో పొడివిత్తనాలు వేసుకున్న రైతుల పొలాల మీదుగా అత్యధిక వరదనీరు ప్రవహించడంతో మొలకెత్తిన, కొత్తగా విత్తుకున్న పత్తి విత్తనాలన్నీ కుళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పవాగు, కొండవాగులు ఉధృతం యడ్లపాడు మండలంలో వరద ముంపులో పంట పొలాలు -
108 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర
సత్తెనపల్లి: త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఆమోదించిన సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ (సతెనపల్లి)ఆధ్వర్యంలో నందిగామలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో 108 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర ర్యాలీ మంగళవారం నిర్వహించారు. సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడుతూ.. జాతీయ జెండా భారత దేశం యొక్క సార్వభౌమత్వం, ఐక్యతకు చిహ్నమన్నారు. సత్తెనపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆళ్ల సాంబయ్య మాట్లాడుతూ త్రివర్ణ పతాకం భారతీయులకు అందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. తొలుత పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, పాఠశాల పీడీ సాంబశివరావు, చెంబేటి బోల్లయ్య, హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు అక్షయ్, నిర్మల్ కుమార్, జాతీయ జెండా వేషధారి శేఖర్, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, వాణి, జ్యోతి, అమల, గౌసియా, విద్యార్థులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు
పిడుగురాళ్ల: మోసపూరిత హామీలను ఇంటింట ప్రచారం చేసి ఇప్పుడు హామీలు నెరవేర్చాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు అనటం ప్రజలను మోసం చేయటమేనని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున సంవత్సరానికి రూ. 18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, అయితే నేడు ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి ఉందని బహిరంగంగా తెలపటం, రాష్ట్రంలోని మహిళలను మోసం చేయడమేనన్నారు. ఈ పథకం అమలు చేస్తామని పవన్ కల్యాణ్ కూడా సంతకాలు పెట్టి హామీలకు ఊతమిచ్చారని, కానీ చివరకు హామీలు గాలికి వదిలేశారన్నారు. మోసపూరిత హామీలకు ప్రజలు బుద్ధి చెబుతారు గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి -
కాసుపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
గురజాల : వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, నాయకులకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి అన్నారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభించిన పిడుగురాళ్ల– జానపాడు ఓవర్ బ్రిడ్జి పనులు, మెడికల్ కళాశాల పనులు నిలిచిపోతే పోరాటం చేసి వాటి పనులు ప్రారంభించేలా చేసిన ఘనత కాసు మహేష్‌రెడ్డికే దక్కుతుందన్నారు. దీంతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వెంటనే స్పందించి సంవత్సర కాలంలో మెడికల్ కళాశాల పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడడం, పంటలకు గిట్టుబాటు ధరల లేక రైతులు విలవిల్లాడి పోతున్న సంఘటనలు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాసు మహేష్‌రెడ్డిపై ఆరోపణలు మానుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల -
7, 8 తేదీలలో సీపీఐ మహాసభలు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా సీపీఐ మహాసభలను ఆగస్టు 7, 8 తేదీలలో వినుకొండలో నిర్వహిస్తున్నట్టు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జిల్లా మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. 7వ తేదీన వినుకొండ ప్రధాన వీధుల్లో ర్యాలీ, సాయంత్రం 4 గంటలకు శివయ్య స్థూపం వద్ద బహిరంగ సభ, 8వ తేదీన ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహాసభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్, జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, చక్రవరం సత్యనారాయణరాజు, షేక్.చినజాన్సైదా, చిట్యాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
కార్యకర్తలకు వెన్నుదన్నుగా...
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రేపాల శ్రీనివాసరావు పిడుగురాళ్ల: గురజాల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండేది మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అని ఆ పార్టీ సెక్రటరీ, రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షులు రేపాల శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ... ఆయన కార్యకర్తలను పట్టించుకోవటం లేదని చెప్పటం సరికాదన్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు, ఏ నాయకుడికి సమస్య వచ్చినా కాసు మహేష్‌రెడ్డి నిలబడి సమస్యలను పరిష్కరించేందుకు ముందు ఉన్నారన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను అధికార పార్టీ నేతలు ఇబ్బందికి గురి చేసినప్పుడు, పోలీసులు తప్పుడు కేసులు పెట్టినప్పుడు కాసు మహేష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించి అండగా నిలిచారన్నారు. -
కారు అద్దాలు పగలకొట్టి చోరీ
మంగళగిరి టౌన్ : రెండు వేర్వేరు కారుల అద్దాలు పగలకొట్టి ల్యాప్‌టాప్‌లు చోరీ చేసిన ఘటన మంగళగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు డీబీఎస్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హెడ్ శ్రీనివాస్ సిల్వరాజ్ విధులు నిమిత్తం విజయవాడ బ్యాంకుకు వచ్చారు. అక్కడ పని ముగించుకుని విజయవాడ క్లస్టర్ హెడ్ సుధాకర్‌తో పాటు తన సిబ్బందితో గుంటూరు బ్యాంకుకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు చినకాకానిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న భోజన హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో బద్వేల్కి చెందిన సాయిరాం అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో ఎర్రబాలెంలో తాను కొనుగోలు చేసిన స్థలం చూడడానికి వచ్చి భోజనం చేసేందుకు వీరు కూడా వారి కారులో హోటల్‌కు చేరుకున్నారు. వీరిద్దరూ కార్లను పార్కింగ్ చేసి భోజనం చేయడానికి లోపలికి వెళ్లారు. భోజనం చేసి అనంతరం బయటకు వచ్చి చూడగా కారు అద్దాలు పగలకొట్టి ఉండడం గమనించారు. కారు లోపల పెట్టిన ల్యాప్‌టాప్, బ్యాగులు అపహరణకు గురిఅయినట్లు గుర్తించారు. శ్రీనివాస్ సెల్వరాజ్ కారులో ల్యాప్‌టాప్‌తో పాటు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయని, సాయిరామ్ కారులో ల్యాప్‌టాప్‌తో పాటు సుమారు 5 వేల రూపాయలు నగదు, ఇంటి తాళాలు, బీరువా తాళాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. రెండు ల్యాప్‌టాప్‌లు, కొంత నగదు అపహరణ -
ప్రజలను మోసం చేయటమే టీడీపీ అజెండా
నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలచేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా సాకులు చెప్పే టీడీపీ నాయకుల లాంటి వారిని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని నరసరావుపేట వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంగళవారం డాక్టర్ గోపిరెడ్డి స్పందించి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద, మధ్య తరగతి వర్గాలకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ డీబీటీ ద్వారా ఐదేళ్లలో రూ.2.72లక్షల కోట్లు అందజేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేశారన్నారు. తనకు 40ఏళ్ల ఇండస్ట్రీ అని, నాలుగోసారి సీఎం అంటూ చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేయకుండానే అంతకంటే ఎక్కువగా ఏ విధంగా గత ఎన్నికల సందర్భంగా ప్రతి మహిళకు నెలకు రూ.1500లు ఆడబిడ్డ నిధి ఇస్తానని హామీ ఇచ్చాడని ప్రశ్నించారు. ప్రజలకు హామీ ఇచ్చేసమయంలో అవగాహనతో ఇవ్వాలని అన్నారు. ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అమలు చేసేందుకు కఠినమైన నియంత్రణ ఉండాలన్నారు. టీడీపీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ప్రజలను మోసం చేయటమే వారి అజెండానని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి -
ఆర్టీఐ అర్జీలకు సకాలంలోసమాచారం అందించాలి
నరసరావుపేట రూరల్: ఆర్టీఐ అర్జీలకు సకాలంలో సమాచారం అందించే బాధ్యత అధికారులతో పాటు సిబ్బందిపై ఉందని జిల్లా ఉద్యాన అధికారి ఎ.వెంకట్రావు తెలిపారు. జిల్లా ఉద్యాన కార్యాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఆర్టీఐ ద్వారా ప్రభుత్వ వ్యవస్థ, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఈ చట్టం ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా పాలనలో పారదర్శకతకు అవకాశం ఉంటుందని వివరించారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట బి.వెంకటేశ్వరరావు, ఉద్యాన అధికారులు, కార్యాలయ సిబ్బంది, గ్రామ ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశంనరసరావుపేట రూరల్: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈనెల 23వ తేదీ బుధవారం లోపు రైతుసేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుని వద్ద గ్రీవెన్స్ పెట్టవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని లింగంగుంట్ల, అల్లూరివారిపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారావు మాట్లాడుతూ పంట సాగు చేసే కౌలు రైతులు కౌలు కార్డులు పొందాలని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో వరి పంటకు ఎకరానికి రూ.80లు ప్రీమియం చెల్లించి ఆగస్టు 15వ తేదీ కల్లా ఇన్స్యూరెన్స్ చేసుకోవాలని సూచించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతురావు, ఏఓ ఐ.శాంతి, ఏఈవో బ్రహ్మయ్య, వీఏఏ సామంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని ఉద్యోగి మృతి తెనాలి రూరల్: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ఆర్ అండ్ బీ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న జాన్‌బాబు(50) మంగళవారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. జాన్‌బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనాస్థలిని రైల్వే పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన దినేష్ (20) మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కళాశాల నుంచి తన స్నేహితుడు గణేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయలుదేరాడు. చౌడవరం వద్ద హైవేపై డివైండర్ రైలింగ్‌కు ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఢీకొంది. దినేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1325.2 మిల్లీమీటర్ల వర్షం నరసరావుపేట: గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 1325.2 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. అత్యధికంగా దాచేపల్లిలో 88.2 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా వినుకొండలో 14.0 కురిసిందన్నారు. మొత్తం 28 మండలాల్లో వర్షం నమోదైందన్నారు. -
శాస్త్రవేత్తలుగా జెడ్పీ పాఠశాల విద్యార్థులు
ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 8, 9వ తరగతుల విద్యార్థులు ఐదుగురు జాతీయ స్థాయి వన్డే యాజ్ ఏ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌కు ఎంపిక అయినట్లు పాఠశాల హెచ్ఎం లింగిశెట్టి సాంబయ్య మంగళవారం తెలిపారు. పాఠశాలకు చెందిన బి.అనుశ్రీ,, షేక్ ఖాసీం, షేక్ మస్తాన్‌వలి, కె.ప్రశాంత్, షేక్ అన్వర్‌లను ఇటీవల ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షల్లో ఎంపిక చేశారని చెప్పారు. జిగ్యాసా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), అంతర్జాతీయ స్థాయి పరిశోధన సంస్థ (భవనేశ్వర్)లో ఈ నెల 24న విద్యార్థులు అక్కడున్న శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తారని తెలిపారు. విద్యార్థులను పలువురు ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బి.నాగరాజులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.రామాంజనేయులు, రాజులు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్‌తో టైలర్ షాపు దగ్ధం మేదరమెట్ల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలోగల టైలర్ దుకాణం సోమవారం అర్ధరాత్రి మంటల్లో కాలిపోయింది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి దుకాణం తలుపులు వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో స్థానికులు ఫోన్ చేసి షాపులో మంటలు వస్తున్నాయని చెప్పటంతో అక్కడకు వచ్చే సరికి దుకాణం పూర్తిగా కాలిపోయింది. దుకాణంలో ఉన్న బట్టలు, సామాగ్రి దగ్ధమయ్యాయని.. వాటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని వాపోయాడు. లారీని ఢీ కొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు మేదరమెట్ల: ఆగిఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన టాటాఏస్ ఆటో ఢీ కొన్న సంఘటన జాతీయ రహదారిలోని పి.గుడిపాడు గాజు ఫ్యాక్టరీ వద్ద మంగళవారం జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న కొరియర్ లారీ పి.గుడిపాడు జాతీయరహదారి గాజు ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిఉంది. ఒంగోలు వైపు నుంచి వస్తున్న టాటాఏస్ ఆటో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పిన ఆటో ఆగిఉన్న లారీని ఢీ కొంది. దీంతో లారీలోని డ్రైవర్‌కు.. ఆటో డ్రైవర్‌కు గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తమ్ముళ్ల పేకాట జోరు
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో జోరుగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా పేకాట మూడు జోకర్లు... ఆరు షోలుగా వర్దిల్లుతోంది. డైమండ్ రాణి, ఇస్పేట్ ఆసు అంటూ రేయింబవళ్లు పేక ముక్కల సందట్లో జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. అధికార పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జూదశిబిరాలు కావడంతో సమాచారం ఉన్నా పోలీసులు ఆ వైపు తొంగిచూడటం లేదు. ముఖ్యంగా నరసరావుపేట, మాచర్ల, చిలకలూరిపేట, దాచేపల్లి, గురజాల, వినుకొండ పట్టణాల పరిధిలో పేకాట జోరుగా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రం, జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు భారీగా తరలివస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జూదం పడగవిప్పింది. ఫలితంగా అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.జోరుగా పేకాట శిబిరాలుజూదగాళ్లు పల్నాడు, ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతాలలో జోరుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. వినుకొండ నియోజకవర్గ పరిఽధిలోని మారు మూల ప్రాంతాల్లో నిత్యం పేకాట జరుగుతుండగా, వీటికి పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కార్లలో వచ్చి పేకాటలో పాల్గొంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పేకాట జోరుగా సాగుతోంది. వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, సాగర్ పోలీసుస్టేషన్లతోపాటు ఏకంగా మాచర్ల పట్టణంలో ప్రత్యేకంగా గదులు తీసుకొని పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. అచ్చంపేట, బెల్లంకొండ ప్రాంతాలలో కృష్ణానది పరివాహక ప్రాంతాలలో అయితే అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. చిలకలూరిపేటలో ప్రజాప్రతినిధి అండదండలతో పట్టణ నడిబొడ్డులో ఏకంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు. దీంతోపాటుగా యడ్లపాడు, బోయపాలెం, సాతులూరు, కోమటినేనివారిపాలెం, కావూరు గ్రామాలలో ద్వితీయ శ్రేణి నాయకులు జూద శిబిరాలను ఏర్పాటు చేశారు. రాజుపాలెం, పాకాలపాడు గ్రామాలలో పేకాట రాయుళ్ల కదిలికలు ఉంటున్నాయి. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలలో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. ఒక రోజు గురజాలలో పేకాట నిర్వహిస్తే మరో రోజు దాచేపల్లి మండల పరిధిలో మకాం మారుస్తున్నారు. ఉదయం 6 గంటలకు జూదగాళ్లకు ఆ రోజు పేకాట నిర్వహించే ప్రాంతాలను తెలియజేస్తున్నారు. దీంతో ఖరీదైన కార్లలో అక్కడ వాలిపోతున్నారు. ప్రజాప్రతినిధి ఆదేశాలు, నిర్వాహకులు ఇస్తున్న ముడుపులతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.అనుచరులకు ఆదాయ మార్గంగాటీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పేకాటను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల మద్దతుతో యథేచ్ఛగా జూదశిబిరాలు నిర్వహిస్తున్నారు. పేకాటలో పా ల్గొనే వారి నుంచి ఒక్కో షోకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఒకరోజు శిబిరం నిర్వహిస్తే నిర్వాహకులకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో ప్రజాప్రతినిధికి కొంత, పోలీసులకు మరికొంత ముట్టజెబుతున్నామంటూ నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. అధికారు లు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. దిద్దుబాటు చర్యలలో భాగంగా ఇటీవల జిల్లాలో అక్కడక్కడా పేకాట శిబిరాలపై దాడులు చేసి పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పేకాట శిబిరాలపై పూర్తి అవగాహన ఉన్నా అలసత్వం వహిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లకు అలవాటు పడి పేకాట శిబిరాలకు సహకరిస్తున్నట్టు ఆరోపణలు లేకపోలే దు. ఏదీ ఏమైనప్పటికీ జూదానికి అలవాటుపడ్డ వారి కుటుంబాలు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి రోడ్డుపడ్డాయి. మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితులు దాపురించాయి.ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే...పేకాట శిబిరాలు గతంలో చెట్లు, గుట్టల కింద గుట్టుగా జరిగేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లాడ్జిలు, ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న ఇళ్లలో జూదం నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నరసరావుపేటలో పేకాట సంస్కృతిని తీసుకువచ్చారు. విచ్చలవిడిగా జూద శిబిరాలను ఏర్పాటుచేసి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. బరంపేట, అల్లూరివారిపాలెం, ములకలూరు, ఎల్టీ నగర్, యలమంద తదితర ప్రాంతాలతో కలిపి ఒక నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోనే పదికి పైగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉండటం గమనార్హం. కొన్ని హోటళ్లలో నిర్వాహకులు గదులు తీసుకొని పేకాట టేబుళ్ల ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ఆహారం, మందు సరఫరా చేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వ్యవహారం నడుస్తోంది. జిల్లాలోని పేకాటరాయుళ్లకు నరసరావుపేట నిర్వాహకులు ఫోన్లు చేసి ఆహ్వానం పలుకుతున్నారు. -
విషాదం నింపిన వివాదం
శావల్యాపురం: మానవ సంబంధాలు, రక్త సంబంధాలు రోజురోజుకు దిగిజారిపోతున్నాయనటానికి కారుమంచి ఘటన ఉదాహరణ. వివరాలు ఇలా ఉన్నాయి.. అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం ఒకే కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామం వద్ద జాతీయ రహదారి మార్గంపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడిన సంఘటన విషాదాన్ని నింపింది. గొడవకు దారి తీసిన పరిస్థితులు... కారుమంచి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు, బత్తుల వెంకటరావు అన్నదమ్ములు. వీరి మధ్య కొన్నేళ్లుగా స్థల వివాదం ఉంది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో రాజీ జరిగినా ఫలించలేదు. సోమవారం అన్నదమ్ముల కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో బత్తుల శ్రీనివాసరావుకు గాయమైంది. ఈ విషయమై శావల్యాపురం పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు చికిత్స కోసం ఆటోలో వినుకొండకు బయలుదేరారు. మార్గంమధ్యలో మినీ వాహనం మృత్యువు రూపంలో కబళించింది. ప్రమాదంలో బత్తుల బ్రహ్మయ్య, బత్తుల నాగమూర్తమ్మ, బత్తుల అంజమ్మ, బత్తుల ముత్యాలమ్మలు మృతి చెందారు. బత్తుల యశోదకుమారి రెండు కాళ్లు విరగగా గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలలో మృత్యువుతో పోరాడుతుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి బత్తుల శ్రీనివాసరావు తల్లి ముత్యాలమ్మ, భార్య నాగమూర్తమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అంతేగాక ఆయన కుమార్తె యశోదకుమారి తీవ్ర గాయాలై మృత్యువుతో పోరాడుతోంది. మృతదేహాలకు పంచనామా ఒకే కుటుంభానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు పెద్దలను కోల్పోయి అనాథలుగా మారాయి. మంగళవారం నలుగురు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో శవపంచనామా అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించారు. మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. చూపరులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకరరావు సారధ్యంలో ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొల్లుమన్న కారుమంచి గ్రామం గ్రామానికి చేరిన మృతదేహాలు -
పొంగుతున్న వాగులు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుప్పగంజివాగు చప్టాకు అడ్డుగా ఉన్న కంపచెట్లు తొలగించారు. దీంతో నీటి ఉధృతి తగ్గింది. –యడ్లపాడు/నాదెండ్లయడ్లపాడు వద్ద నిండుగా ప్రవహిస్తున్న నక్కవాగు గణపవరం వద్ద కుప్పగంజి వాగు చప్టాపై ప్రవహిస్తున్న నీరు -
గురుకులం గోడు పట్టదా?
● మంచాలు లేక నేలపైనే నిద్ర ● బెంచీలు లేక కిందనే కూర్చుంటున్న విద్యార్థులు ● విద్యాలయానికి చేరుకునే మార్గం అధ్వానం ● పనిచేయని ఆర్వో ప్లాంట్లు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● అల్లాడుతున్న విద్యార్థులు యడ్లపాడు: మంచి క్రమశిక్షణకు..సమగ్ర విద్యకు మారుపేరైన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. యడ్లపాడు మండలం బోయపాలెంలోని ఏపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలను విద్యార్థులు చదువు, క్రీడలు తదితర అంశాల్లో ప్రతిభ చాటుతున్నా వసతి కొరత తదితర వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 5 నుంచి పదో తరగతి వరకు 450 మంది వరకు చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం 316 మంది విద్యను అభ్యసిస్తున్నారు. గతంలో భోజనాలు బాగుండలేదంటూ ఇక్కడి విద్యార్థులు 35 మంది గోడదూకి రెండుసార్లు కొండవీడు కొండల్లోకి వెళ్లి నిరసన తెలపడంతో అప్పట్లో రాష్ట్రమంతటా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ప్రిన్సిపాల్‌ను మార్చి దాసరి ప్రభాకరరావును నియమించారు. ఆ తర్వాత పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ఆహారం విషయాలతోపాటు సరిపడా బోధకుల్ని సమకూర్చడంలో ప్రభాకరరావు కృతకృత్యులయ్యారు. మిగిలిన సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేటీకీ ఆయా సమస్యలు పరిష్కారం కాలేదు. సౌకర్యాలు కొరవడి విద్యార్థులు, వాటిని పరిష్కరించలేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. వీటిలో ప్రధానంగా తరగతి గదిలో బెంచీలు లేకపోవడం, లోయర్ క్లాస్ అయినా, హయ్యర్ క్లాస్ అయినా..అందరూ నేలపైనే కూర్చుని చదువుకోవాలి ఒక్క బెంచీ కూడా లేకపోవడం విశేషం. మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఉన్నా ఒక్కటీ పనిచేయక మూలన పడి ఉన్నాయి. మరుగుదొడ్ల తలుపులు పలు ధ్వంసం కావడం, విద్యార్థులంతా వసతి గదుల్లోని నేలపైనే నిద్రించాల్సిన సమస్యలు నెలకొని ఉన్నాయి. ఇక పాఠశాలకు చేరుకునేందుకు ప్రధానమార్గం సమస్య ఉండనే ఉంది. బోయపాలెం–చెంఘీజ్‌ఖాన్‌పేట బీటీరోడ్డు నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పాఠశాలకు ప్రధాన మార్గం లేకపోవడం, వర్షాలు కురిస్తే బైక్‌పై వెళ్లేందుకు ఫీట్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి వందలాది మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉండే ఈ గురుకుల పాఠశాలలో అత్యంత మౌలిక సౌకర్యాలు కొరవడటం బాధాకరమని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాదెండ్ల: నాదెండ్ల మండలంలో రెండు వసతి గృహాలున్నాయి. గణపవరంలో ఎస్సీ బాలుర వసతిగృహం (ఇంటర్, డిగ్రీ కళాశాల) 24 మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. వీరికి ప్రతినెలా హెయిర్ కటింగ్, కాస్మోటిక్స్ కోసం రూ.250 నగదు అందిస్తారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఈ చార్జీలు నేటి వరకూ చెల్లించలేదు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. నాదెండ్లలో ఎస్సీ బాలుర వసతిగృహంలో 90 మంది విద్యార్థులు ఉంటున్నారు. మూడు నుండి పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. జనవరిలో దుప్పట్లు, ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు అందించారు. ఇటీవల పాఠశాలలు పునః ప్రారంభం నుంచి మరమ్మతులు నిర్వహించారు. విద్యార్థులకు సరిపడా బాత్రూంలు, మంచినీటి వసతి ఉన్నాయి. పరదాలే ప్రహరీ.. అమరావతి: అమరావతి మండలంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేశాయి. ధరణికోటలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో 50 శాతం విద్యార్థులు కూడా లేరు. ఎస్సీ హాస్టల్లో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మొత్తం 25మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్ భవనం నూతనంగా నిర్మిం చింది కావటం, తక్కువ మంది విద్యార్థులు ఉండటంతో మరుగుదొడ్ల సమస్య లేదు. అలాగే బీసీ బాలుర హాస్టల్లో 23 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్‌కు మరమ్మతులు జరగటం వల్ల పెద్దగా సమస్యలు లేవు. అయితే మరుగుదొడ్లలో ఐదు మాత్రమే పనిచేస్తున్నాయి. స్నానాల గదులకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌కు ఉత్తరాన క్రోసూరు రోడ్డు వైపు ప్రహరీ లేకపోవటంతో అకుపచ్చపట్ట కట్టారు. హాస్టల్లోకి జంతువులు, ఆకతాయిలు ప్రవేశిస్తున్నారు. -
బంగరు భవితకు నవోదయం
● ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వరం ● జేఎన్వీలో ఆరో తరగతి ప్రవేశాలకు ఆహ్వానం ● 29 వరకు దరఖాస్తు దాఖలుకు గడువు ● డిసెంబర్ 13న ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు ● సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన చిలకలూరిపేట టౌన్ / యడ్లపాడు: ప్రతిభవంతులైన పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు చక్కని అవకాశం కల్పిస్తోంది పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం. చిలకలూరిపేట రూరల్ మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది వేసే పాఠశాల విద్యలో జవహర్ నవోదయ విద్యాలయాలు మంచి విద్యా ప్రమాణాలను ఉచితంగా అందిస్తున్నాయి. పాఠశాలలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను మాత్రమే వీటికి ఎంపిక చేస్తారు. ఇందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏటా ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చును వెచ్చిస్తుంది. జూన్ 1న ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ నెల 29వ తేదీతో దరఖాస్తు దాఖలుకు గడువు ముగియనుంది. సీబీఎస్ఈ సిలబస్... ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులు 6 నుంచి 12వ తరగతి వరకు ఎటువంటి ఖర్చు లేకుండా కో రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యను అభ్యసించవచ్చు. సకల సౌకర్యాలు... భోజనం, వసతి, దుస్తులు, పుస్తకాలు వంటివి అందజేస్తారు. బాలురు, బాలికల కోసం వేర్వేరు వసతి గృహాలున్నాయి. సువిశాల ప్రాంగణం, శాశ్వత తరగతి గదులు, డిజిటల్ పాఠాలకు ప్రత్యేక ఏర్పాట్లు, అధునాతన కంప్యూటర్ ల్యాబ్, రన్నింగ్ ట్రాక్, మైదానం ఉన్నాయి. ఉదయం వ్యాయామం, యోగా సాధన, చిత్రలేఖనం, సంగీతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్, పలు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. పాఠ్యాంశాలతోపాటు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కూడా ఎన్నో పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, పూర్తిగా సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉంటుంది. ముఖ్యంగా జేఈఈ, నీట్‌కు కూడా విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తారు. జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేలా మైగ్రేషన్ (వలస) స్కీమ్ ద్వారా ఇక్కడ 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఇతర రాష్ట్రాల నవోదయ విద్యాలయాలకు పంపిస్తారు. దీంతో అక్కడి భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకునే చక్కని అవకాశం లభిస్తుంది. అర్హులు వీరే... ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంతాలలో చదివి ఉత్తీర్ణులైన వారికి ఈ కోటాలో అవకాశం కల్పిస్తారు. విద్యార్థి 2014 మే 1 – 2016 జూలై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. తల్లిదండ్రులు ఉమ్మడి గుంటూరు జిల్లా నివాసితులై ఉండాలి. విద్యార్థి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చదువుకొని ఉండాలి. పరీక్ష విధానం ఇలా... విద్యార్థులు హెచ్‌టీటీపీఎస్//నవోదయ.జీవోవీ.ఇన్‌లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు నిర్వహిస్తారు. రెండు గంటల సమయం ఉంటుంది. తెలుగు, ఆంగ్లం, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షను అమృతలూరు, బాపట్ల, చిలకలూరిపేట, గుంటూరు, మంగళగిరి, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, తెనాలి, వినుకొండ, రేపల్లె ప్రాంతాల్లో నిర్వహిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి నవోదయలో అడ్మిషన్లు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతాయి. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 750 అర్జీలు వచ్చాయి. పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి సిఫార్సులకు తావుండదు. తల్లిదండ్రులు, విద్యార్థులు అపోహలకు లోనవ్వకుండా అప్రమత్తతతో ఉండాలి. 6 నుంచి 12వ తరగతి వరకు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభ్యాసం సాగించవచ్చు. దరఖాస్తులు గడువులోగా దాఖలు చేయాలి. – నల్లూరి నరసింహారావు, ప్రిన్సిపల్, పీఎంశ్రీ జేఎన్వీ, మద్దిరాల -
చేనేత సహకార సంఘాలకు రూ. 156 కోట్లివ్వాలి
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ సత్తెనపల్లి: చేనేత సహకార సంఘాలకు రావాల్సిన యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ, రిబేట్ మొత్తం రూ. 156 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం జరిగిన ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమావేశానికి చేనేత కార్మిక సంఘ నేత కట్టా శివ దుర్గారావు అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 6,7వ తేదీలలో సత్తెనపల్లిలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చేనేత రంగాన్ని పరిరక్షిస్తామని, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుకు చర్యలు చేపడతామని కూటమి నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభలలో సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ చేతివృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సామాజిక రక్షణ చట్టంలో కొన్ని వృత్తులకు రక్షణ కల్పిస్తామని చెప్పి 8 మంది మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదన్నారు. కార్పొరేషన్లకు విధివిధానాలు లేకపోవడంతో 56 కార్పొరేషన్ల వల్ల వృత్తిదారులకు ప్రయోజనం జరగలేదన్నారు. రాజకీయ నిరుద్యోగులకు ఉపయోగపడుతున్నట్లు ఆరోపించారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు దూకిపర్తి రామారావు, వాసా గంగాధరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అనుముల వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
పప్పన్నం తినలేం!
రేషన్ సరుకుల్లో కందిపప్పు కట్సత్తెనపల్లి: జిల్లాలో చౌక దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసే స్థోమత లేక పోవడంతో ఇక కందిపప్పుపై ఆశలు వదులుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. కందిపప్పు ధర అయితే ఎన్నడూ లేని విధంగా అమాంతం పెరిగిపోయింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే కందిపప్పును వినియోగించుకుందామని తెల్ల రేషన్ కార్డుదారులు ఆలోచిస్తుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది జనవరిలో కొద్దిమందికి నామమాత్రంగా కందిపప్పు పంపిణీ చేశారు. ఫిబ్రవరిలో బియ్యంతో పాటు కొంతమందికి పంచదార పంపిణీ చేసి సరిపెట్టేశారు. మార్చిలో అయినా కందిపప్పు ఇస్తారని కార్డుదారులు ఆశగా ఎదురు చూడగా.. అప్పుడు నిరాశే ఎదురైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఒక్క నెల కూడా కందిపప్పు పంపిణీ చేయలేదు. బియ్యంతో సరి ప్రతి నెల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత బియ్యం మాత్రమే అందజేస్తున్నారు. ఎన్నికల్లో చౌక దుకాణాల ద్వారా అన్ని రకాల పప్పులు రాయితీ ధరలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. నాలుగు నెలలుగా బియ్యం, అరకొరగా చక్కెర తప్ప మిగిలిన సరుకులు ఇవ్వడం లేదు. నాలుగు నెలలుగా కందిపప్పు ఇవ్వకపోవడంతో స్థానికులు చౌక దుకాణ దారులను నిలదీస్తున్నారు. కందిపప్పు సరఫరాలేదని, పంచదార ఇచ్చిన మేరకు అయిపోయిందని స్టాకు రావలసి ఉందని వారు చెబుతున్నారని కార్డుదారులు వాపోతున్నారు. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా 1,289 చౌక దుకాణాల పరిధిలో 6,34,893 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో సభ్యులుగా ఉన్న 18,09,128 మందికి ప్రభుత్వం ప్రతి నెలా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తోంది. జిల్లాలో కార్డుదారులకు పంపిణీ చేయడానికి ప్రతినెల సుమారు 600 టన్నుల కందిపప్పు అవసరం. ప్రతి నెల 20వ తేదీ లోపు రేషన్ డీలర్లు డీడీలు తీసి అవసరమైన సరుకులు దిగమతి చేసుకుంటారు. అయితే డీలర్లు డీడీలు తీస్తున్నా పౌరసరఫరాల శాఖ మాత్రం కందిపప్పు అరకొరగా 100, 150 టన్నులు మాత్రమే ఇస్తుంది. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో కందిపప్పు అందడం లేదు. ఈ నెల పూర్తిగా ఆపేశారు. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా కందిపప్పు అందేది. ఽమార్కెట్‌లో ధర పెరిగినా ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీపై అందించేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ. 67కే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లాలో 402 ఎండీయూ వాహనాల ద్వారా కందిపప్పు కిలో రూ.67కే పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకటి, రెండు నెలలు మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా అరకొరగా కందిపప్పు పంపిణీ చేసి చేతులెత్తేయడంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.110 ఉంది. జిల్లాలో అధిక శాతం కూలి పనులు చేసుకునే వారే. ప్రభుత్వం పంపిణీ చేసే నిత్యావసరాలే వారికి ఆధారం. ఇందులో కందిపప్పు పూర్తిగా నిలిపివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కందిపప్పు కూడా ఇవ్వలేని సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జిల్లాలో చౌక దుకాణాల్లో కానరాని వైనం కేవలం బియ్యం, అరకొర పంచదారతోనే సరి బహిరంగ మార్కెట్లో మండుతున్న కందిపప్పు ధర నిరుపేదలను చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వం -
చికిత్స పొందుతూ బాధితుడు మృతి
నూజెండ్ల: మండలంలోని ఐనవోలు గ్రామంలో ఇటీవల జరిగిన పెట్రోల్ దాడిలో చికిత్స పొందుతూ పెద్ద శ్రీను సోమవారం మృతి చెందినట్లు కుటుంట సభ్యులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున ఆరుబయట నిద్రిస్తున్న దంపతులు నీలబోయిన పెద్ద శ్రీను, మంగమ్మ దంపతులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలో మంగమ్మ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన పెద్ద శ్రీనును గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆరు రోజులుగా చికిత్స పొందుతూ బాధితుడు శ్రీను సోమవారం మరణించాడు. ప్పటికే ఐనవోలు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. -
జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయిలో నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పరీక్షలో భాగంగా 2024 డిసెంబర్లో జరిగిన పరీక్షలో ఎంపికై న విద్యార్థులు ఆగస్ట్ 31వ తేదీ లోగా స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ వివరాలను www.schoarships.gov.in వెబ్సైట్లో నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. విద్యార్థి తన వివరాలలో ఏ ఒక్క అక్షరం తేడాగా నమోదు చేసినా స్కాలర్షిప్ మంజూరు కాదని స్పష్టం చేశారు. మెరిట్ లిస్ట్‌లో ఉన్న విధంగా ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. నమోదు చేసిన దరఖాస్తును జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందచేయాలన్నారు. ఈఏడాది 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. రెన్యువల్ చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ రాదని తెలిపారు. అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్: సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గణిత, రసాయనశాస్త్ర అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాదేవి సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధించి సబ్జెక్టు పీజీలో 55 శాతం మార్కులు పొంది ఉండాలని, ఎంపిక ప్రక్రియ డెమో ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 26న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వైద్య అధికారులతో డీఎంహెచ్ఓ సమావేశం గుంటూరు మెడికల్: డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అధ్యక్షతన గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 25 – జూన్ 25 వరకు జరిగిన 8 శిశు, చంటి పిల్లల మరణాలపై రివ్యూ కమిటీ సమావేశం డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. మరణాలకు కారణాలు, అందించిన వైద్య సేవలు, గృహ సందర్శనలు వివరాలపై చర్చించారు. గుంటూరు నగరంలోని బొంగరాలబీడు, మారుతీనగర్, పొన్నెకల్లు ఆరోగ్యకేంద్రాల పరిధిలో నమోదైన కేసులపై ఆరా తీశారు. సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు డాక్టర్ దేవకుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవాని, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ సభ్యులు డాక్టర్ ఎస్.రాధామాధవి, డాక్టర్ రోహిణి రత్నశ్రీ , ఈఓఐసీడీఎస్ సుబ్బమ్మ, ఐద్వా ఎన్జీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు. స్వల్పంగా వరదనీరు విడుదల తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురియడంతో పలు వాగుల నుంచి వరదనీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరింది. సోమవారం సాయంత్రం స్వల్పంగా వరదనీటిని ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ జేఈ రమేష్ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ వద్దకు మునేరు ఇతర వాగుల నుంచి 5,300 క్యూసెక్కులు చేరిందని, ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టాన్ని 12 అడుగులు మెయింటెన్ చేస్తూ విజయవాడ వైపు ఒక అడుగు మేర 4 గేట్లు ఎత్తి కృష్ణానది దిగువకు 2900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 2522 క్యూసెక్కులు వదిలినట్లు ఆయన తెలిపారు. కందకంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సుతాడికొండ: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కందకంలోకి దూసుకెళ్లిన ఘటన తాడికొండ శివారు పెదపరిమి రోడ్డులో జరిగింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 30 మంది ప్రయాణికులతో గుంటూరు వైపు నుంచి తుళ్ళూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు తాడికొండ దాటిన తరువాత కందకంలోకి దూసుకెళ్లింది. ఇద్దరు మహిళలతోపాటు పలువురు పురుషులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ దూకుడుగా నడిపాడని, చిన్నగా వెళ్లాలని హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోయారు. -
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 249 అర్జీలను జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళితో కలిసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటిజాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ కె.మధులత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు పీజీఆర్ఎస్లో 249 అర్జీలు స్వీకరణ -
నిర్లక్ష్య విపత్తు
వెంటనే సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలి వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే వరి నారు సాగు ఆలస్యమైంది. మరోవైపు ప్రభుత్వం ఇంకా సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేయ లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా సర్వేలు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు గుర్తించి సకాలంలో పంపిణీ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. – అన్నెం పున్నారెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడుసాక్షి, నరసరావుపేట: ఖరీఫ్ సాగు ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తోంది.. ఓ వైపు వర్షాలు మొదలయ్యాయి.. మరోవైపు వారం పది రోజుల్లో సాగర్ కుడికాలువ నుంచి నీరు వదులుతామని అధికారులు చెబుతున్నారు. వరి నారు పోయడానికి ఇప్పటికే ఆలస్యమవడంతో రైతులు సిద్ధమవుతున్న వేళ కూటమి ప్రభుత్వ ఆలసత్వం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఏటా జూన్, జూలై నెలల్లో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో సబ్సిడీపై వరి విత్తనాలను పంపిణీ చేసేవారు. ఈ ఏడాది జూలై చివరి వారం వచ్చినా ఇంకా సబ్సిడీ విత్తనాల పంపిణీ చేయలేదు. నకరికల్లు మండంలో గుండ్లపల్లి లాంటి ఒకటి రెండు చోట్ల మాత్రమే అరకొరగా సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద కనీసం జిల్లాలో ఇప్పటి వరకు ఏ పంట ఎంత మేరకు సాగు చేశారన్న సమాచారం కూడా లేకపోవడం శోచనీయం. జిల్లాలో ఈ ఏడాది సుమారు 40 వేల హెక్టార్లలో వరిసాగు చేసే అవకాశాలున్నాయి. అన్ని రకాల వరి విత్తనాలు కలిపి జిల్లాకు సుమారు 24 వేల క్వింటాళ్లు అవసరం కానుంది. గతేడాది చేదు అనుభవాలున్నా... కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఎన్నికల ముందు అలవి కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాలో పూర్తిగా విఫలమయ్యారు. గత ఏడాది ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవడం, నాగార్జున సాగర్ జలాశయం నిండటంతో రైతులు వరిసాగుపై దృష్టిసారించారు. వరి విత్తనాల సరఫరాపై ప్రభుత్వం ముందస్తుగా సిద్ధం కాకపోవడంతో విత్తన కొరత ఏర్పడింది. ప్రధానంగా జేజీఎల్–384 రకం విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ అధికంగా వచ్చింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేయాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. వరి నారుమళ్లకు సిద్ధమైనా అందుబాటులోకి రాని వరి విత్తనాలు అరకొరగా వచ్చిన విత్తనాలను పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్న వ్యవసాయ శాఖ ఇప్పటికే అదును ఆలస్యమవుతుండటంతో ఆందోళనలో రైతులు బ్లాక్ మార్కెట్లో దోచుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న రైతన్నలు గత ఖరీఫ్‌లో ఎన్నడూ లేని విధంగా వరి విత్తనాల కొరత జేజీఎల్–384రకం కోసం జోరువానలో రైతుల పడిగాపులు గతేడాది చేదు అనుభవాలు ఉన్నా జాగ్రత్త పడని వ్యవసాయ శాఖ అధికారులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే ఎరువులు, విత్తనాలు అదును ముంచుకొస్తున్నా.. వరి విత్తనాల పంపిణీ లేదన్నా..?బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు ఆర్బీకేల నిర్వీర్యంతో.. కూటమి ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు అవసరమైన విత్తనాలు లేకపోవడంతో ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటన్న ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో బోర్ల కింద వరి సాగు చేసే వారు నారుమళ్లు పోశారు. వారికి ఆర్బీకేలలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరిగా ప్రైవేట్ దుకాణాలలో, బ్లాక్ మార్కెట్లో కొనాల్సి వస్తోంది. వరి విత్తనాల కొరతపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.జగ్గారావును వివరణ కోరగా ఇండెంట్ పంపామని, ఇంకా విత్తనాలు జిల్లాకు చేరలేదని రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరో సా కేంద్రాలు బాగా పనిచేయడంతో రైతులకు అవసరమైన విత్తనాల రకాలను ముందుగానే గుర్తించి ఆ దిశగా సరఫరా చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేయడంతో సమస్య జఠిలమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు విత్తనాల కోసం వారం రోజులుగా తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వచ్చింది. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. తీవ్ర వర్షంలో రైతులను క్యూలో నిల్చోబెట్టి విత్తనాలు పంపిణీ చేయాల్సి వచ్చింది. గతేడాది చేదు అనుభవాలున్నా వ్యవసాయ శాఖ మాత్రం మొద్దునిద్ర వీడలేదు. ఓ వైపు ఆగస్టు నెల వసున్నా.. వర్షాలు విపరీతంగా కురుస్తున్నా.. మరో వారంలో రోజుల్లో సాగర్ నిండే అవకాశాలున్నా ఇంకా జిల్లాకు పూర్తిస్థాయిలో వరి విత్తనాలు అందుబాటులోకి రాని దుస్థితి. -
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌కు ఖండన
నరసరావుపేట రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలుస్తున్న నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగనన్నకు తోడుగా నిలుస్తామని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిడ్డారపు గాంధీ తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ, ఎస్సీ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శామ్యూల్, ఇంగ్లిష్ మీడియం విద్య పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ చాదినబోయిన ఏడుకొండలు యాదవ్, గాంధీ స్మారక సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈదర గోపీచంద్, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, నరసరావుపేట నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు మర్రిపూడి రాంబాబు, గురజాల మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాచర్ల బాబు, బీసీ నాయకుడు అట్లూరి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయలేదన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడని ఈదర గోపిచంద్ విమర్శించారు. గత ఎన్నికల్లో అక్రమమార్గంలో ఈవీఎంల ద్వారా గెలిచారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఈవీఎంల మోసాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. శామ్యూల్ మాట్లాడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో దాడులు, అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని తెలిపారు. హామీలపై నిలదీస్తారనే భయంతోనే.. కొమ్ము చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలుపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల అక్రమ కేసులు కొనసాగుతున్నాయని, రెడ్‌బుక్ రాజ్యాంగం ఎంతో కాలం నడవదని స్పష్టం చేశారు. ఏడుకొండలు యాదవ్ మాట్లాడుతూ తిరోగమనంలో పయనిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని తెలిపారు. అనేక కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు వైఎస్సార్సీపీ నాయకులను అణచివేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. దాడులకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు పతనానికి ఇది నాంది వైఎస్సార్సీపీ జిల్లా బీసీ, ఎస్సీ సెల్ నాయకులు మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన నాయకులు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదని స్పష్టీకరణ -
వేమగిరి వాసులకు ఇళ్లపట్టాలు, పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలి
నరసరావుపేట: పిడుగురాళ్ల మండలం వేమగిరి వయా గుత్తికొండ గ్రామంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందిన సుమారు 300 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు, సాగుచేసుకుంటున్న భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు రెడ్బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారితో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి పీజీఆర్ఎస్లో కలెక్టర్ పి.అరుణ్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. రెడ్బాషా మాట్లాడుతూ వేమగిరి గ్రామం అనేది కొత్తగా ఏర్పడింది కాదని, స్వాతంత్రం రాకముందే రాజులు, జమీందారుల పాలనలోనే ఈ గ్రామం ఉందన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమైన కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయని, వీరికి కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్తు, రోడ్డు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వారు నివసిస్తున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. సుమారు నాలుగువేల ఎకరాలు ఇక్కడున్న పేద కుటుంబాలు సాగు చేసుకుంటున్నారని, వాటికి వెంటనే అడవి హక్కుల చట్టంలో 2006 వచ్చిన మార్పును అనుసరించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర వస్తువులు బియ్యం తీసుకునేందుకు వారి గ్రామంలోనే డిపో ఏర్పాటు చేయాలని, గుత్తికొండ గ్రామానికి వెళ్లి తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. యువజన నాయకులు పాస్టర్ రమేష్, గురజాల డివిజన్ ఎంసీపీఐయూ నాయకులు మాచర్ల నాగేశ్వరరావు, యువజన సంఘం నాయకులు షేక్ మహబూబ్ బాషా, వేమగిరి గ్రామ రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. – కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన నాయకులు, గ్రామస్తులు -
షేర్లలో లాభాల పేరిట రూ.57.20 లక్షల మేర మోసం
● జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ నరసరావుపేట రూరల్: తమ సలహాలు పాటించి షేర్లలో పెట్టుబడి పెడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.57.20లక్షలు మోసం చేసినట్టు పిడుగురాళ్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, మోసం, ఆస్తి తగాదాలకు సంబంధించిన 98 ఫిర్యాదులు ఎస్పీకి అందాయి. కంపెనీ మోసం చేసిందని ఫిర్యాదు ఎలక్ట్రికల్ బైక్‌లను సరఫరా చేయకుండా, డీలర్షిప్ నగదు చెల్లించకుండా కంపెనీ మోసం చేసిందని బెల్లంకొండ మండలం వన్నాయపాలెం చెందిన మేకల సాంబశివరావు ఫిర్యాదు చేశాడు. పంజాబ్‌కు చెందిన అక్కాల్–ఈ– వరల్డ్ పేరుతో ఈటూవైగో పేరుతో ఎలక్ట్రికల్ బైక్‌లను సరఫరా చేస్తామంటే రూ.20 లక్షలు నగదు చెల్లించినట్టు తెలిపారు. కొంతకాలం బాగానే బైక్‌లను సరఫరా చేశారని, గత 8 నెలులుగా బైక్‌ల సరఫరా నిలిపివేసినట్టు వివరించారు. నాలుగు నెలల నుంచి ఫోన్‌కాల్స్ కూడా స్పందించడం లేదని తెలిపారు. ఆన్లైన్లో డబ్బులు వసూళ్లు చేసి బైక్‌లు ఇవ్వకుండా కొంతమంది కస్టమర్లను మోసం చేసినట్టు తెలిపారు. రెండో పెళ్లికి సిద్ధమైన భర్తపై చర్యలు తీసుకోవాలని వినతి తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో భర్త వివాహనికి సిద్ధమయ్యాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట కుమ్మరి బజార్‌కు చెందిన నక్కల చిన్నిపార్వతి ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతానికి చెందిన నాగప్రవీణ్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారని తెలిపింది. నన్ను, పిల్లలను సరిగా పట్టించుకోకపోడంతో పట్టింటి వద్దనే ఉంటున్నానని, ఇప్పుడు వేరే మహిళతో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. నాగప్రవీణ్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయండి పిడుగురాళ్లకు చెందిన రిటెర్డ్ ప్రధానోపాధ్యాయుడు స్టాక్ అడ్వైజర్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేయగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన అజాద్సింగ్, సుమత్రా అగర్వాల్‌లు రివైవల్ ప్లాన్ అడ్మిన్లుగా పరిచయం అయ్యారు. పెట్టుబడిపై ప్రతి రోజు 5 నుంచి 10 శాతం లాభం తీసుకువస్తామని నమ్మబలికారు. 11 దఫాలుగా రూ.57,.20లక్షలు వారు చెప్పిన అకౌంట్లో డిపాజిట్ చేశాడు. తరువాత రోజు ఏ రోజు ఎంత లాభం వచ్చింది వాట్స్ఆఫ్ గ్రూప్‌లో మెసేజ్ ద్వారా తెలియజేశారు. ఈ విధంగా ఏప్రియల్ 7వ తేదీకి 49,08,750లు లాభం వచ్చినట్టు, ఏఏ స్టాక్‌లలో ఎంత లాభం వచ్చింది వివరాలు వాట్స్ఆఫ్లో పంపించారు. పెట్టుబడి, లాభం కలిపి రూ.1.06,28,750 అకౌంట్‌కు పంపుతామని చెప్పి ఫోన్లకు స్పందించడం లేదని ఫిర్యాదు చేశాడు. సీఐపై చర్య తీసుకోవాలి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన నరసరావుపేట టూటౌన్ సీఐ హైమారావుతోపాటు తనపై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లిరోడ్డులోని ఆదిత్య అపార్ట్‌మెంట్‌కు చెందిన న్యాయవాది కె.స్నేహరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత వారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన ఫిర్యాదుపై టూటౌన్ పోలీసులను కలిసి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి దూషించిన ఆనం శివపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఎన్నిసార్లు స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. అపార్ట్మెంట్ వాసులతో కలసి సీఐ హైమారావును కలవగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని తెలిపారు. అంతేకాకుండా శివ కొంతమందితో కలిసి తన ఇంటిపై దాడికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసారు. సీసీ టీవీని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లను వినియోగించుకోండి
నరసరావుపేట: వివాహం అనంతరం కుటుంబాలను సమర్థంగా నిర్వహించుకునేందుకు మిషన్ శక్తికి చెందిన ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లను వివాహాలు చేసుకోబోయే జంటలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కౌన్సెలింగ్ సెంటర్లకు చెందిన పోస్టర్ ఆవిష్కరించారు. దీనిపై జిల్లా మహిళా, శిశుసంక్షేమ సాధికారిత అధికారి ఎం.ఉమాదేవి మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో వివాహానికి ముందు కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. తేరే మేరే సప్నే అని పిలవబడే ఈ కేంద్రాలు వివాహానికి సంబందించిన సామాజిక, మానసిక, ప్రవర్తనా అంశాలపై జంటలకు మార్గదర్శకాలు అందించటమే లక్ష్యంగా ఏర్పాటుచేసిందన్నారు. వివాహం చేసుకోబోయే జంటలకు తల్లితండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి తొంతరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమర్ధవంతంగా కుటుంబాన్ని నిర్వహించుకునేలా చేస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ఆర్డీఓ కె.మధులత, అధికారులు ఆవిష్కరణలో పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్, జేసీ, అధికారులు -
ఆటోను ఢీకొన్న మినీ వాహనం
శావల్యాపురం: మినీ వాహనం ఆటోను ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన ఇది. వివరాల్లోకి వెళితే, పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలం, కారుమంచి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒకరు గాయపడ్డారు. బాధితులు శావల్యాపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం స్వల్పగాయాలైన వ్యక్తిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లాలని పోలీసులు బాధితులకు సూచించారు. దీంతో ఆటోలో డ్రైవర్‌సహా ఎనిమిది మంది వినుకొండకు బయలుదేరారు.ఈ క్రమంలో కనమర్లపూడి గ్రామ సమీపాన జాతీయ రహదారి మార్గంలో ఆటోను మినీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన బత్తుల బ్రహ్మయ్య(34), బత్తుల నాగ మూర్తమ్మ (48), బత్తుల అంజమ్మ (57) సంఘటన స్థలంలో మృతి చెందారు. బత్తుల ముత్యాలమ్మను వైద్యశాలకు తరలించి వైద్యసేవలు అందిస్తుండగా మృతి చెందింది. బత్తుల యశోదకుమారి పరిస్థితి విషమంగా ఉంది. బత్తుల శ్రీనివాసరావు, బింగి వెంకాయమ్మ, డ్రైవర్ చల్లా రాంబాబులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రమాదానికి కారణమైన మినీ వాహనం బొప్పాయి మొక్కల లోడుతో యర్రగొండపాలెం నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం కందులవారిపాలెం గ్రామానికి బయలుదేరింది. ప్రమాదంలో మినీ వాహనం డ్రైవర్ బిట్రగుంట నరసింహారావు, మొక్కలు తీసుకు వెళుతున్న బర్రిపూడి నరసింహారావు, పాల రేణురెడ్డిలకు గాయాలు కాగా, వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో భారీ వర్షం కురుస్తుండడం గమనార్హం. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని
సాక్షి, పల్నాడు: ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పని చేస్తామని, ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టిన భయపడబోమని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని అన్నారు. సోమవారం సత్తెనపల్లి గ్రామీణ పీఎస్‌లో విచారణకు హాజరైన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18న రెంటపాళ్లలో పర్యటించారు. ఆ టైంలో జనసమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులిచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి, రజిని ఇవాళ పీఎస్‌కు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్‌లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు. కానీ మేము ఇలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు.సత్తెనపల్లి శాసన సభ్యులుగా గెలిచింది. ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు. డీఎన్ఆర్ అనే వ్యక్తి సత్తెనపల్లిలో పెత్తనం చాలా ఇస్తూ రాజ్యాంగీతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో కొనసాగుతోంది మిలిటరీ పాలన. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పి తీరుతాం. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేస్తాం అని అన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘‘రెంటపాళల్లో పోలీసులు, కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక వైయస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్లను పరామర్శించడానికి వెళ్తే.. మా మీదే కేసులు పెడుతున్నారు. జగన్ అంటేనే జనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పెద్దలు ఒక కట్టు కథ అల్లడం.. దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్సార్సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు. జగన్ మళ్లీ సీఎం అయ్యే దాకా.. ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారామె. -
పల్నాడు
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025మూడు గ్రానైట్ లారీలు స్వాధీనం స్మార్ట్ మీటర్ల బిగింపు తక్షణమే ఉపసంహరించుకోవాలి లక్ష్మీనరసింహస్వామికి పూజలు వినుకొండ:కొండమెట్ల వద్ద ఉన్న లక్ష్మీనరసింహస్వామికి 16 రోజుల పండుగ సందర్భంగా ఆదివారం వసంతోత్సవం నిర్వహించారు. భక్తులు పూజలు, అభిషేకాలు, పొంగళ్లు చేశారు. చౌడేశ్వరీ అమ్మవారికి బోనాలు రెంటచింతల: ఆషాఢమాస చివరి ఆదివారం చౌడేశ్వరి అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ప్రధాన అర్చకులు మారుతీశర్మ నేతృత్వంలో అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు గురజాల: కనకదుర్గ అమ్మవారికి మహిళలు ఆదివారం బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని పూజలు చేశారు. ఇనిమెట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపేట చెరువులో పూడికతీత పనుల్లో ఉపాధి కూలీలు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా అసలే కరువు ప్రాంతం. వ్యవసాయ పనులు ముగియగానే ఇక్కడి కూలీలు, సన్న, చిన్నకారు రైతులు పొరుగూళ్లకు వలస బాటపడతారు. ఇక ఊళ్లను అంటిపెట్టుకొని ఉంటున్న పేదలకు మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులే శరణ్యం. పూట గడవాలంటే ఉపాధి పనులే దిక్కు. అయితే ఉపాధి కూలీల ఆశలపై కూటమి ప్రభుత్వం మట్టి చల్లింది. వేతనాలు మంజూరు చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ఉపాధి పనుల పైనా కూడా కూలీలు ఆశలు వదులుకునే పరిస్థితి తెచ్చారు. ఒకప్పుడు పనుల్లో వేలల్లో పాల్గొనే కూలీలు నేడు పదుల సంఖ్యకు చేరారు. దీనికి కారణం వేతనాలు సమయానికి ఇవ్వకపోవడమే. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో 28 మండలాల్లో 531 గ్రామ పంచాయతీలు. మొత్తం 3.52 లక్షల జాబ్ కార్డులు. 6.09 లక్షల మంది సభ్యులు. యాక్టివ్ జాబ్ కార్డులు 2.75 లక్షలు. ప్రస్తుతం ఉపాధి హామీ పనులకు 4.72 లక్షల మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారుల లెక్క. జిల్లాలో 1.92 లక్షలు కుటుంబాలు పనులు పొందగా 3.23 లక్షల కూలీలు పనులు వినియోగించు కున్నారు. అయితే సమయానికి వేతనాలు రావడం లేదు. గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి 15 రోజులకోసారి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించేవారని దానికి భిన్నంగా ప్రస్తుత కూటమి పాలకులు రెండు నెలలు దాటినా వేతనాలు చెల్లించకపోవడం పట్ల ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో రూ.109.31 కోట్ల వేతనాలు... జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంట కాలువల పూడికతీత, చెరువుల పూడిక తీత, మిని గోకులాల నిర్మాణం, సేద్యపు నీటి కుంటలు, కంపోస్టు పిట్టులు, ఉద్యాన శాఖకు సంబంధించిన పనులు .. ఇలా మొత్తం 41 రకాల పనులు చేపట్టారు. వీటికి రూ. 155.87 కోట్లు రావాల్సి ఉండగా రూ. 46.56 కోట్లు విడుదల చేశారు. ఉపాధి కూలీలకు మే 10 నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. 70 రోజులుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో జిల్లాలో కూలీలకు రూ. 109.31 కోట్ల వేతన బకాయిలు పేరుకుపోయాయి. మే, జూన్ నెలలతో పాటు జూలైలో 10 రోజులకు సంబంధించిన వేతన బకాయిలు మొత్తం 109.31 కోట్లు ఉన్నాయి. 7న్యూస్రీల్వారం పది రోజుల్లో ఉపాధి వేతనాలు రెక్కలు విరిగేలా చెమటోడ్చినా కష్టార్జితం చేతికందని దౌర్భాగ్యం. అసలే వ్యవసాయం పనుల్లేక రైతులు, రైతు కూలీలు వలస బాట పడుతున్నారు. ఏదో ఊరిలో కాసుకొని ఉన్న రైతు కూలీలకు ఉపాధి పనులు కాస్త ఊరటగా నిలిచాయి. అయితే వేతన కష్టాలు తప్పడం లేదు. నెలలుగా వేతనాలు ఆపారు. ఉపాధి కూలీలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి కూలీలకు రెండు నెలలుగా అందని వేతనాలు జిల్లాలో పెండింగ్ వేతనాలు రూ.109.31 కోట్లు చొరవ చూపకుండా వేడుక చూస్తున్న కూటమి ప్రభుత్వం జిల్లాలో ఉపాధి కూలీల పనిదినాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేశాం. సాంకేతికంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నాం. అయితే మెటీరియల్ కాంపోనెంట్, మిని గోకులాలకు సంబంధించి విడుదలయ్యాయి. రెండు నెలలకు పైగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వారం పది రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. – ఎం.సిద్ధలింగమూర్తి, డ్వామా పీడీ, పల్నాడు -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు
సత్తెనపల్లి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో ఆదివారం సత్తెనపల్లి రూరల్ ఏఎస్ఐ శ్రీనివాసరావు (ర్యాంబో) నోటీసులు అందించారు. గత నెల 18న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జన సమీకరణ చేశారనే నెపంతో నమోదు చేసిన అక్రమ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు అందించారు. ఇప్పటికే దీనిపై పట్టణ పోలీస్టేషన్లో నమోదైన అక్రమ కేసులో విచారణకు ఈనెల 11న ఆయన హాజరయ్యారు. మరో అక్రమ కేసు సత్తెనపల్లి రూరల్ పోలీస్టేషన్లో నమోదు చేయడంతో సోమవారం ఆయన విచారణకు హాజరు కానున్నారు. అమ్మవారి ఆలయానికి రూ. 4 లక్షల విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐలు వజ్రాల క్రాంతికిరణ్, వెంకాయమ్మ దంపతులు, వారి కుమార్తెలు ఇషికారెడ్డి, మహిరా కిరణ్‌రెడ్డిలు రూ. 4 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో విరాళం చెక్‌ను అందజేశారు. ఆలయ నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళాన్ని గతంలో ప్రకటించడం జరిగిందని, ఇందులో భాగంగా రూ.4లక్షలు అందజేసినట్టు దాతలు వివరించారు. 566.70 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 566.70 అడుగులకు చేరింది. ఇది 248.2946 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 67,556 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అమ్మ వారికి బోనాలు దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారు పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారికి 1000 మంది మహిళలు బోనాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఈఓ కె.సునీల్‌కుమార్ పర్యవేక్షించారు. రవిచంద్రకుమార్‌కు అవార్డు గుంటూరు మెడికల్: ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో 40 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న తెలుగునాడు కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రెడ్ క్రాస్ లైఫ్‌మెంబర్ ఎం.రవిచంద్రకుమార్‌కు నంది అవార్డు లభించింది. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి విజయవాడలోని రితికా ఫౌండేషన్ ఆదివారం అవార్డు ఇచ్చి సత్కరించింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిత్యాచారికి రవిచంద్ర కతజ్ఞతలు తెలిపారు. -
జీవితాన్ని తీర్చిదిద్దిన బైరాగి కవిత్వం
తెనాలి: తెలుగు, హిందీ భాషల్లో గొప్ప రచనలు చేసిన ఆలూరి బైరాగి సాహిత్యం తన జీవితాన్ని మలుపు తిప్పిందని, ఎదగటానికి ఉపయోగపడిందని ప్రసిద్ధ రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. యువకుడిగా విద్యారంగమా, రాజకీయమా? అనే సంశయాత్మక పరిస్థితుల్లో ఉన్నపుడు గురువు ఆదేశ్వరరావు ద్వారా పరిచయమైన ఆలూరి బైరాగి కవిత్వం తనను ఉన్మాదుడిని చేసిందన్నారు. హిందీ, తెలుగు సాహిత్య రంగాలపై దృష్టి పెట్టి ఒక స్థాయిని సాధించగలిగానని చెప్పారు. సాహిత్య అకాడమీ, పట్టణానికి చెందిన సమరయోధుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వెంకటలక్ష్మమ్మ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఆదివారం ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో తెనాలికి చెందిన ప్రసిద్ధ రచయితలు ఆలూరి బైరాగి, శారదల శతజయంతి సదస్సు నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ బాబు ఆర్.వడ్లమూడి అధ్యక్షత వహించారు. ఇందులో ఆచార్య లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. కవిత్వం సహా వివిధ ప్రక్రియల్లో బైరాగి శైలిలో రచనలు చేసిన హిందీ కవులు ఎవరూ లేరని చెప్పారు. బైరాగి హిందీ సాహిత్యంపై సాహిత్య అకాడమీ సదస్సుకు కృషి చేస్తానని చెప్పారు. బైరాగి స్వస్థలమైన తెనాలిలో ప్రతిష్టకని రూ.1.30 లక్షలతో చేయించిన కాంస్యవిగ్రహాన్ని బహూకరించినట్టు గుర్తుచేశారు. ‘బైరాగి’ సాహిత్య స్వరం విలక్షణం బైరాగి జీవితం, సాహిత్యంపై ప్రముఖ రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ద్విభాషా పండితుడైన బైరాగిది తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన స్వరంగా చెప్పారు. ఎన్నెన్నో అధ్యయనాలు చేసినా తగిన మార్గం నిర్దేశించుకోలేక నిరంతర అన్వేషణ యాత్రికుడిగానే మిగిలి పోయారని అన్నారు. తన కవితా భాషను తానే తీర్చిదిద్దుకున్న బైరాగిలా ఆయన సమకాలికులు ఎవరూ రచనలు చేయలేదన్నారు. గొప్ప సీ్త్రవాది శారద ప్రముఖ రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఘనంగా ఆలూరి బైరాగి, శారదల శతజయంతి సదస్సు శారద జీవితం, రచనలపై ‘అరసం’ జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజాపక్ష ఉద్యమాలను తన కథల్లో ప్రతిబింబించిన శారద గొప్ప సీ్త్రవాదిగా చెప్పారు. కార్మికోద్యమాలను విజయాకాంక్షతో చూశారన్నారు. ఆకలి, అనారోగ్యంతోనే అద్భుతమైన సాహిత్య సృజన చేసిన శారద 31 ఏళ్లకే చనిపోయినట్లు పేర్కొన్నారు. శారద మరణాన్ని పాలకులు, ప్రచురణకర్తలు చేసిన హత్యగానే భావించాలని అభిప్రాయపడ్డారు. శారద తెలుగు రచయిత మాత్రమే కాదు...జాతీయ రచయితగా చెబుతూ, శాశ్వత స్మారకం ఉండాలన్నారు. శారద జన్మస్థలి పుదుక్కోటలో స్మృతిచిహ్నం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సాహిత్య అకాడమీ ప్రోగ్రాం అసిస్టెంట్ టీఎస్ చంద్రశేఖరరాజు స్వాగతం పలుకగా, తెలుగు సలహామండలి సభ్యుడు వల్లూరు శివప్రసాద్, ‘శారద’ కుమార్తె శారద, అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు మాట్లాడారు. తర్వాత జరిగిన రెండు సదస్సులకు కొత్తపల్లి రవిబాబు, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అధ్యక్షత వహించారు. ఆలూరి బైరాగి, శారద సాహిత్య ప్రక్రియలపై కందిమళ్ల శివప్రసాద్, కొర్రపాటి ఆదిత్య, పేరిశెట్టి శ్రీనివాసరావు, కె.శరచ్ఛంద్ర జ్యోతిశ్రీ , చెరుకూరి సత్యనారాయణ పత్రసమర్పణ చేశారు. -
పక్కలోకి వస్తేనే సంతకం పెడతా
బెల్లంకొండ: రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలంటూ వచ్చిన ఓ వివాహితను వీఆర్వో లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసింది. వీఆర్వో వెంకయ్య నాగిరెడ్డిపాలెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆఫీసుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడు. వారం రోజుల నుంచి వివాహిత వీఆర్వో వద్దకు వస్తుండగా కాలయాపన చేస్తూ పలుమార్లు తిప్పాడు. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ ఆమెను వేధించాడు. దీంతో 2 రోజుల క్రితం వీఆర్వో ఉంటున్న గది వద్దకు వివాహిత వెళ్లి ఆయన వేధింపులను సెల్ఫోన్లో వీడియో తీసి, శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్వోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తహశీల్దార్ టీ.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేసి, వీఆర్వోపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
చిన్నారుల తిండిపైనా చిన్నచూపే!
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అంగన్వాడీ కేంద్రాలను చిన్నచూపు చూస్తోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పంపిణీలో కాంట్రాక్టర్లు చేతి వాటం చూపుతున్నారు. నాసిరకం ఆహారం, సరుకులు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలో కుళ్లిపోయిన కోడిగుడ్లు, పాడైపోయిన కందిపప్పు చూసి లబ్ధిదారులు షాకయ్యారు. దీన్ని పౌష్టికాహారం అంటారా అని మండిపడుతున్నారు. అంతా నాసిరకం జిల్లాలో 1,480 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 6 నెలల నుంచి మూడేళ్లలోపు వయస్సున్న చిన్నారులు 49,976 మంది కాగా.. 3 – 6 సంవత్సరాలలోపు వారు 14,771, గర్భిణులు 9,148, బాలింతలు 7,009 మంది ఉన్నారు. కాంట్రాక్టర్లు కక్కుర్తితో నాసిరకం ఆహారం పంపిణీ చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ముడుపులు తీసుకుని అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కూటమి దెబ్బకు కష్టాలు గత ప్రభుత్వం హయాంలో అందరికీ సక్రమంగా పౌష్టికాహారం అందేది. వీటిలో కోత విధించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. ఆధార్ వెరిఫికేషన్ (ఈకేవైసీ), ఫేస్ రికగ్నేజేషన్ (ముఖ ఆధారిత ఽధ్రువీకరణ) ఉంటేనే పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆధార్‌కు లింక్ చేసిన ఫోను నంబర్లు చాలామందికి అందుబాటులోకి లేక ఓటీపీలు రావడం లేదు. ఆధార్ అప్డేట్ చేయించుకోకపోవడం వల్ల ఫేస్ రికగ్నేజేషన్ కాక ఆహారం తీసుకోలేకపోతున్నారు. నాణ్యత లేని పౌష్టికాహారం సరఫరాపై గుంటూరు అర్బన్ సీడీపీఓ అరుణను వివరణ కోరగా... కాంట్రాక్టర్లతో మాట్లాడి మంచి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి సర్కారు వచ్చాక అడ్డగోలుగా సరఫరా కాంట్రాక్టర్ల కక్కుర్తితో నాసిరకం పౌష్టికాహారం పంపిణీ కుళ్లిన కోడిగుడ్లు, పాడైపోయిన కందిపప్పు అందజేత కొత్త నిబంధనలతో లబ్ధిదారులకు అందని పౌష్టికాహారం -
‘స్వచ్ఛ’ అవార్డు రావడంపై సీఎం అభినందన
నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత పోటీల్లో గుంటూరు నగరపాలక సంస్థ ‘సూపర్ స్వచ్ఛ్ లీగ్ సిటీస్ అవార్డు’ పొందింది. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అభినందించారు. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్‌లతో కలిసి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని నగరపాలక సంస్థ అధికారులకు అందజేశారు. కార్యక్రమానికి కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ ఇన్చార్జి ఎంహెచ్ఓ జె.రామారావు, ప్రజారోగ్య విభాగ కార్మికులు హాజరయ్యారు. గుడికి వెళ్లాలంటే దుర్గంధం దాటాల్సిందే..! సత్తెనపల్లి: పట్టణంలోని వడ్డవల్లి శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లాలంటే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ పక్కన వ్యర్థాలను పడేసి వాటి పైగా రాకపోకలు సాగించడంతో మురుగు నిలిచి దుర్గంధం వెదజల్లుతుంది. భక్తి ప్రపత్తులతో ఆలయానికి వెళ్లి వచ్చే సమయంలో ఆ దుర్గంధాన్ని భరించలేక భక్తులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి ఆలయానికి వెళ్లే మార్గంలో దుర్గంధం వెదజల్లకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. నలుగురిపై కేసు నమోదు నిందితులకు రిమాండ్ విధింపు ముప్పాళ్ళ: డబ్బులు కోసం కట్టేసి కొట్టిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ముప్పాళ్ల ఎస్ఐ వి.సోమేశ్వరరావు ఆదివారం తెలిపారు. మండలంలోని దమ్మాలపాడు గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన దమ్మాలపాటి రవి అనే వ్యక్తిని శనివారం తెల్లవారుజామున డబ్బులు ఇవ్వాలంటూ కట్టేసి కొట్టి హింసించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బాఽధితుడు రవి ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన డి.వీరాంజనేయులు, గంధం నాగేంద్రబాబు, వలేటి గోపి, మదార్‌వలి పై కేసు నమోదు చేయటం జరిగిందని ఎస్ఐ తెలిపారు. వారిని సత్తెనపల్లి తహసీల్దార్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. -
12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలి
నరసరావుపేట ఈస్ట్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని రాష్ట్రోపాధ్యా సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు జోసఫ్ సుధీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఎస్టీయూ పల్నాడు జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులకు రావలసిన 11వ పీఆర్సీ ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్ ఉన్న కరువు భత్యం బకాయిలు విడుదల చేయాలని సుధీర్‌బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం యోగా, మెగా పీటీఎం, స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర పేరుతో బోధనేతర కార్యక్రమాలు చేపట్టటం వలన పాఠశాలల్లో బోధనా కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా శక్తి పేరుతో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఒత్తిడి చేయడం భావ్యం కాదన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.గంగాధరబాబు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి యు.చంద్రజిత్ యాదవ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఏ.ఏమండీ, ఎస్టీయూ గుంటూరు జిల్లా పూర్వ అధ్యక్షుడు గేరా మోహనరావు, కరిముల్లా, ఉపాధ్యాయు వాణి కన్వీనర్ జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ డిమాండ్ -
కార్మికులు సమ్మెలో .. చెత్త వీధుల్లో..!
సత్తెనపల్లి: పట్టణంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కొరవడింది. పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ప్రధానంగా పట్టణంలో పారిశుధ్యం దారుణంగా తయారైంది. పారిశుధ్య విభాగంలో 23 మంది పర్మినెంట్ వర్కర్లు, 136 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగంలో 53 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా వీరంతా సమ్మెలోకి వెళ్లడంతో కేవలం పారిశుధ్య విభాగంలోని 23 మంది పర్మినెంట్ వర్కర్లలో 17 మంది మాత్రమే విధులకు హజరై సేవలందిస్తున్నారు. దీంతో దుకాణాల ముందు, కాలువల్లో పేరుకు పోయిన చెత్తను తొలగించడం పెద్ద ప్రహసనంలా మారింది. ఇదిలా ఉంటే ఇంటింటి చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శన మిస్తున్నాయి. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురవడంతో వీధుల్లో చెత్త రోడ్ల మీదకు చేరి కంపు కొడుతుంది. మరో వైపు కుళాయిల ద్వారా సరఫరా చేసే నీరు రంగు మారి దుర్వాసన వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా కార్మికుల సమస్యల పరిష్కారానికి పాలకులు చర్యలు తీసుకొని పుర ప్రజలకు సేవలు అందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
నేడు సీడీపీఓ కార్యాలయాల వద్ద ధర్నా జయప్రదం చేయండి
నరసరావుపేట:ఎఫ్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా సీడీపీఓ కార్యాలయాల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలతోపాటు లబ్ధిదారులు పాల్గొని తమ నిరసన తెలపాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు కేపీ మెటిల్డాదేవి అధ్యక్షతన నిర్వహించారు. సుబ్బరావమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు తీరతాయని భావించిన అంగన్వాడీల పరిస్థితి పొయ్యి మీద నుంచి పెనం మీద పడిన చందంలా మారిందన్నారు. అంగన్వా డీ సెంటర్ల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పోషకాహారం పొందాలంటే ఎఫ్ఆర్ఎస్ తప్పనిసరైన నేపథ్యంలో సర్వర్లు మొరాయించటం, నెట్వర్క్, ఇతర సమస్యలతో అంగన్వాడీ సెంటర్లలో పోషకాహార నిల్వలు ఉన్నప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. 42 రోజుల అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఇచ్చిన మినిట్స్ అమలు అవుతాయని ఆశించి భంగపడ్డారన్నారు. నాలుగేళ్ల కిందట ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని వాటి స్థానంలో 5జీ ట్యాబ్‌లు పంపిణీ చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా ఆగస్టు నాటికి మారుస్తామని చెప్పి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయలేదన్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. యూనియన్ నాయకులు ఏఏల్ ప్రసన్న, బీవీ రమణ, సాయి, నిర్మల, కవిత, జ్యోతి, అహల్య, సుజాత, సావిత్రి, శ్రీదేవి పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపు -
బెజవాడలో మరో దారుణ హత్య?
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడలో ఇటీవల జరిగిన జంట హత్యల ఘటనను మరువక ముందే మధురానగర్ వంతెన వద్ద మరో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పీఎస్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 16వ తేదీన ఓ రౌడీషీటర్ రెచ్చిపోయి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హత్య చేసిన విషయం విదితమే. ఐదు రోజుల వ్యవధిలోనే మరో వ్యక్తి నడిరోడ్డుపై రక్తపు మడుగులో మృతి చెందాడు. వరుస ఘటనలతో ప్రజలు హడలిపోతున్నారు. రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి.. గుంటూరు జిల్లా మొగలాయిపాలెం గ్రామానికి చెందిన షేక్ సాదిక్ (28)కు నగరంలోని వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన కరిష్మతో 2019లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. సాదిక్ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. భార్యతో విభేదాల కారణంగా కొన్నేళ్ల నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇద్దరూ విడాకులకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. గుంటూరులోని తల్లి వద్దే ఉండేవాడు. ఈ నెల 16వ తేదీన విజయవాడ వెళ్లొస్తానని చెప్పి గుంటూరు నుంచి బయలుదేరాడు. 19వ తేదీన తల్లి రిహానాకు ఫోను కాల్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని తెలిపాడు. 20వ తేదీ తెల్లవారుజామున రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. అదుపులో అనుమానితులు కరిష్మతోపాటు ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితులుగా కనిపించిన గంజాయి బ్యాచ్ సభ్యులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. కరిష్మ మాత్రం భర్త అసలు ఇంటికే రాలేదని పోలీసులకు తెలిపింది. ఘటనా స్థలంలో సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దంపతుల ఫోన్ కాల్ డేటాలను కూడా సేకరిస్తున్నారు. సాదిక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ రిపోర్టు ఆధారంగా సాదిక్ మృతికి కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. గంజాయి బ్యాచ్ సభ్యులు హత్య చేసి ఉంటారని అనుమానాలు భార్య వివాహేతర సంబంధంపై మృతుడి బంధువుల ఆరోపణ మృతుడి భార్య, గంజాయి బ్యాచ్ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారణాలపై పోలీసుల దర్యాప్తు సాదిక్ వాంబే కాలనీలో ఉన్న తన భార్యను కలిశాడా, లేదా అనే విషయం నిర్ధారణ కాలేదు. వాంబే కాలనీ నుంచి మధురానగర్ వైపు ఉన్న ట్రెండ్ సెట్ మార్గంలో అక్కడే బస్టాప్ వద్ద రెండు రోజుల నుంచి అతను తిరుగుతూ ఉన్నట్లు తెలిసింది. తమ కోడలికి వివాహేతర సంబంధం ఉందని, వారే తన కొడుకును హతమార్చి ఉండొచ్చని సాదిక్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాదిక్ మరణించిన సమయంలో ఒంటిపై దుస్తులు లేకపోవడం, మధురానగర్ వంతెన వద్ద తల పగిలి తీవ్ర రక్తస్రావంతో విగతజీవిగా పడి ఉండటం వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సాదిక్ బ్యాగులో గంజాయి కూడా పోలీసులకు లభించినట్లు తెలిసింది. గంజాయి మత్తులో ఉండగా గంజాయి బ్యాచ్ సభ్యులకు, అతనికి ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? వారే అతడిని హత్య చేసి ఉంటారా? ఏదైనా వాహనం ఢీకొని మరణించాడా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.