
రివాల్వర్‌తో బెదిరించి..
రియల్టర్ల కిడ్నాప్‌నకు నిందితులు తుపాకీ ఉపయోగించినట్టు తెలుస్తోంది. నిందితులు హత్యల తరువాత పారిపోతూ చిలకలూరిపేట వద్ద వదిలిన కిడ్నాప్‌నకు ఉపయోగించిన కారులో లభించిన రివాల్వర్ పౌచ్ ద్వారా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఈ కారులో తుపాకీ పౌచ్‌తోపాటు హత్యలకు వినియోగించేందుకు తెచ్చిన ఓ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తుపాకీ, కత్తులతో బెదిరించడం వల్లే తండ్రీకొడుకులు కిడ్నాప్‌నకు గురయ్యే సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేయలేకపోయి ఉంటారని భావిస్తున్నారు.