
జిల్లాలో సరిపడా వరి విత్తనాలు
జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు
నకరికల్లు: డిమాండ్‌కు సరిపడా వరి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని నర్శింగపాడు గ్రామంలో బోర్లు, బావుల కింద సాగవుతున్న వరి నారుమడులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 39,079 హెక్టార్లలో వరిసాగు చేయనున్నట్లు తెలిపారు. బీపీటీ–5204, జేజీఎల్–384, కేఎన్‌ఎం–1638, అంకుర్‌పద్మ, అంకుర్‌సోనమ్, హెచ్‌ఎంటీ సోనం విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. రైతుసేవ కేంద్రాల ద్వారా పంటసాగుకు కావలసిన ఎరువులను రైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఎకరాకు 100–200కేజీల వర్మీకంపోస్టు వాడడం ద్వారా వరిపంటలో నాణ్యత పెరుగుతుందన్నారు. అనంతరం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను సందర్శించి వర్మీకంపోస్టు ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఏడీఏ బి.శ్రీకృష్ణదేవరాయలు, ఏఓ కె.దేవదాసు, పంచాయతీ కార్యదర్శి కె.అప్పారావు, వ్యవసాయ విస్తరణాధికారి కె.దిలీప్‌కుమార్, ముస్తాక్, రైతులు జినుగు చంద్రశేఖర్‌రెడ్డి, కై పు రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.