
టీడీపీ నేతలతో సంబంధాలు..
నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన తండ్రీకొడుకులను బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు పరిఽధిలో హత్య చేయడం వెనుక ముందస్తు వ్యుహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సంతమాగులూరు గ్రామానికి చెందిన నిందితుడు బాదం మాధవరెడ్డికి బాపట్ల, ప్రకాశం జిల్లాలలో అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా పరిధి దాటగానే బాపట్ల జిల్లా ప్రారంభమైన 200 మీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ వెంచర్‌లో హత్యలు చేశారు. ముందస్తు పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి పరారయ్యారు.