కొరవడిన సంతోషం | - | Sakshi
Sakshi News home page

కొరవడిన సంతోషం

Jul 27 2025 6:55 AM | Updated on Jul 27 2025 6:55 AM

కొరవడ

కొరవడిన సంతోషం

సంక్షేమంలో
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సమస్యల స్వాగతం

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు కొరవడుతున్నాయి. ముఖ్యంగా హాస్టళ్లలోని విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదు. నాసిరకమైన కూరగాయలతో వండి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని చీపురు, ఫినాయిల్‌ లాంటివి కొనుగోలు చేసేందుకు కూడా నిధులు లేకపోవడంతో నిర్వహణ ఎలా సాధ్యమని హాస్టల్‌ వార్డెన్లు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ శనివారం జిల్లాలోని పలు హాస్టళ్లను విజిట్‌ చేయగా సమస్యలు వెలుగుచూశాయి.

సత్తెనపల్లి: జిల్లాలో ప్రీ మెట్రిక్‌ బీసీ 20, ఎస్సీ 18, ఎస్టీ 6, పోస్ట్‌ మెట్రిక్‌ బీసీ 14, ఎస్టీ 11, ఎస్టీ మూడు హాస్టళ్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 7,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలు ఉండే సంక్షేమ వసతి గృహాలు సమస్యల ఊబిలో చిక్కుకున్నాయి. అసౌకర్యాల మధ్య రేపటి పౌరులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణను కూటమి ప్రభుత్వం విస్మరించింది. హాస్టళ్లు పునఃప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కొన్ని చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. కిటికీలకు దోమతెరలు లేవు. వర్షాకాలంలో దోమలు విజృంభిస్తుండడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఇంతవరకు బెడ్‌ షీట్లు ఇవ్వలేదు. అద్దె భవనాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అల్లాడి పోతున్నారు.

సక్రమంగా అమలు కాని మెనూ

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాసిరకమైన భోజనం పెడుతున్నా వారిని ప్రశ్నించేవారు లేరు. గత ప్రభుత్వం వసతి గృహాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మెనూ ప్రకారం భోజనం అందించేది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వసతి గృహాల్లోని విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కొరవడింది. దీనికి తోడు ఇటీవల కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో నిర్వాహకులు నాసిరకమైన కూరగాయలు తెచ్చి వాటితోనే విద్యార్థులకు భోజనం చేసి పెడుతున్నారు. ఆ ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి తోడు వంటగది, బాత్‌రూములు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం నిధులు కాజేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

పాములకు నిలయంగా బీసీ బాలుర హాస్టల్‌

నరసరావుపేట మండలం కోటప్పకొండ బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోటప్పకొండలోని జెడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలోనే ఉన్న ఈ హాస్టల్‌కు ప్రకాశం జిల్లాతోపాటు వినుకొండ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి చేరుతుంటారు. కొండ పక్కనే ఈ వసతి గృహం ఉండటంతో పాములు హాస్టల్‌ ప్రాంగణంలోకి తరచూ వస్తున్నాయి. మరుగుదొడ్లు ఆరు బయట ఉండటంతో రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే విద్యార్థులు భయపడాల్సి వస్తుంది. దీంతోపాటు విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు అందుబాటులో లేవు. విద్యార్థులు స్నానాలు చేసేందుకు సమీపంలోని త్రికోటేశ్వర జెడ్పీ హైస్కూల్‌పై ఽఆధారపడాల్సి వస్తుంది. హాస్టల్‌ ఆధునీకరించి మంచాలు అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ గదులకు తలుపులు ఏర్పాటుచేయలేదు. హాస్టల్‌లో వార్డెన్‌ అందుబాటులో ఉండకపోవడం, సీనియర్‌ విద్యార్థుల వేధింపులు, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాది 80 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్‌లో ఈ ఏడాది 30 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. గత నెల 31వ తేదీ హాస్టల్‌ వార్డెనన్‌ ఉద్యోగ విరమణ చేయగా, నూతనంగా మరో వార్డెన్‌న్‌ను ఉన్నతాధికారులు నియమించారు.

అందని కాస్మోటిక్‌ ఛార్జీలు

ప్రీ మెట్రిక్‌ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే 3–6 తరగతుల బాలురకు నెలకు ఒక్కొక్కరికి రూ.175, బాలికలకు రూ.130, 7నుంచి 10 వరకు చదివే బాలురకు రూ.200, బాలికలకు రూ.200 కాస్మోటిక్‌ చార్జీలు చెల్లించాలి. అలాగే పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.250 కాస్మోటిక్‌ చార్జీలను ప్రభుత్వం ప్రతి నెలా చెల్లించాలి. 2024 సెప్టెంబర్‌ నుంచి ప్రీ మెట్రిక్‌ వసతి గృహాల విద్యార్థులకు, 2024 మార్చి నుంచి పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు రావాల్సి ఉంది. ఇవి ప్రతి నెలా అందకపోవడంతో విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతతోపాటు దుస్తులు శుభ్రపరుచుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు విద్యార్థులు మురికి దుస్తులతోనే పాఠశాలలకు, కళాశాలలకు వెళుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికై నా సంక్షేమ వసతి గృహాల పట్ల పాలకులు, జిల్లా అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

అద్దె భవనంలోనే ‘సంక్షేమం’

వినుకొండ పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరింది. దీంతో రెండేళ్లుగా అద్దె భవనంలోనే వసతిగృహం నిర్వహిస్తున్నారు. స్నానపు గదులు మాత్రం లేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. 80 మందికి మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉండటంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ నూతన భవనం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో విద్యార్థుల పాలిట శాపంలా మారింది.

అమరావతిలో అరకొర వసతులు

అమరావతి మండలం ధరణికోటలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో 50 శాతం విద్యార్థులు కూడా లేని పరిస్థితి ఉంది. ఎస్సీ హాస్టల్‌లో మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 25 మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ బాలుర హాస్టల్‌లో 23 మంది విద్యార్థులు ఉన్నారు. స్నానాల గదులు ఉన్నప్పటికి వాటికి తలుపులు లేవు. హాస్టల్‌కు ఉత్తరాన క్రోసూరు రోడ్డువైపు ప్రహరీ లేకపోవటంతో అకుపచ్చపట్ట కట్టారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం కురిస్తే చిత్తడే..

వందల మందికి ఒక్కరే వంట మనిషి

జిల్లాలో 14 బీసీ, 11 ఎస్సీ, 3 ఎస్టీ పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క హాస్టల్‌లో 100 మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. సత్తెనపల్లిలోని వెంకటపతి కాలనీలోగల ఎస్సీ పోస్ట్‌మెట్రిక్‌ బాలికల వసతి గృహంలో 340 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇంత మందికి ఒక్కరే వంట మనిషి ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అనేది కనీసం జిల్లా స్థాయి అధికారులు ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇది సాధ్యం కాక ప్రతి హాస్టల్‌లో అదనంగా ఇరువురిని వార్డెన్లు నియమించకొని చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఇలా ప్రతి వసతి గృహంలో ఏదో ఒక సమస్య విద్యార్థులను వెంటాడుతుంది. ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పలుచని సాంబారు ..

రుచి లేని భోజనం

విద్యార్థులకు అందని బెడ్‌షీట్లు,

పేట్లు, గ్లాసులు

నెలలతరబడి అందని

కాస్మోటిక్‌ చార్జీలు

అవస్థలతో తప్పని సహవాసం

జిల్లాలో 44 ప్రీ మెట్రిక్‌,

28 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహలు

నరసరావుపేట పెద్దచెరువు 9వ లైనులో ఓ ప్రైవేటు బిల్డింగ్‌లో కొనసాగుతున్న ఎస్సీ బాలుర హాస్టల్‌, ప్రకాష్‌నగర్‌లోని బీసీ బాలుర హాస్టల్‌లో 4వ వాల్గవ తరగతి నుంచి బీటెక్‌ చదివే సుమారు 280 మంది విద్యార్థులు ఉంటున్నారు. వర్షం కురిస్తే ఎస్సీ హాస్టల్‌ మొత్తం చిత్తడి చిత్తడిగా తయారవుతుంది. కొన్ని గదుల్లోకి నీరు వస్తుంది. ఒకటీ, రెండు గదుల్లో సగం నీరు ఉండగా మిగతా సగంలో ఓ విద్యార్థి పడుకొని ఉండటం కన్పించింది. డ్రమ్ముల్లో పట్టిన నీటినే విద్యార్థులు తాగునీరుగా ఉపయోగిస్తున్నారు. హాస్టల్‌ మొదటి అంతస్తు కారిడార్‌ మధ్యలో నీరు పోయేందుకు కాలువ ఏర్పాటుచేశారు. విద్యార్థులు పడుకునేందుకు ఎక్కడా బెడ్లు లేవు. గదుల్లో నేలపై చాపలు, దుప్పట్లు పర్చుకొని పడుకుంటున్నారు. బీసీ బాలుర హాస్టల్‌లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు సామూహికంగా స్నానాలు చేస్తున్నారు. బియ్యంలో ముక్కపురుగులు ఉన్నాయి.

కొరవడిన సంతోషం1
1/7

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం2
2/7

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం3
3/7

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం4
4/7

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం5
5/7

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం6
6/7

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం7
7/7

కొరవడిన సంతోషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement