
కానిస్టేబుల్ ఫలితాల్లో మీరావలికి ప్రథమ స్థానం
బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తే తెగుళ్లు దూరం
నరసరావుపేట రూరల్: బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అరుణకుమారి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు వరి నారుమళ్లకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మంచి విత్తనం నాటితే మంచి దిగుబడి వస్తుందని ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి చేసి నాటడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు. రైతులకు బీజామృతంతో విత్తన శుద్ధి వలన కలిగే లాభాలను వివరించాలని తెలిపారు. వరి, కూరగాయలు, మిరపతోపాటు ఏ రకమైన విత్తనాలైనా సరే బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు స్వయంగా విత్తన శుద్ధి చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్, ఎన్‌ఎఫ్‌ఏ నందకుమార్, సైదయ్య, మేరి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
దుర్గి: ఇటీవల ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలలో మండల పరిధిలోని అడిగొప్పల గ్రామానికి చెందిన అభ్యర్థి షేక్ మీరావలి ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. తల్లిదండ్రులు మస్తాన్‌వలి, సైదాబి వ్యవసాయ పనులు చేస్తుంటారు. కుమారుడు కానిస్టేబుల్‌గా ఎంపిక కావటంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీరావలి మాట్లాడుతూ ప్రథమ స్థానం రావటం చాలా సంతోషంగా ఉందన్నారు.

కానిస్టేబుల్ ఫలితాల్లో మీరావలికి ప్రథమ స్థానం