
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలసిన బాఽధితులు
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ సీపీ సానుభూతిపరులన్న నెపంతో దుర్మార్గంగా మా ఇళ్లను కూల్చేశారని బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం కలసి తమగోడును విన్నవించుకున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వెంట వెళ్లి జననేతకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కూటమి నాయకుల ఆదేశాలతో నిరుపేదలమన్న కనికరం కూడా లేకుండా అధికారులు ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ద్వారా న్యాయపోరాటానికి అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారని బాధితులు మీడియాకు తెలిపారు. తమ సమస్యను జగనన్న వరకు తీసుకెళ్లిన బొల్లా బ్రహ్మనాయుడికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన బాధితులలో గంగబోయిన వెంకటనారాయణ, కంభంపాటి జీవన్ ఉన్నారు.