
డీఎస్పీ నాగేశ్వరరావు సేవలు భావితరాలకు ఆదర్శం
నరసరావుపేట రూరల్: డీఎస్పీగా కె.నాగేశ్వరరావు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శం అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు సన్మాన కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ జేవి సంతోష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణలు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన డీఎస్పీ నాగేశ్వరరావును ఎస్పీ కె.శ్రీనివాసరావుతోపాటు పోలీసు అధికారులు సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ గతంలో రవాణా సౌకర్యాల కొరత ఉన్నా నక్సలిజం, ఇతర సవాళ్ల మధ్య ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఈ సేవల వెనుక కుటుంబ సభ్యుల త్యాగం, సహకారం ఎంతో ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు టి.మాణిక్యాలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ కె.శ్రీనివాసరావు